జాతీయ వార్తలు

పేదరిక నిర్మూలనే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, జూన్ 25: రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ఒడిశా గవర్నర్ గణేషీలాల్ ప్రకటించారు. పేదరిక ఐదుశాతం దిగువకు తగ్గించే కార్యాచారణతో ముందుకెళ్తున్నట్టు, వచ్చే ఐదేళ్లలో లక్ష్య సాధనకు కృషి చేస్తున్నట్టు మంగళవారం ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలకు వైద్య సహాయం ఏడు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతున్నట్టు స్పష్టం చేశారు. 16వ అసెంబ్లీ తొలి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ పలు పథకాలను ప్రకటించారు.‘ రైతులకు వ్యవసాయం లాభదాకంగా చేయడానికి చర్యలు చేపట్టాం. సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలుచేయడం ద్వారా పేదరికాన్ని ఐదు శాతం దిగువకు తీసుకెళ్తాం. రానున్న ఐదేళ్లలో లక్ష్యాన్ని సాధిస్తాం’అని ఆయన పేర్కొన్నారు. బిహార్‌లో పేదరిక 33.34 శాతం, ఒడిశాలో 32.59 శాతంగా నమోదైంది. 2011-12నాటి గణాంకాలలు వెల్లడిస్తున్నాయి. 2004-05లో బిహార్‌లో 54.40, ఒడిశాలో 57.20 శాతం మంది పేదలుండేవారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కౌషక్ అసిస్టెంట్ ఫర్ లైలీహుడ్ అండ్ ఇన్‌కం అగ్‌మెంటేషన్) ‘కలియా’ సత్ఫలితాలు ఇస్తోందని, మున్ముందు దాన్ని కొనసాగిస్తామని గవర్నర్ వెల్లడించారు. రైతులు, భూమిలేని వ్యవసాయ కార్మికులకు కలియాతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో చిన్న, మధ్య తరగతి రైతులకు వడ్డీలేకుండా రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు గణేషీలాల్ చెప్పారు. లక్ష రూపాయల వరకూ ఉచితంగా రుణ సదుపాయం కల్పిస్తున్నామని అలాగే నీటిపారుదల రంగం అభివృద్ధికి 50వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్టు గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్భ్రావృద్ధిలో మహిళలను కీలక భాగస్వాములుగా చేయడానికి ‘మిషన్ శక్తి’ పథకం అమలుచేస్తున్నట్టు తెలిపారు. అలాగే బిజూ స్వస్థ్య యోజన పథకం కింద మహిళలకు పది లక్షల రూపాయల వరకూ వైద్య సహాయం కల్పిస్తారు. ప్రస్తుతం ఏడు లక్షల రూపాయలే ఇస్తున్నారు. రాష్ట్రంలో భర్తలు చనిపోయిన మహిళలు, అనాధ మహిళలకు సామాజిక భద్రత పథకం కింద పెన్షన్ ఇస్తారు, మిషన్ శక్తి పథకం కింద వడ్డీలేకుండా ఐదు లక్షల రూపాయల వరకూ ఆర్థిక సహాయం అందిస్తామని గవర్నర్ తెలిపారు. గ్రామపంచాయతీ, జిల్లా కేంద్రాల్లో మిషన్ శక్తి భవనాలు నిర్మిస్తామన్నారు. రానున్న రోజుల్లో 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న గవర్నర్ ‘ విద్యార్థులకు ఉన్నత విద్యకు వడ్డీలేకుండా రుణ సదుపాయం కల్పిస్తాం’అని ప్రకటించారు. ఉద్యోగాల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.