జాతీయ వార్తలు

ఓటమి బాధ్యత అందరిదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 25: లోక్‌సభలో కాంగ్రెస్ ఘోర పరాజయం నేతల సమష్టి బాధ్యతే తప్ప ఒక్క అధ్యక్షుడు రాహుల్ గాంధీనే బాధ్యుడ్ని చేయడం సరైంది కాదని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అశోక్ చనాన్ స్పష్టం చేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘రాహుల్ గాంధీ రాజీనామాను హైకమాండ్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించదు’అని తెలిపారు. నాందేడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అశోక్ చవాన్ కూడా ఓటమి పాలయ్యారు. రాహుల్ గాంధీ ముందు నడిచి పార్టీ కోసం తీవ్రంగా కష్టపడ్డారని చవాన్ తెలిపారు. ‘రాహుల్ తన భుజస్కంధాలపై వేసుకుని ప్రచారం నిర్వహించారు. ఆయనను తప్పుపట్టలేం. ఓటమికి అందరూ బాధ్యత వహించాల్సిందే’అని పీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాఖల్లోని సీనియర్లు అందరూ తప్పుకొని యువతకు పగ్గాలు అప్పగించాలని అశోక్ చవాన్ సూచించారు. మహారాష్ట్రంలో తాను, తన సహచరులు పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు. దేశంలో యూపీ తరువాత ఎక్కువ లోక్‌సభ స్థానాలున్నది మహారాష్టల్రోనే. 48 లోక్‌సభ స్థానాలుండగా కాంగ్రెస్ ఒక్కచోటే గెలించింది. చంద్రాపూర్ నుంచి సురేష్ ధనోర్కర్ విజయం సాధించారు.‘పార్టీలో ఎలాంటి అసమ్మతి లేదు. ఎన్నికల్లో అందరం కలిసే పనిచేశాం. గెలుస్తామని పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. అయితే ఫలితాలు భిన్నంగా వచ్చాయి’అని చవాన్ పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవని ఆయన వెల్లడించారు. నివేదిక కోసం వేచిచూస్తున్నట్టు పీసీసీ చీఫ్ తెలిపారు. ప్రకాశ్ అంబేద్కర్ నాయకత్వంలోని వంచిత్ బహుజన్ అగాధి(వీబీఏ), ఎఐఎంఐఎం కూటమి వల్లే కాంగ్రెస్-ఎన్‌సీపీకి దక్కాల్సిన తొమ్మిది నుంచి పది సీట్లు కోల్పోయినట్టు వచ్చిన కథనాలు చవాన్ దృష్టికి తీసుకురాగా ‘వీబీఏ పార్టీ బీజేపీకి బీ టీమ్’ అంటూ నిప్పులు చెరిగారు. నాందేడ్ నుంచి పోటీచేసిన అశోక్ చవాన్ 40వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ వీబీఏ అభ్యర్థికి లక్ష ఓట్లదాకా పోలయ్యాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉంటాయని, కాంగ్రెస్ పుంజుకుని మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్న ధీమా చవాన్ వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్‌లో అత్యున్నత విభాగం సీడబ్ల్యూసీ శనివారం రాజధాని ఢిల్లీలో సమావేశమై లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పేలవమైన ప్రదర్శనపై చర్చించినట్టు చవాన్ వివరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన
ఈ సమావేశంలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, యూపీ(ఈస్ట్) ఇన్‌చార్జి ప్రియాంక గాంధీ, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరయ్యారు.