జాతీయ వార్తలు

సమభావన పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దీవాలీ మిలన్’లో మోదీ ఉద్ఘాటన

న్యూఢిల్లీ, నవంబర్ 28: సమాజంలో వివక్షను రూపుమాపి ప్రజల్లో సమభావాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన పాత్రికేయులతో కలసి ‘దీవాలీ మిలన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ పండుగలు సమాజానికి ఎప్పుడూ కొత్త స్ఫూర్తిని ఇస్తుంటాయని కొనియాడారు. ‘మన సమాజంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అవి ఎల్లప్పుడూ సమాజానికి కొత్త ఉత్సాహాన్ని, శక్తిని, స్ఫూర్తిని అందజేస్తుంటాయి. సామాజికంగా, ఆర్థికంగా మన పండుగలకు గల విశిష్టతను విశే్లషించగలిగితే ఎన్నో కథలు పుట్టుకు వస్తాయి. ఉదాహరణకు పవిత్రమైన గంగానది ఒడ్డున జరిగే కుంభ మేళానే తీసుకుంటే అసంఖ్యాక భక్తులతో జనసంద్రాన్ని తలపించే ఈ ఉత్సవం ఏకంగా ఒక చిన్న దేశానే్న తలపిస్తుంది’ అని ఆయన అన్నారు. ప్రసంగాన్ని ముగించిన తర్వాత మోదీ వేదిక నుంచి దిగివచ్చి పాత్రికేయులతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా కొంతమంది పాత్రికేయులు ప్రధానితో కలసి సెల్ఫీలు తీసుకున్నారు. మోదీ గత ఏడాది కూడా పాత్రికేయులతో కలసి ‘దీవాలీ మిలన్’లో పాల్గొన్న విషయం తెలిసిందే. బిజీ షెడ్యూలు కారణంగా ఈ ఏడాదికార్యక్రమం కాస్త ఆలస్యమైందని, ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా ఉంటే క్రిస్మస్ పండుగ వరకు వేచి ఉండాల్సి వచ్చేదని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొన్నారు. (చిత్రం) ‘దీవాలీ మిలన్’లో ప్రధానితో కలసి సెల్ఫీలు తీసుకుంటున్న పాత్రికేయులు