జాతీయ వార్తలు

ప్రత్యర్థులను అణగదొక్కుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలీఘ్ఢ్, ఏప్రిల్ 15: దేశంలో తమ రాజకీయ ప్రత్యర్థులు నోరెత్తకుండా ప్రధాని నరేంద్ర మోదీ అణగదొక్కుతున్నారని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐతో రాజకీయ ప్రత్యర్థులపై మోదీ దాడులకు పాల్పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. బీజేపీతో దేశ సరిహద్దుల భద్రత క్షేమంగా ఉంటుందని ప్రధాని తన ఎన్నికల ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన బీఎస్పీ చీఫ్ మాయావతి ‘దేశ సరిహద్దుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రతిఒక్కరూ చూడొచ్చు’ అని వ్యంగ్యంగా అన్నారు. ‘ప్రధాని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ (సీబీఐ) వంటి వ్యవస్థలతో రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు’ అని మాయావతి సోమవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో ధ్వజమెత్తారు. మోదీ చర్యలు ప్రమాదకరం..తన రాజకీయ ప్రత్యర్థులందర్నీ అణగదొక్కేందుకు ప్రయత్నించడం గర్హనీయమని ఆమె విమర్శించారు. మోదీ ఐదేళ్ల కాలంలో దేశంలో మైనారిటీల పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైందని, అదేవిధంగా సమాజంలోని అన్నివర్గాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నమేమీ కాదని ఆమె ఆరోపించారు. ఇలాంటి అధ్వాన్న పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముస్లింలు, దళితులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని, కానీ ఈ రెండు పార్టీల హయాంలో ఆయా వర్గాల పరిస్థితి మరింత దిగజారిందని ఆమె ఆరోపించారు. ఇక్కడి మహేశ్వరి ఇంటర్ కాలేజీలో ఆర్‌ఎల్‌డీ నాయకుడు చౌదరి అజిత్ సింగ్‌కు మద్దతుగా జరిగిన ర్యాలీలో మాయావతి మాట్లాడారు. ఇక్కడ ఎస్పీ, బీఎస్పీతో పొత్తులో భాగంగా ఆర్‌ఎల్‌డీ పోటీ చేస్తోంది.