జాతీయ వార్తలు

గోద్రా అల్లర్ల కేసులో అప్పటి మోదీ సర్కార్‌కు క్లీన్‌ చిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గోద్రా అల్లర్ల కేసు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి మాయన మచ్చగా ఉండేది. ఇపుడు ఈ ఘటనలో ఆయనకు క్లీన్ చిట్ లభించింది. ఈ ఘటనపై విచారణ జరిపిన నానావతి - మోహతా కమిషన్ తన నివేదికను గుజరాత్ అసెంబ్లీకి సమర్పించింది. గోద్రా అల్లర్లకు ఆనాటి గుజరాత్ సీఎం మోదీ సర్కార్‌కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఈ అల్లర్లు ఒకరి ఆధ్వర్యంలో జరిగినవి కావని తేల్చి చెప్పింది.
2002 ఫిబ్రవరి 27న అల్లరి మూకలు సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిప్పు పెట్టాయి. దీంతో ఎస్-6 కోచ్‌లో ప్రయాణిస్తున్న మొత్తం 59 మంది సజీవదహనం అయ్యారు. మృతుల్లో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కరసేవకులే అత్యధికంగా ఉన్నారు. ఈ ఘటన కారణంగా గుజరాత్‌లో పెద్ద ఎత్తున మత ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మారణహోమం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.