జాతీయ వార్తలు

రైతు ఆత్మహత్యలపై మాట్లాడరేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థానే, ఏప్రిల్ 23: కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ సమస్య జఠిలంగా మారిందని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ ఆరోపించారు. మహారాష్టల్రోని థానే జిల్లా భయాందర్‌లో పవార్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ‘ లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలపై నోరువిప్పడం లేదు‘అని విరుచుకుపడ్డారు. 2014కు ముందుకంటే నిరుద్యోగ సమస్య అధికమైందని, సమస్య పరిష్కారానికి మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని పవర్ విమర్శించారు. పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి మోదీ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని మాజీ కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్‌సీపీ అభ్యర్థి ఆనంద్ పరంజపే తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన శరద్ పవార్ ‘మోదీ సర్కార్‌కు పారిశ్రామిక విధానం లేదు. దీంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. దేశంలోనే పారిశ్రామిక రాష్టమ్రైన మహారాష్టల్రో పరిస్థితి దారుణంగా మారింది’అని ఆయన విమర్శించారు. కచ్చితమైన విధానం లేనందున పారిశ్రామిక, వ్యవసాయరంగాలు వెనకబడిపోయాయని ఎన్‌సీపీ అధినేత మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 11,990 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన వెల్లడించారు. మోదీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశాల ప్రస్తావన ఉండడం లేదని ఆయన ఆరోపించారు. సాగునీరు, గిట్టుబాట ధరల సమస్యలతో దేశంలోని రైతులు సతమతమవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ హయాంలో ఆర్‌బీఐ, సీబీఐ, సుప్రీం కోర్టు ప్రతిష్ట దెబ్బతిందని ఆయన అన్నారు.