క్రైమ్/లీగల్

పత్తి రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, ఏప్రిల్ 20: దేవరకొండ మండలం కొమ్మెపల్లి గ్రామానికి చెందిన పత్తి రైతు జెల్ల వెంకటయ్య (45) ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటయ్య తనకున్న నాలుగు ఎకరాల భూమిలో పత్తిని సాగు చేశాడు. సాగు కోసం ఆరులక్షల రూపాయలకు పైగా అప్పులు చేయడం వర్షాభావ పరిస్ధితుల కారణంగా సరైన దిగుబడి రాకపోవడంతో అప్పు తీర్చేమార్గం తెలియక వెంకటయ్య ఈ నెల 15 వ తేదీన క్రిమిసంహారక మందు సేవించాడు. క్రిమిసంహారక మందు సేవించిన వెంకటయ్యకు దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం పరిస్ధితి విషమంగా ఉండడంతో కుటుంబసభ్యులు వెంకటయ్యకు మెరుగైన చికిత్స కోసం నార్కట్‌పల్లి లోని కామినేని అసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు వెంకటయ్యను మరింత మెరుగైన చికిత్స కోసం కుటుంబసభ్యులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళగా అక్కడి చికిత్స పొందుతూ వెంకటయ్య గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య భారతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీ ఐ ఎంజీ ఎస్ రామకృష్ణ చెప్పారు.

కారు బోల్తా - ఆరుగురికి గాయాలు
వలిగొండ, ఏప్రిల్ 20: మండలంలోని నాగారం గ్రామం సమీపంలో శుక్రవారం ఉదయం మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి కారు బోల్తా పడిన సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. భీమవరం నుండి షామీర్‌పేటకు వెళ్తున్న కారు మూసీ రోడ్డు వంతెన సమీపంలో కారు అదుపుతప్పి కారు బోల్తా కొట్టడంతో డ్రైవర్‌కు చెయ్యి విరిగిపోగా అందులో ప్రయాణిస్తున్న మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

అత్యాచారం కేసులో నిందితుడిపై కేసు
గుర్రంపోడు, ఏప్రిల్ 20: గుర్రంపోడు మండలం కాచారం గ్రామంలో బుద్ధి మాంద్యం ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడిన జిల్లా నాగయ్యపై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు. రెండు నెలల క్రితం బాధిత యువతిపై నాగయ్య సోదరుడు అత్యాచారానికి పాల్పడి జైలు శిక్షకు గురయ్యాడని ఎస్‌ఐ తెలిపారు. ఈ తరహా ఘటనలపై పోలీస్ వ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.