జాతీయ వార్తలు

ప్రధాని మోదీతో పవార్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రైతు సమస్యలపై చర్చించేందుకు ఆయన పార్లమెంట్‌లో ప్రధానితో భేటీ అయ్యారు. కాగా ఈ భేటీపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. రాజ్యసభ 250 సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఎన్సీపీ పార్టీపై ప్రశంసలు కురిపించారు. ఎన్సీపీ, జేడీయూ వెల్‌లోకి ఏన్నడూ రాలేదని, కాని సమస్యలపై ఆ పార్టీ సభ్యులు బలమైన వాణిని వినిపించారని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరివురి భేటీ వెనుక మహారాష్టల్రో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. పవార్‌కు రాష్టప్రతి పదవి ఇస్తారని, దీంతో మహారాష్టల్రో బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయని ఊహాగానాలు వినవస్తున్నాయి.