మెయిన్ ఫీచర్

నైతిక విలువలే జీవిత పాఠాలు కావాలి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసి వయస్సునుంచే మంచి గుణాలను కథల ద్వారా అలవాటు చెయ్యవచ్చు. నేటి జంతు
పరిరక్షణ సంఘాలలో ఎందరికి శిబిచక్రవర్తి కథ తెలుసు? ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యమే చెప్పిన హరిశ్చంద్రుడి కథ, కష్టసుఖాలలో కలసి జీవించాలి తప్ప భర్తను వదలడానికి ఇష్టపడని దమయంతి కథ నేటితరానికి చెప్పడానికి కుహనా సెక్యులర్ వాదులు ఒకవైపు ఒప్పుకోరు. ఇదంతా టైంవేస్ట్ అని తల్లితండ్రులు అనుకున్న ఆశ్చర్యం లేదు. సంతానం చెడుతిరుగుళ్ళకి అలవాటుపడ్డాక ‘సెక్స్ ఎడ్యుకేషన్’లేదంటున్నారే తప్ప నీతిమార్గాన్ని పిల్లలకు చూపించలేక పోయామనుకోడం లేదు.
==========================
అతివలపై అత్యాచారాలు పోవాలన్నా, వివాహ పూర్వ సంబంధాలు యువతీయువకులలో తగ్గాలన్నా, ఎయిడ్స్ మహమ్మారిని ఎదుర్కోవాలన్నా సెక్స్ ఎడ్యుకేషన్ విద్యాలయాలలో ఉండడమే మంచి మార్గమని చెప్తున్నారు. సమాజంలోని సర్వరోగాలకూ నివారిణిగా చెప్తున్న సెక్స్ ఎడ్యుకేషన్‌ని స్కూళ్ళలో, కాలేజిలలో బోధించడంలోని సాధ్యాసాధ్యాలనూ, లాభనష్టాలనూ అంతగా విచారించినట్లుగా కనబడదు. ప్రస్తుతం స్కూళ్ళలోనూ, కాలేజీలలోనూ అన్ని సబ్జెక్టుల సిలబస్సునూ బోధనతో ఏమాత్రమూ సంబందం లేనివాళ్ళు నిర్ణయించినట్లే ఈ విషయం గురించి కూడా గురువులు తప్ప అందరూ మాట్లడుతున్నారు. శృంగారపరమైన సన్నివేశాలు పాఠంలో ఉంటే చెప్పడం ఎంత కష్టమో, ఎంత ఇబ్బందికరమో తెలుగు, సంస్కృతం ఉపాధ్యాయులను అడిగితే తెలుస్తుంది. ఆమాటకొస్తే మెడికల్ కాలేజిలలోనే పునరుత్పత్తి గురించిన పాఠాలు చెప్పే సమయంలో వెకిలి నవ్వులూ, ఈలలూ తప్పడం లేదని వార్తలు విన్పిస్తున్నాయి.
శరీరానికి సంబంధించిన విషయాలు చెప్పడంలోని కష్టాలను పక్కన పెట్టినప్పటికీ, ఆ విషయాలు తెల్సుకున్నంతలో అవినీతికరమైన పనులు మానెయ్యడం జరుగుతుందా? అంతకన్నా పసివయస్సునుంచీ నైతికమైన విషయాలు చెప్పడం ముఖ్యంకదా. పాఠశాలల్లో, కళాశాలల్లో వారానికి రెండు గంటలు నైతిక విద్యను (మోరల్ ఇన్స్ట్రక్షన్) కేటాయించాలన్నది నియమం. మార్కులే పరమావధిగా నడిచే స్కూళ్ళూ, నడిపించమని కోరే తల్లితండ్రులూ ఉన్నంతకాలమూ ఆ రెండు గంటలూ కూడా సబ్జెక్ట్ చెప్పడమే జరుగుతోంది. ఆ తరువాత పిల్లలు పెద్దవాళ్ళయినాక తమను పట్టించుకోడం లేదని తల్లితండ్రులు వాపోతున్నారు.
నలభై ఏళ్ళనాడు నేను చదువుకున్నప్పుడు మాకు డిగ్రీ ఫైనలియర్‌లో ఉండగా మారల్ ఇన్ట్స్రక్షన్ క్లాసులలో బోధించిన విషయాలు నేటికీ జ్ఞాపకమున్నాయి. ఆడపిల్లలకే ప్రత్యేకమైన కాలేజి కాబట్టి కొంత సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వడం టీచర్లకు అంత కష్టం కాలేదు. కానీ సెక్స్‌కన్నా ఎక్కువగా వివాహమయ్యాక కుటుంబ జీవితం ఎలా గడపాలో అన్న విషయం మీద కాలేజి లెక్చరర్లూ, గెస్టులెక్చరర్లూ చాలా విషయాలు నేర్పించారు. ఆ విషయాలన్నీ అర్థంచేసుకుని, ఆచరిస్తే వైవాహిక జీవితంలో అసంతృప్తి ఉండదు.
మొట్టమొదటగా కొత్త పెళ్ళికూతురు గమనించవలసిన విషయం తమది కొత్త సంసారమని. ‘‘మా పుట్టింట్లో ఇది ఉంది, అది ఉంది, మన ఇంట్లో ఏమీలేవు’’అని భర్తతో అనరాదని మమ్మల్ని హెచ్చరించారు. ‘ఎనే్నళ్ళ తర్వాత, ఎంత కష్టపడి మా అమ్మా, నాన్న అవన్నీ కొనుక్కోగలిగారో’అని అనుక్షణం గుర్తుచేసుకోవాలి తప్ప ఇప్పుడే అన్నీ అమరిపోవాలని అనుకోకూడదని నేర్పించారు.
రెండవది వృద్ధాశ్రమాల విషయమై హెచ్చరిక. నలభై, యాభై ఏళ్ళ క్రిందట భారతదేశంలో వృద్ధాశ్రమం అన్నమాట లేనే లేదు. పాశ్చాత్య దేశాలలో అప్పటికే వృద్ధులను పట్టించుకోకుండా ఓల్డ్‌ఏజ్ హోమ్స్‌లో చేర్పించడం సాధారణమైంది. అటువంటి హోమ్స్‌లో ఉండే తల్లితండ్రులు కార్‌హారన్ వినిపించగానే తమ పిల్లలు చూడడానికి వచ్చారేమోనన్న ఆశతో గుమ్మందగ్గరకు వచ్చి నిరాశతో లోపలకు వెళ్ళిపోవడాన్ని కరుణరసం పొంగిపొర్లేలా వర్ణించి, ఆ పరిస్థితిని ఇండియాలోకి రాకుండా చూడాలని విద్యార్థులకు చెప్పారు. అటువంటి 1970లలో ఉండడంవల్లనేమో 1990లు దాటేదాకా భారతదేశంలో వృద్ధాశ్రమాలు అంతగా లేవు. 1980ల మధ్యకు వచ్చేసరికి ఎమ్సెట్, ఐఐటి, ఇఇఇ వగైరాలకు కోచింగ్ తప్ప వేరే బోధన లేదు. నైతిక విలువల పరిరక్షణ అన్నమాటను అటు తల్లితండ్రులు, ఇటు విద్యాలయాలు వదిలేశాయి.
