జాతీయ వార్తలు

మిషన్ శక్తితో రోదసిపై పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర పారా/ బాలాసోర్, ఏప్రిల్ 23: గత ప్రభుత్వాలు దేశభద్రతను విస్మరించి ఓ కుటుంబ ప్రయోజనాలను పరిరక్షించేందుకే పాటుపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సొంత సామర్థ్యం ఉన్నప్పటికీ ఉపగ్రహ నిరోధక క్షిపణి ప్రయోగాన్ని అప్పటి కాంగ్రెస్ చేయలేదని మంగళవారం నాడిక్కడ జరిగిన ర్యాలీలో మోదీ పేర్కొన్నారు. ఉపగ్రహ ప్రయోగం ద్వారా తమ ప్రభుత్వం భారతదేశం అంతరిక్ష సామర్థ్యాన్ని చాటిచెప్పిందని తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ప్రభంజనం సాగుతోందని, దీంతో కాంగ్రెస్ పార్టీకి, మిగతా ప్రతిపక్షాలకు నిద్రపట్టడం లేదని ఆయన అన్నారు. ఒడిసాలోని 21 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ బలాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతో ఇప్పటివరకు ఆరుసార్లు మోదీ స్వయంగా ప్రచారానికి వచ్చిన విషయం గమనార్హం. రాష్ట్రంలోని అనేకచోట్ల జరిగిన ర్యాలీలు, రోడ్‌షోల్లో మాట్లాడిన మోదీ ఇటీవల తమ ప్రభుత్వం జరిపిన చారిత్రక ఉపగ్రహ నిరోధక క్షిపణి ప్రయోగాన్ని ప్రస్తావించారు. మిషన్ శక్తి పేరిట భారత్ చేపట్టిన ఈ ప్రయోగం ప్రపంచ దేశాల నీరాజనాలు అందుకుందని, కాని దేశంలోని కొన్ని వర్గాలకు మాత్రం నిరాశే మిగిలిందని అన్నారు. మొబైల్ నుంచి క్షిపణి వరకు ప్రతి అంశాన్ని కూడా టెక్నాలజీ ద్వారానే నియంత్రిస్తున్నారని, ఈ లక్ష్యాన్ని సాధించాలంటే భారత్ దేశానికి అంతరిక్ష భద్రత ఎంతో అవసరమన్నారు. కాని గత ప్రభుత్వాలు ఈ వాస్తవాన్ని విస్మరించాయని విమర్శించారు. మిషన్ శక్తి ప్రయోగాన్ని రహస్యంగా ఉంచాలని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయని, ‘ఈ చారిత్రక ప్రయోగాన్ని ఎందుకు రహస్యంగా ఉంచాలి? ఇదేమీ చౌర్యం కాదు కదా, ఎవరినీ దోచుకుని ఈ లక్ష్యాన్ని సాధించలేదు కదా’ అని ప్రశ్నించారు. మిషన్ శక్తి ప్రయోగం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లలేదని, పైగా భారత్‌కు అంతరిక్షంలో మరో శిఖరాన్ని అధిరోహించే అవకాశం దక్కిందని మోదీ పేర్కొన్నారు.