జాతీయ వార్తలు

పట్టం కడితే ఉపాధి వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుంగర్‌పూర్ (రాజస్థాన్), ఏప్రిల్ 23: కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని, కేవలం సంవత్సర కాలంలోనే 22 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీనిచ్చారు. గిరిజనుల ప్రాబల్యం అధికంగా ఉండా దుంగర్‌పూర్‌లోని నెనేశ్వర్ ధామ్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ గత ఐదేళ్ల మోదీ పాలనలో ప్రజలకు అన్ని విషయాల్లో అన్యాయమే జరిగిందని, తాము అధికారంలోకి వస్తే దానిని సరిచేస్తానని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. అంతకుముందు బెనేశ్వర్ థామ్‌లోని శివాలయంలో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలనలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. చేసిన వాగ్దానాలేవీ అమలు చేయని ప్రధాని మోదీ కేవలం 15-20 మంది వ్యక్తులతో ప్రభుత్వాన్ని నడిపించారని ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చిన మోదీ దానిని నిలబెట్టుకున్నారా? అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. అలాగే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు, పంటలకు మద్దతు ధర లాంటి వాగ్దానాలు ఏమీ ఆయన నెరవేర్చలేదని రాహుల్ విమర్శించారు. ఇలా అన్ని రంగాల్లో ఆయన పేదలు, గిరిజనులు, బలహీనవర్గాలు, నిరుద్యోగులు, యువతకు ఐదేళ్ల పాలనలోనూ అన్యాయం చేశారన్నారు. ఐదేళ్ల పాటు ఈ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని సరిచేయడానికి కాంగ్రెస్ కంకణం కట్టుకుందని, తాము కనుక అధికారంలోకి వస్తే ఈ వర్గాలన్నింటికీ తగిన న్యాయం చేస్తామని, తమది మాట తప్పే పార్టీ కాదని ఆయన హామీనిచ్చారు. పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేయడానికి తమ పార్టీ నిర్ణయించుకుందని, ప్రతి పేదవాడికి కనీస ఆదాయం కల్పించాలన్న లక్ష్యంతో ‘న్యాయ్’ పథకాన్ని అమలు చేయనున్నామని ఆయన చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరి ఖాతాలో నెలకు ఆరు వేల రూపాయలు జమ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయల జమ లాంటి శుష్క అబద్ధపు వాగ్దానాలతో నేను ప్రజలను మోసం చేయను’ అని, పేదల ఖాతాల్లో సంవత్సరానికి 72 వేలు, సంవత్సరంలో 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, పంచాయతీ స్థాయిలో యువతకు 10 లక్షల ఉద్యోగాలు లాంటి నెరవేర్చే హామీలు ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇంతవరకు ఏ దేశంలో కూడా ప్రజల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా నగదు జమచేయలేదని, తాము కనుక నగదును పేదల ఖాతాల్లో జమ చేస్తే అది మొట్టమొదటి సారి అవుతుందన్నారు. అయితే నరేంద్రమోదీ ఎన్నికల్లో చేసిన వాగ్దానం మేరకు పేదల ఖాతాల్లో 15 లక్షలు వేయకపోయినా ఆయన అనీల్ అంబానీ లాంటి వారి ఖాతాల్లో లక్షల కోట్లను వేశారని విమర్శించారు. తాను ఆయన ఖాతాకు వెళ్లిన సొమ్మును వెనక్కి రప్పించి పేదల ఖాతాల్లో వేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీనిచ్చారు. మోదీ ప్రవేశపెట్టిన జీఎస్టీ, నోట్ల రద్దు వల్ల దేశ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని, 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో దేశంలోని గిరిజనులు, పేదలు, కార్మికులు, కర్షకులు, చిన్నవ్యాపారులు ఇలా అన్ని వర్గాలకు చెందిన లక్ష కోట్ల రూపాయల సొమ్మును కేవలం 15 మంది అపహరించి విదేశాలకు పారిపోయారని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని తాము ఇచ్చిన వాగ్దానాన్ని రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో నెరవేర్చామని ఆయన గుర్తు చేశారు. తాము ప్రకటిస్తున్న పథకాలకు నిధులు ఎక్కడ నుంచి తెస్తారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారని, అవసరమైతే అనీల్ అంబానీ జేబుల్లోంచి తెస్తామని రాహుల్ పేర్కొన్నారు. పేద రైతులు పంటలు పండక తీసుకున్న కొద్దిపాటి రుణాన్ని తీర్చలేకపోతే వారిని జైలులో పెడుతున్న ఈ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి తీసుకుని విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. రుణాలు చెల్లించలేని రైతులకు ఎలాంటి శిక్ష వేయకుండా చట్టాన్ని సవరించాలని తమ పార్టీ నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తామని చెప్పారు. అలాగే యువత ఏదైనా పరిశ్రమను స్థాపించదల్చుకుంటే మూడేళ్ల పాటు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. గిరిజనుల నుంచి భూమి, అడవి, నీరును మోదీ ప్రభుత్వం లాక్కుందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పరిరక్షిస్తామని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. కాగా రాజస్థాన్‌లో ఏప్రిల్ 29, మే ఆరో తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది.