క్రీడాభూమి

దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ఓపెనర్ మురళీ విజయ్
నాగపూర్, నవంబర్ 23: మొహాలీలో జరిగిన మొదటి టెస్టుతోపాటు, బెంగళూరులో ఒక పూర్తి ఇన్నింగ్స్ మాత్రమే సాధ్యమైన రెండో టెస్టులోనూ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌పై తాము ఒత్తిడిని పెంచగలిగామని భారత ఓపెనర్ మురళీ విజయ్ అన్నాడు. భారత స్పిన్‌ను ఎదుర్కోవడానికి దక్షిణాఫ్రికాకు సులభసాధ్యం కావడం లేదని సోమవారం విసిఎ మైదానంలో ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. మొదటి టెస్టులో ఆడిన అమిత్ మిశ్రాకు రెండో టెస్టులో స్థానం దక్కలేదు. అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలం బెంగళూరు టెస్టులో జరిగిన మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ఇరకాటంలో పెట్టింది. వారిద్దరూ చెరి నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ అంశాలను విజయ్ ప్రస్తావిస్తూ తీవ్రమైన ఒత్తిడిని తీసుకురాగలిగామని, అందుకే మొదటి టెస్టులో విజయం సాధ్యమైందని అన్నాడు. రెండో టెస్టులో దక్షిణాఫ్రికాను మొదటి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు కట్టడి చేశామన్నాడు. తాము నిర్దిష్టమైన వ్యూహాలతో బ్యాటింగ్‌కు వెళుతున్నామని అంటూ, రెండో టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 80 పరుగులు చేసిన విషయాన్ని ప్రస్తావించాడు. పిచ్‌పై బంతి విపరీతంగా స్పిన్ తిరగడం వల్ల దక్షిణాఫ్రికాకు మాత్రమే సమస్యలు ఉంటాయని అనుకోరాదని విజయ్ అన్నాడు. టీమిండియా సైతం అలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నదని చెప్పాడు. అయితే, స్పష్టమైన వ్యూహాన్ని అనుసరించడం వల్లే ఆ సమస్యను అధిగమించామని అన్నాడు. బుధవారం నుంచి మొదలయ్యే మూడో టెస్టు ఆసక్తికరంగా సాగుతుందని జోస్యం చెప్పాడు. ఒక టెస్టును గెలిచినంత మాత్రాన దక్షిణాఫ్రికాను తక్కువ అంచనా వేయడం లేదని స్పష్టం చేశాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ భారత టాప్ ఆర్డర్‌లో ఒకరి మధ్య మరొకరికి చక్కటి అవగాహన ఉందన్నాడు. సాధ్యమైనంత వరకూ తొలి వికెట్‌కు భారీ స్కోరును అందించడానికి తాను, శిఖర్ ధావన్ కృషి చేస్తామన్నాడు. (చిత్రం) స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు సూచనలిస్తున్న భారత జట్టు డైరెక్టర్ రవి శాస్రి