జాతీయ వార్తలు

త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో అక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌లో అన్నీ అక్రమాలు, అవకతవకలు జరిగాయని సీపీఎం నాయకులు ప్రధాన ఎన్నికల కమిషన్‌ర్‌కు ఫిర్యాదు చేశారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నేతృత్వంలో సోమవారం పార్టీ ప్రతినిధుల బృందం సీఇసీని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేసింది. ఈ బృందంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నీల్టొపాల్ బసు, పశ్చిమ త్రిపుర లోక్‌సభ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి శంకర్ ప్రసాద్ దత్త ప్రభృతులు ఉన్నారు. సీతారాం ఏచూరి పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ ఈ నెల 11న త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన మొదటి దశ పోలింగ్‌లో అక్రమాలు జరిగాయని విమర్శించారు. పశ్చిమ త్రిపురలోని 464 పోలింగ్ బూత్‌ల్లో రీ-పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న తూర్పు త్రిపుర నియోజకవర్గంలో జరగనున్న పోలింగ్ సందర్భంగానైనా సరైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.