జాతీయ వార్తలు

బీజేపీలో చేరిన సన్నీ డియోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ మంగళవారం సన్నీ డియోల్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సన్నీ డియోల్ విలేఖరులతో మాట్లాడుతూ బీజేపీ సీనియర్ నాయకుడు తన తండ్రి ధర్మేంద్ర పనిచేసిన తరహాలోనే తాను కూడా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. పార్టీకోసం నిస్వార్థంగా పనిచేసి నా సామర్థ్యాన్ని నిరూపించుకుంటానని చెప్పారు. ఈ నెల 21న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సన్నీ డియోల్ సమావేశం అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి సన్నీ డియోల్ బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ ఆయన పార్టీలో చేరారు. ఈ సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరఫున లోక్‌సభ అభ్యర్థిగా పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి లేదా గురుదాస్‌పూర్ నుంచి పోటీ చేసే అవకాశం వుంది. సన్నీ డియోల్ తండ్రి ధర్మేంద్ర 2004లో బీజేపీ తరఫున రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. సన్నీ డియోల్ పినతల్లి, ధర్మేంద్ర భార్య అయిన హేమమాలిని మధుర లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. హేమమాలిని తరఫున ధర్మేంద్ర కూడా ఇటీవల ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
చిత్రం...బీజేపీలో చేరిన అనంతరం ఆ పార్టీ కార్యాలయం నుంచి వెలుపలకు వస్తున్న సన్నీ డియోల్