పసి వయస్సునుంచే మంచి గుణాలను కథల ద్వారా అలవాటు చెయ్యవచ్చు. నేటి జంతు పరిరక్షణ సంఘాలలో ఎందరికి శిబిచక్రవర్తి కథ తెలుసు? ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యమే చెప్పిన హరిశ్చంద్రుడి కథ, కష్టసుఖాలలో కలసి జీవించాలి తప్ప భర్తను వదలడానికి ఇష్టపడని దమయంతి కథ నేటితరానికి చెప్పడానికి కుహనా సెక్యులర్ వాదులు ఒకవైపు ఒప్పుకోరు. ఇదంతా టైంవేస్ట్ అని తల్లితండ్రులు అనుకున్న ఆశ్చర్యం లేదు. సంతానం చెడుతిరుగుళ్ళకి అలవాటుపడ్డాక ‘సెక్స్ ఎడ్యుకేషన్’లేదంటున్నారే తప్ప నీతిమార్గాన్ని పిల్లలకు చూపించలేక పోయామనుకోడం లేదు. ఇక్కడ చిన్న విషయం హైందవేతరులకు నచ్చనిది చెప్పుకోవచ్చు. యూదు, క్రైస్తవ, మహమ్మదీయ మతాలు మూడింటిలోనూ సృష్టి ఆరంభం ఒక్కలాగే వర్ణించబడింది. భగవంతుడు ముందుగా ఆడంను సృష్టించి, అతని పక్క ఎముకలోనుంచి ఈవ్‌ని సృష్టించాడు. (స్ర్తిపురుషులిద్దరినీ ఒకేసారి కానీ, విడివిడిగా ఎవరిని వారుగా కానీ ఎందుకు సృష్టించలేదో). దేవుడు ఈవ్, ఆడంలకు ఒక పండు చూపి దానిని తినవద్దన్నాడు. వారు తిన్నారు. తండ్రి ఆజ్ఞ (లేదా భగవదాజ్ఞ) ధిక్కారం అనే పునాది మీదనే సృష్టి ఆరంభమైంది. సనాతన భారతీయ మతంలో సృష్టి భగవంతుడి ఆదేశాన్ని అనుసరించడంవల్ల మొదలైంది. మాతృదేవోభవ, పితృదేవోభవ అన్నది భారతీయ ధర్మం.
పరస్ర్తిలను తల్లిగా చూడడమూ ధర్మమే. పోతనామాత్యులు ప్రహ్లాదుని గుణాలను వర్ణిస్తూ ‘‘కన్నుదోయికి అన్యకాంతలడ్డంచైన మాతృభావము చేసి మరలువాడు’’అని వ్రాశారు. ఈ వాక్యాన్ని వెక్కిరిస్తూ 1960లలోనే అయిదేళ్ళ కుర్రవాడికి మరో భావం ఎలా వస్తుంది? అని ఆంధ్రపత్రికలో రచన వచ్చింది. ప్రహ్లాదుడి నిర్మల చిత్తానికి ఉదాహరణగా మాత్రమే ఆ వాక్యాన్ని తీసుకోవాలి కానీ ఈ విపరీత విమర్శ ఏమిటని అప్పట్లోనే చాలామంది అన్నారు. ఇప్పుడైతే అయిదేళ్ళ పిల్లలు కూడా అత్యాచార ప్రయత్నాలు చేస్తున్నరని వార్తలు వస్తున్నాయి.
శృంగార విషయంలో అనాచారాలూ, అత్యాచారాలూ పోవాలంటే పిల్లలకు నేర్పవలసింది శరీర సంబంధ విషయాలు కావు. నైతికమైన విషయాలు పసి వయస్సునుంచీ చెప్పాలి. స్ర్తిపురుషుల మధ్య బంధం విషయంలోనే కాదు, అన్ని విషయాలలోనూ ధర్మప్రవర్తన ఆవశ్యకతను తెలియచెయ్యాలి. ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతుంది? ఎవరు చెప్పగలవారు? తామే కీచకులవుతున్న టీచర్లా? ధనార్జనే జీవితలక్ష్యంగా తాము నిర్దేశించుకుని, పిల్లలను ఆమార్గంలో నడవమని ఆదేశించే తల్లితండ్రులా? పరమ పవిత్రురాలైన ద్రౌపదిని పచ్చి కాముకిగా వర్ణించిన రచయితకు అవార్డులమీద అవార్డులిస్తున్న ప్రభుత్వమూ ప్రభుత్వ సంస్థలా? ఆ రచయిత స్థాపించిన సంస్థనుంచి అవార్డులు స్వీకరించిన ఆధ్యాత్మిక ప్రవచనకర్తలా?
నైతిక విద్య నేర్పలేకపోయినా శారీరక సంబంధ విద్య కనీసం విద్యాలయాలలో పెట్టకుండా ఉంటే చాలును.

-పాలంకి సత్య