జాతీయ వార్తలు

రాజీవ్ హత్య కేసు ముద్దాయి నళిని పెరోల్ పిటిషన్ తిరస్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు ముద్దాయి పెట్టుకున్న పెరోల్ పొడిగింపు పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. రాజీవ్ గాంధీ హత్య కేసు ముద్దాయిలైన నళిని, ఆమె భర్త వేలూరు జైలులో వేర్వేరు విభాగాల్లో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నారు. నళిని తన కుమార్తె వివాహం సందర్భంగా నెల రోజుల పెరోల్‌పై విడుదల అయింది. ఈ నేపథ్యంలో తన కుమార్తె పెళ్లి వేడుక ఇంకా జరుగలేదని పెరోల్ పొడిగించమని కోరటంతో ఈ నెల 15 వరకు పెరోల్‌ను పొడిగించటం జరిగింది. అయితే మళ్లీ తనకు పెరోల్ గడువు పొడిగించాలని ఆమె మూడవసారి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. అక్టోబర్ 15 వరకు పెరోల్ గడువు పొడిగించాలని కోరింది. అయితే ఇప్పటికే రెండుసార్లు పెరోల్ గడువు పొడిగించామని, ఇకపై పొడిగించటం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు ఈనెల 15వ తేదీ సాయంత్రం ఆరు గంటలలోగా జైలుకు వెళ్లాలని ఆదేశించింది.