Others

నరవరుని సుందరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్తనశాల చిత్రంలో -
‘నరవరా ఓ కురువరా వీరుల నీకు సరి లేరని’ అనే పాట ఎస్ జానకి పాడుతుంటే అద్భుతంగా నాట్యం చేసిన నాట్యమయూరి ఎవరో గుర్తుందా?
ఆమె పద్మిని ప్రియదర్శిని. అనేక చిత్రాల్లో అద్భుతమైన నృత్యాలతో ప్రేక్షకులను సమ్మోహితులను చేసిందామె. నర్తనశాల చిత్రంలో -అర్జునుడు దేవలోకం వచ్చినపుడు ఇంద్రుడు అతని గౌరవార్థం ఊర్వశి నృత్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ సన్నివేశం తరువాత -అర్జునుడు బృహన్నలగా మారడానికి శపించే ఊర్వశి పాత్రను పద్మిని ప్రియదర్శిని అద్భుతంగా నటించారు. నరవరా ఓ కురువరా పాటలో ఆమె ఎన్ని ముద్రలు అభినయించారో, అర్జునుడిగా ఎన్టీఆర్ కూడా కూర్చునే అన్ని భావాలనూ పలికించాడు, ఆమెకు ధీటుగా. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి కథానాయకుడు ఆ పాటలో పద్మిని ముందు తేలిపోతాడు. అంత గొప్పగా నాట్యం చేసే ఆమెముందు అన్ని భావాలను ఆయన కూర్చునే అభినయించడం, పద్మిని నాట్య కౌశలం గూర్చి గొప్పగా చెప్పకనే చెప్పారు.

భలే అమ్మాయిలు చిత్రంలో సావిత్రిని ఎన్టీఆర్ ఆటపట్టించే సమయంలో జానపద నృత్య కళాకారిణిగా ‘చక్కచక్క ఝనతా, తక్క్ధిమి గిడతా’ అన్న పాటలో పద్మిని ప్రియదర్శిని చేసిన నృత్యం నిజంగా అద్భుతం. ఈ పాటలో సావిత్రి హావభావాలపై ఓ చరణంలో ‘పక్కనున్న పిల్ల/ పంచదార బిళ్ల/ టక్కులెన్నో చేస్తున్నది/ మనసులాగి నాది వయసు దోచినాది, మత్తుమందు జల్లినాది’ అన్న పంక్తిలో సావిత్రి హావభావాలకు తగ్గట్టుగా పద్మిని ప్రియదర్శిని నాట్య ముద్రలను అభినయించారు. నర్తనశాలలో ఎన్టీఆర్‌కు ధీటుగా నటిస్తే, భలే అమ్మాయిలులో సావిత్రికి తగ్గట్టుగా నాట్యం అభినయించారు. అది ఆమె గొప్పతనం. అనేక తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఆమె నృత్యాలను అభినయించారు. కేవలం నృత్య కళాకారిణిగా మాత్రమే అనేక చిత్రాల్లో

కనిపించారు. రాజ్‌కపూర్‌తో దిల్‌హైతోహై చిత్రంలో అద్భుతమైన నాట్య ప్రదర్శన ఉంటుంది. ఇరువరు ఉల్లమ్ చిత్రంలో శివాజీగణేశన్ కాంబినేషన్‌తో మంచి గుర్తింపు వచ్చింది. క్లాసికల్ డాన్సర్‌గా అనేక చిత్రాల్లో అభినయించిన పద్మిని కేరళలో 1944 సెప్టెంబర్ 8న జన్మించారు. కుటుంబమంతా మద్రాసుకు తరలిరావడంతో అక్కడే నృత్య శిక్షణ తీసుకున్నారు. రామచంద్రన్‌ను వివాహం

చేసుకున్నాక పద్మిని రామచంద్రన్‌గా మారారు.
కర్నాటక రాష్ట్రంలో డాన్స్ అకాడమీ ఏర్పాటు చేశారు. నృత్యప్రియ పేరుతో కళాశాల ఏర్పాటుచేసి అనేకమంది ఔత్సాహికులకు నాట్య కౌశలాన్ని నూరిపోశారు. వివాహం అయ్యాక సినిమా పరిశ్రమకు దూరమైన ఆమె నృత్యమే ఊపిరిగా జీవించారు. ఆమె కళ, ఫ్యాషన్ అన్నీ నృత్యమే. తన జీవితంలో అనేక నృత్య ప్రదర్శనలను ఇచ్చి గొప్ప పేరు సంపాదించారు. ఊపిరి ఉన్నంతవరకు నృత్యానికే తాను అంకితమని ప్రకటించారు. అనేక దేశాలు

పర్యటించి ప్రదర్శనలిచ్చారు. ఎక్కడికెళ్లినా భేషజాలు ప్రదర్శించని ఆమె కర్నాటక రాష్ట్రం అందించే రాజ్యోత్సవ అవార్డును అందుకున్నారు. లైఫ్ ఆఫ్ పై అనే చిత్రంలో చిట్టచివరిగా నటించారు. నృత్య శిక్షకురాలిగా అనేక వందల మంది కళాకారులను తీర్చిదిద్దారు. నృత్య క్షేత్ర కళాశాలకు మేనేజింగ్ ట్రస్టీగా, డైరెక్టర్‌గా అనేక సంవత్సరాలు సేవలు అందించారు. 70 నృత్య రూపకాలను రూపొందించారు. అనేక టీవీ సీరియల్స్‌లో నృత్యాలను అందించారు. కర్నాటక రాష్ట్రం అందించిన ఒక ఎకరం భూమిలో తన డాన్స్ అకాడమీని ఏర్పాటుచేసి ఎంతోమందికి నృత్యశిక్షణ ఇచ్చారు.
చేసింది కొద్ది చిత్రాలైనా అద్భుతమైన చిత్రాలు కావడంతో, హిట్ పాటలలో నటించడంతో పద్మిని ప్రియదర్శికి అనేకమంది అభిమానులు ఉన్నారు. దాదాపు 71ఏళ్లపాటు జీవించిన పద్మిని ప్రియదర్శిని తన జీవితంలో అనేక మైలురాళ్లను నృత్య శిక్షణలో దాటారు. తన శిష్యులు దేశదేశాల్లో ఉన్నతమైన పదవులలో ఉంటూ తన పేరును నిలిపినందుకు ఆనందాన్ని వ్యక్తం చేసేవారు. అటువంటి అద్భుత నృత్య కళాకారిణి జనవరి 17న కన్నుమూయడం చిత్ర పరిశ్రమ కంటతడి పెట్టే అంశమే.

- శేఖర్