జాతీయ వార్తలు

సంస్థాగత యంత్రాంగం కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమేథీ, మే 25: అమేథీ నియోజకవర్గం 1980 నుంచి గాంధీ కుటుంబం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి ఈ నియోజకవర్గంలో ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అధ్యక్షుడు, సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీ పరాజయం పాలుకావడం చర్చనీయాంశమయింది. కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో సంస్థాగత యంత్రాంగం తగినంతగా లేకపోవడం, గ్రామీణ ప్రజాబాహుళ్యంతో సంబంధాలు లేకపోవడం రాహుల్ గాంధీ ఓటమికి దారితీశాయని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో 55,120 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సంస్థాగతమయిన మద్దతు లేనప్పటికీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అమేథీలో గెలుస్తూ వచ్చిందంటే దానికి కారణం గాంధీ కుటుంబానికి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజాకర్షణ, పేరు ప్రతిష్టలేనని స్థానికులు అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీ స్మృతి ఇరానీని 1,07,903 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. స్మృతి ఇరానీ ఒక పథకం ప్రకారం కలిసికట్టుగా చేపట్టిన ప్రచారమే ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తొలి సవాలుగా నిలిచింది. వెనుకబడిన ఈ నియోజకవర్గంలో స్మృతి ఇరానీ తన పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేయడంతో కాంగ్రెస్ పార్టీ కోటకు బీటలు వారడం మొదలయింది. రాహుల్ గాంధీ సిట్టింగ్ ఎంపీగా తరచుగా అమేథీకి వచ్చినప్పటికీ, ఆయన నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి అక్కడి ప్రజానీకంతో మమేకం కావడంలో విఫలమయ్యారు. ‘రాహుల్ గాంధీ ఫుర్‌సత్‌గంజ్ విమానాశ్రయంలో దిగి, నేరుగా అమేథీకి వెళ్లేవారు. ఆయన కార్యక్రమాలు అమేథీకి మాత్రమే పరిమితం అయ్యేవి. ఆయన ప్రజలకు తగినంత సమయం ఇవ్వలేదు. అలాంటప్పుడు ఆయన ఓట్లెలా పొందుతారు?’ అని సాలోన్ నావిన్ మండి ఏరియాలోని టోకు వర్తకుడు నీల్ సింగ్ అన్నారు. రాహుల్ గాంధీకి ఓటర్లతో పైపై సంబంధాలు మాత్రమే ఉన్నాయని సాలోన్ బస్‌స్టాండ్‌లో టీ స్టాల్ నడుపుతున్న రాజు సోలంకి పేర్కొన్నారు. ‘రాహుల్ అవకాశాలను ఆయన సలహాదారుల బృందమే దెబ్బతీసింది’ అని ఆయన అన్నారు. ‘ఆయన (రాహుల్ గాంధీ) కార్యక్రమాలు ప్రధాన ప్రదేశాలు, హైవేల చుట్టూనే ఏర్పాటు చేసేవారు. స్మృతి ఇరానీ ఇందుకు భిన్నంగా గ్రామాలకు, ప్రజల ఇళ్లకు వెళ్లి స్థానికులతో ప్రత్యక్ష సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు.
అభివృద్ధి కోసం, మార్పు కోసం తనకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. దాని ద్వారా ఆమె లబ్ధిపొందారు’ అని రాజు వివరించారు. ప్రియాంక ప్రచారం కూడా రాహుల్ గాంధీ కన్నా భిన్నంగా లేదని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఆమె కార్యక్రమాలను రూపొందించిన వారికి నియోజకవర్గం గురించి సరయిన అవగాహన లేదని వారు పేర్కొన్నారు.