జాతీయ వార్తలు

రాష్టప్రతికి కొత్త ఎంపీల జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన పార్లమెంటు సభ్యుల జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారంనాడు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేసింది. 17వ లోక్‌సభ ఏర్పాటుకు విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర రాష్టప్రతిని కలసి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికైన పార్లమెంటు సభ్యుల పేర్లతో కూడిన సమగ్ర జాబితాను అందజేసినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల కమిషన్ కొత్తగా ఎన్నికైన ఎంపీల జాబితాను రాష్టప్రతికి పంపడం ద్వారా కొత్త లోక్‌సభ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోనున్నారు. ఇదిలావుండగా, లోక్‌సభ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు విశేష కృషి చేసినందుకు ఎన్నికల కమిషన్‌ను రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌తోపాటు, మిగిలిన ఎన్నికల కమిషనర్లను సైతం అభినందించారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బందితోపాటు గట్టి బందోబస్తు మధ్య ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు తగిన పాత్ర పోషించినందుకు ఎన్నికల కమిషన్‌ను రాష్టప్రతి అభినందించారు. అదేవిధంగా ఎన్నికల్లో వందలాది మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలావుండగా, అంతకుముందు 16వ లోక్‌సభను రద్దు చేస్తూ కేంద్ర కేబినెట్ చేసిన ప్రతిపాదనను రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అంగీకరించారు.