జాతీయ వార్తలు

ఈవీఎంలకు మరింత భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్‌లో ఈవీఎంల భద్రత కోసం రాష్ట్రానికి అదనపు బలగాలు కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) వైకాపా నాయకులు విజ్ఞప్తి చేశారు. వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు బృందం సోమవారం ఈసీని కలిసింది. ఈసీతో కలిసిన తరువాత విజయసాయిరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ ఈవీఎంల భద్రత కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంల వద్ద మరిన్ని కేంద్ర బలగాలను పెంచాలని కోరారు. ఇదే విషయాన్ని ఈసీ దృష్టికి తెచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే పోలింగ్ జరిగిన రోజు టీడీపీ నేతలు విచ్చలవిడిగా హింసకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్పీలు సానుకులంగా ఉన్నచోటే హింస జరిందని ఆయన ఫిర్యాదు చేశారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే దేశ రాజధానిలో ఆయన డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నాయకుల తీరువల్లే శాంతిభద్రతలు అదుపుతప్పాయని విజయసాయి ధ్వజమెత్తారు. ఏపీలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యమయిందని, ఓటర్లు ఇళ్లకు వెళ్లి మధ్యాహ్నం మరలా వచ్చి లైన్ల్‌లో నిలబడ్డారని, అందుకే పలు ప్రాంతాల్లో అర్థరాత్రి వరకూ పోలింగ్ జరిగిందని వెల్లడించారు. ఈవీఎంను దొంగిలించిన కేసులో హరిప్రసాద్ జైలుకెళ్లాడని, అతనికి ఏ రాజ్యాంగ సంస్థలోకి అనుమతినివ్వకూడదని వైకాపా బృందం స్పష్టం చేసింది. టీడీపీ అధినేత, రిటైర్ట్ అధికారి సత్యనారాయణ లాలూచీ పడి ఆధార్ డేటాను లీక్ చేశారని, ఈ-ప్రగతికి అందజేశారని ఆరోపించారు. చంద్రబాబు, డీజీపీ ఠాకుర్, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును జైలుకు పంపేందుకు డేటాచోరీ కేసు ఒక్కటి చాలని, మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని ఆధారాలను త్వరలోనే బయటపడతాయని ఆయన చెప్పారు. స్పీకర్ కొడెల శివప్రసాద్ స్వయంగా పోలీంగ్ కేంద్రంలో గడియ వేసుకుని రిగ్గింగ్ చేస్తుండగా గ్రామస్తులు తిరగబడ్డారని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు. ఈ వివాదంలో తిరిగి వైకాపా కార్యకర్తలపైనే కేసు నమోదు చేశారన్నారు. ఈసీని కలిసిన బృందంలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలశౌరి, సీ రామచంద్రయ్య, పండుల రవీంద్రబాబు, బుట్టా రేణుక, అవంతి శ్రీనివాస్ ఉన్నారు.

చిత్రం... ఢిల్లీలో సోమవారం కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం అనంతరం విలేఖరులతో
మాట్లాడుతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి