జాతీయ వార్తలు

వాణిజ్య అంశాలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ బుధవారం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పోంపియోతో జరిపే చర్చల్లో ఉగ్రవాదం, హెచ్1బీ వీసాలు, వాణిజ్యం, ఇరాన్ నుంచి చమురు కొనుగోలుపై అమెరికా ఆంక్షలు విధించిన తరువాత తలెత్తిన పరిస్థితులు వంటి అంశాలు చర్చకు రానున్నాయి.
మైక్ పోంపియో భారత పర్యటన మంగళవారం రాత్రి మొదలవుతుంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తరువాత ఒక విదేశీ ఉన్నత స్థాయి నాయకుడు భారత పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. జైశంకర్, పోంపియో బుధవారం చర్చలు జరుపుతారు. జైశంకర్ విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న మొదటి సమావేశం ఇది. జపాన్‌లోని ఒసాకాలో ఈ నెల 28-29 తేదీలలో జరిగే జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ విడిగా సమావేశం కానున్న తరుణంలో పోంపియో భారత పర్యటనకు వస్తున్నారు. పోంపియో ఈ పర్యటనలో జైశంకర్ ఇచ్చే మధ్యాహ్న విందును స్వీకరిస్తారు. ప్రధాని మోదీని కూడా ఆయన కలుస్తారు. పోంపియో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో భారత, అమెరికా వ్యాపార సంస్థల ప్రతినిధులను కలుస్తారు. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఒక విధానోపన్యాసం చేస్తారు. జైశంకర్ గాంధీనగర్‌లో పోంపియో పర్యటన గురించి మాట్లాడుతూ, పోంపియోతో చర్చల సందర్భంగా భారత్ వాణిజ్య అంశాలను ప్రస్తావిస్తుందని తెలిపారు.
జైశంకర్ గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేయడానికి మంగళవారం గాంధీనగర్‌లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ‘మేము సానుకూల వైఖరితో సమావేశం అవుతాము’ అని అన్నారు. ‘మైక్ పోంపియోతో జరిగే సమావేశం ఒక ముఖ్యమయిన సమావేశంగా ఉంటుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించిన అంశాలను ఈ సమావేశంలో తప్పనిసరిగా చర్చించడం జరుగుతుంది’ అని జైశంకర్ అన్నారు. ‘ఇరు దేశాలకు స్వంత ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల ఇరు దేశాల మధ్య వైరుధ్యాలు తలెత్తడం సహజం. మేము దౌత్యాన్ని ఉపయోగించి ఉమ్మడి ప్రయోజనాలను కనుగొంటాం. మేము సానుకూల దృక్పథంతోనే పోంపియోతో చర్చలు జరుపుతాము’ అని జైశంకర్ వివరించారు.
చిత్రం...అమెరికా విదేశాంగ మంత్రి మైక్ ఫామ్‌పియో భారత పర్యటనకు నిరసనగా ఢిల్లీలో మంగళవారం ప్రదర్శన జరుపుతున్న వామపక్ష పార్టీలు