జాతీయ వార్తలు

వాస్తవాలను దారి మళ్లిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగ్రా, ఏప్రిల్ 15: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా మరోసారి బీజేపీపై తన సహజమైన ధోరణిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నాయకులకు ప్రజాస్వామ్యమన్నా, ప్రజలన్నా విశ్వాసం లేదని ఆమె ధ్వజమెత్తారు. వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పకుండా దారిమళ్లిస్తున్నారని ఆమె విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ప్రియాంక గాంధీ సోమవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ మన దేశ యువతకు బీజేపీ ఏ రకంగా సహాయపడిందో తెలియదుగాని ఇప్పుడు భారత్ కంటే ఎక్కువగా పాకిస్తాన్ కోసమే వారు చర్చించుకుంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. ‘కేంద్ర ప్రభుత్వానికి ఇటు ప్రజాస్వామ్యమన్నా, అటు వ్యవస్థలన్నా, చివరకు ప్రజలన్నా ఎలాంటి విశ్వాసం లేదు. వారు నిజమైన దేశభక్తులు. వాస్తవాలను దారిమళ్లిస్తున్నారు. వాస్తవాలను దాచిపెట్టడం ఎంతోకాలం నుంచి జరుగుతోంది’ అని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫతేపూర్ సిక్రీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్ విభాగం అధ్యక్షుడు రాజ్‌బబ్బర్‌కు మద్దతుగా ఇక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఎన్నికల సమయంలోనే బీజేపీ ప్రభుత్వానికి జాతీయవాదం, పాకిస్తాన్ గుర్తుకు వస్తాయని ఆమె ఎద్దేవా చేశారు. ‘వాళ్లు భారత్ కోసం మాట్లాడాలి. యువత కోసం, రైతుల కోసం, సమాజంలోని భిన్నవర్గాల వారి కోసం వాళ్లు ఏమి చేశారు? మహిళలు, మహిళల భద్రతకు వారి అజెండాలో ఏమి చేయాలనుకున్నారో తప్పనిసరిగా చెప్పాలి’ అని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో వాస్తవాలను ప్రజలకు వివరించలేక అభాసుపాలవుతోందని ఆమె అన్నారు. ‘యువతకు ఉద్యోగావకాశాలు లేవని తాను స్వయంగా పర్యటించిన ప్రాంతాల్లో తెలుసుకున్నాను. రాయబరేలి, లక్నోకు చెందిన బంగాళాదుంపల పంటను సాగు చేస్తున్న రైతులు ఇటు బ్యాంకు రుణాలతోపాటు పంటకు సరైన గిట్టుబాటు ధరలేక పడుతున్న అవస్థలు నా దృష్టికి తీసుకువచ్చారు’ అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా ఒక రైతు తన పంట అమ్మగా వచ్చిన రూ.490ని ప్రధాని నరేంద్ర మోదీకి పంపడం ద్వారా పంటలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మద్దతు ధర ఇస్తోందంటూ నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశంలో రైతులు పడుతున్న ఇబ్బందులు, అవస్థలు చూడాలని, వాస్తవాలను వక్రీకరించవద్దని పరోక్షంగా ఆ రైతు ప్రధానికి తన పంట సొమ్మును పంపాడని ఆమె పేర్కొన్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం గురించి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ డయాగ్నసిస్, ట్రీట్‌మెంట్ మాత్రం ఉచితం, కానీ ఆరోగ్యం కాదు అంటూనే.. ఆరోగ్యాన్ని కూడా ఉచితంగా అందిస్తారంటే గొప్ప విషయమే కదా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.