రాష్ట్రీయం

కృష్ణాడెల్టాకు 4 టిఎంసిల నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, డిసెంబర్ 19: నాగార్జునసాగర్ జలాశయం నుండి ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా కృష్ణాడెల్టాకు శనివారం సాయంత్రం నాలుగు టిఎంసిల నీటిని ప్రాజెక్టు అధికారులు విడుదల చేశారు. కృష్ణాడెల్టా ప్రాంతంలో తాగునీటి ఎద్దడి ఉందని ప్రజా ప్రతినిధులు, అధికారులు కృష్ణా రివర్ బోర్డుకు విన్నవించుకోగా ఆంధ్రా, తెలంగాణ జలవనరుల సంఘం అధికారులు భేటీ అయి కృష్ణాడెల్టాకు నాలుగు టిఎంసిల నీటిని విడుదల చేయాలని ప్రతిపాదించారు. ఈనేపథ్యంలో సాగర్ జలాశయం నుండి నీటిని తొలుత విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుండి సాగర్ జలాశయానికి 6730 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కృష్ణాడెల్టాకు విడుదలవుతున్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని అధికారులు కోరారు. సాగర్ జలాశయం నీటిమట్టం శనివారం సాయంత్రానికి 508 అడుగులకు చేరుకుంది. ఇది 129.47 టిఎంసిలకు సమానం. ఎస్‌ఎల్‌బిసి ద్వారా 900 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి విద్యుత్ ఉత్పాదనకు 7554 క్యూసెక్కులు, టోటల్ ఔట్‌ఫ్లోగా 8454 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 834.10 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 54.6486 టిఎంసిలకు సమానం. ఎగువ జలాశయాలైన రోజా, తుంగభద్ర ప్రాజెక్టుల నుండి శ్రీశైలం జలాశయానికి నీటి చేరిక పూర్తిగా నిలిచిపోయినట్లు సాగర్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు.