జాతీయ వార్తలు

మందుపాతరలను తట్టుకునే వాహనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: కేంద్రం ప్రభుత్వం దేశంలో మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే సాయుధ బలగాలకు అత్యాధునిక వాహనాలు సమకూర్చనుంది. తీవ్రవాదం ప్రభావిత జమ్మూకాశ్మీర్, నక్సల్ బాధిత ప్రాంతాల్లో మందుపాతరలను తట్టుకుని పనిచేసే వాహనాలు అందజేయనుంది. ఎన్‌ఎస్‌జీ కమాండో దళానికి రిమోట్‌తో పనిచేసే వాహనాలు సమకూర్చనున్నట్టు మంగళవారం ఓ అధికార ప్రకటనలో వెల్లడించారు. వీటి కోసం 613.96 కోట్ల రూపాయలు విడుదల చేశారు. సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ దళాలకు అదనంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, అంబులెన్స్‌లు, మందుపాతర రక్షిత వాహనాలు కొనుగోలు చేస్తారు. అలాగే 16.84 కోట్ల రూపాయలతో ఎన్‌ఎస్‌జీకి రిమోట్‌తో పనిచేసే ఏడు వాహనాలు కొనుగోలు చేయనున్నట్టు హోమ్‌మంత్రిత్వశాఖ వెల్లడించింది.