జాతీయ వార్తలు

ప్రధాని పదవి వేలానికి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసన్‌సోల్ (పశ్చిమబెంగాల్), ఏప్రిల్ 23: దేశంలోని అత్యున్నత ఉద్యోగమైన ప్రధాన పదవి వేలానికి లేదని, దానిని నారద, శారద లాంటి చిట్ కుంభకోణాల్లో సంపాదించిన డబ్బుతో పొందలేరని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్రమోదీ పంచ్ వేశారు. ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన మమతా బెనర్జీని ‘స్పీడ్ బ్రేక్ దీదీ’గా పదేపదే అభివర్ణించారు. ‘మన దీదీ ప్రధాన మంత్రి కావాలన్న ఆశతో పలు సీట్లలో పోటీ చేస్తున్నారు.. ఒక వేళ ప్రధాన మంత్రి పదవిని కనుక వేలంలో పెడితే దానిని దక్కించుకోవడానికి కాంగ్రెస్, దీదీ తమ అక్రమ సంపాదన సంచులతో తరలివస్తారు.. అయితే దీదీ.. ఈ పదవి వేలానికి కాదన్న విషయం గుర్తుంచుకో.. శారద, నారద కుంభకోణాల అక్రమ సంపాదనతో ఇది దొరకదని మర్చిపోకు’ అని ప్రధాని వ్యంగ్యంగా అన్నారు. ఈ సందర్భంగా ఆయన బాలాకోట్‌పై వాయుసేన దాడుల అంశాన్ని ప్రస్తావిస్తూ ‘ఈ నూతన భారత్ భద్రత, గౌరవాన్ని కోరుకుంటోంది. మీ ఓట్ల బలం వల్లే మన ఆర్మీ జవాన్లు వాయుదాడులు విజయవంతంగా నిర్వహించారు.. అంతరిక్షంలోని శత్రుదేశాల ఉపగ్రహాలను సైతం కూల్చగలిగే శక్తిని సమకూర్చుకున్నాం.. మీరు ఇలాంటి బలమైన, నమ్మకమైన ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదా?’ అని ఆయన ప్రజలను ప్రశ్నించారు.