Others

‘ముక్కోటి దేవతలు ఒక్కటైనారు..’ -- నాకు నచ్చిన పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, చక్కని పాపను ఇక్కడుంచారు’. ఆంధ్రప్రదేశమంతటా పవిత్ర దేవతలను నిక్షిప్తం చేసుకుని, వారినందరినీ పాపకు రక్షణగా ఉండండి అని పాడే ప్రార్థనాగీతం ఇది. ‘బావమరదళ్ల’లో ఈ పాట నాకు నచ్చింది. సింహాచలేశా అని బాలప్రహ్లాదుడు అని సింహాచలంలో అప్పలనరసింహం స్వామివారిని, నెల్లూరు సంబంధాన్ని శ్రీరంగనాయకా ఆనందనాయకా అని చెప్పిన తీరు నచ్చింది. పెన్నాతీరంలోని సుప్రసిద్ధ గుడి శ్రీరంగనాథస్వామి ఆలయం ఉంది. కరుణించు మా అమ్మ కనకదుర్గమ్మ అని విజయవాడ మాతను సంక్షిప్తంగా ఈ పాటలో శిశువుకు శ్రీరామరక్షగా చేశారు. తమ అభిమాన దేవతలు తెరపై కనబడగానే చేతులు జోడించే ఎందరో ప్రేక్షకులు ఈ పాటను చూసి ఆనందపడతారు.
- కె.నాగరాజారావు, భాగ్యనగరం