నిజాలను బయటపెట్టే మనలో ఒకడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్న చిత్రం ‘మనలో ఒకడు.’ యూనీ క్రాఫ్ట్ మూవీస్ పతాకంపై జి.సి.జగన్మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మాజీ మంత్రి వేణుగోపాలాచారి క్లాప్ నివ్వగా, వేమూరి రాధాకృష్ణ స్విచ్ ఆన్ చేశారు. చలసాని శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం ఆర్.పి. పట్నాయక్ మా ట్లాడుతూ, ‘నిర్మాత జగన్ చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమా చేద్దామన్నారు. మీడియా ద్వారా ఎన్నో నిజాల్ని బయటపెట్టాలనే చేసిన ప్రయత్నమే ఈ సినిమా. చాలా సిల్లీగా అనిపించే విషయాలే సీరియస్‌గా మారిపోతుంటాయి అనే కానె్సప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నాం.
ప్రతీ సామాన్య ప్రేక్షకుడు ఐడెంటిఫై చేసుకునేలా ఈ సినిమాని తీర్చిదిద్దుతాం. ఈ చిత్రంలో నేను జూనియర్ కాలేజి లెక్చరర్‌గా కనిపిస్తాను. అనిత నా భార్య పాత్రలో నటిస్తోంది. సాయికుమార్‌ది కీలక పాత్ర. సినిమాలో నాలుగు పాటలుంటాయి. మార్చి 10న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని అన్నారు. నిర్మాత జగన్మోన్ మాట్లాడుతూ, సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేయాలనే ప్రయత్నంతో పరిశ్రమలోకి వచ్చానని, ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.