జాతీయ వార్తలు

విపక్షాలు పాకిస్తాన్ తరహా వ్యాఖ్యలు:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:పౌరసత్వ సవరణ బిల్లుపై విపక్షాలు పాకిస్తాన్ తరహా వ్యాఖ్యలు చేస్తున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఆయన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే చరిత్రలో సువర్ణాక్షరాలతో ఈ చట్టాన్ని లిఖిస్తారని అన్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలలో మతపరమైన దాడులు ఎదుర్కొంటున్న మైనార్టీలకు ఎంతో ఉపశమనాన్ని ఈ చట్టం కలిగిస్తుందని అన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల నాటికి రైతులు, పారిశ్రామికవేత్తలు సహా అన్నివర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాలని పార్టీ ఎంపీలకు సూచించారు.