జాతీయ వార్తలు

మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆదివారంనాడు ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. వచ్చే ఏడాది జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ ట్రంప్ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు మోదీ తన ప్రసంగంలో వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ మరో దేశం ఎన్నికల్లో జోక్యం చేసుకోకూడదనే మన దేశ విదేశీ విధానాన్ని మరచి ప్రవర్తించారని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ట్రంప్ అభ్యర్థిత్వాన్ని బహిరంగంగా సమర్థించటం ఇరుదేశాల సార్వభౌమ, ప్రజాస్వామ్య విలువలను ఉల్లంఘించటమే అని ఆనంద్ ట్విట్టర్‌లో తెలిపారు.