మిర్చిమసాలా

వైద్య మంత్రికి జాతకం బాగలేదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి జాతకం బాగా లేదని పంచాంగ శ్రావణం రోజున ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. వైద్యఆరోగ్యశాఖ మం త్రి డాక్టర్ లక్ష్మారెడ్డికి నిజంగానే జాతకం బాగ లేనట్టుగా ఉంది. వైద్య ఆరోగ్యశాఖకు మునుపెన్నడూ లేనివిధంగా బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించినప్పటికీ, ఆ మేరకు సర్కార్ వైద్యాన్ని మెరుగు పరచలేక మంత్రి సతమతమవుతున్నారు. దీనికితోడు సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో 13 మందికి ఆపరేషన్లు వికటించి కంటి చూపు పోయింది. అలాగే ఈ సంఘటన జరిగిన రోజున వైద్యమంత్రి మెదక్ జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు ఒక వికలాంగురాలు మంత్రి కారుకు అడ్డం పడి తన గోడు వెళ్లబోసుకోవాలని ప్రయత్నించింది. అయినప్పటికీ మంత్రి, అధికారులు కనికరించలేదని మీడియాలో క థనాలు వచ్చాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో మంత్రి లక్ష్మారెడ్డి కలత చెందారు. కనికరం లేకపోవడం కాదు, వికలాంగురాలు తన కంట పడలేదని వైద్యమంత్రి వివరణ ఇచ్చుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ఈ ఏడాది వైద్య ఆరోగ్యశాఖకు జాతకం బాగలేనట్టు ఉంది కదూ!
- వెల్జాల చంద్రశేఖర్

అదీ కారణం
మేం ఓడిపోయింది మా పాలన వల్ల కాదు గోరటి వెంకన్న పాట వల్ల అంటున్నారు టిడిపి నాయకులు. 2004లో టిడిపి ఘోరంగా ఓడిపోయింది. విభజన తరువాత ఆంధ్రలో అధికారంలోకి వచ్చినా తెలంగాణలో మాత్రం 2004 దెబ్బ తరువాత కోలుకోలేకపోయింది. టిడిపి పాలన నచ్చక ప్రజలు ఆ పార్టీని ఓడించారని అంతా అనుకుంటారు కానీ అది కాదట కేవలం గోరటి వెంకన్న పల్లే కన్నీరు పెడుతుందో....అనే పాట వల్ల ఓడిపోయారట! ఈ విషయం పార్టీ సమావేశంలో టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇదే విషయాన్ని గోరటి వెంకన్న ముందే ఓసారి చంద్రబాబుకు కూడా చెప్పానని రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఆనాటి పల్లెల పరిస్థితిని కళ్లకు కట్టినట్టున్న ఈ పాట జనంలోకి బాగా వెళ్లింది. పాట వల్ల ఓడిపోయాం అనడం కన్నా ఆనాటి పరిస్థితిని ఈ పాట కళ్లకు కట్టినట్టుంది అనడం సరైన మాట.
- మురళి

మహిళలకు ప్రత్యేకం!
ఓవైపు కృష్ణానది.. చుట్టూ కొండలు.. వాటిపై ఇళ్లు.. కాలువల మధ్య కేవలం బందరు రోడ్డు, ఏలూరురోడ్లలో సుదీర్ఘకాలంగా కునారిల్లుతూ కన్పించే విజయవాడ నగరానికి రాజధాని సంస్కృతి వచ్చేసింది. అన్ని బార్ అండ్ రెస్టారెంట్లలో స్పీడ్ బార్‌ల పేరిట ప్రత్యేక గదులు వెలిశాయి. ఇక వైన్‌షాపుల్లో అనుమతులున్నా, లేకపోయినా పర్మిట్ రూమ్‌లు సిద్ధమయ్యాయి. ఇటీవలి కాలంలో రైల్వే, బస్‌స్టేషన్లు, సినీ థియేటర్లు, ఇతర వ్యాపార కూడలి ప్రాంతాల్లోని స్పీడ్ బార్‌లు, పర్మిట్ రూమ్‌లలో మహిళలు కూడా దర్శనమిస్తున్నారు. కొన్నిచోట్ల మస్తుగా మద్యం సేవించిన మగవారు, మహిళల మధ్య స్వల్ప ఘర్షణలు కూడా జరిగాయి. రోజువారీ మామూళ్ల కోసం నిత్యం వచ్చే పోలీస్ సిబ్బంది గమనించి సిటీ బస్సుల్లో మహిళల సీట్ల వెనుక మెష్ పెట్టినట్లు ఇక్కడ కూడా ప్రత్యేక రూమ్‌లు ఏర్పాటు చేసుకోండి.. అంటూ సలహా ఇచ్చి వెళుతున్నారు. ఇక బార్లలో మరుగుదొడ్లే అంతంతమాత్రం. రేపు వచ్చి ప్రత్యేక మరుదొడ్లు అంటారేమో! ఆపై హిజ్రాలు వచ్చి తాము అటువెళ్లాలా.. ఇటువెళ్లాలా.. లేక తమకూ ప్రత్యేక గది ఏర్పాటు చేస్తారా? అని నిలదీస్తే తామేం చేయాలంటూ పాపం బార్ యజమానులు తలలు పట్టుకుంటున్నారు.
కొసమెరుపు: ఎక్సైజ్ మంత్రితో పాటు తాజాగా కమిషనర్, ఇతర అధికారులు నగరంలోనే కొలువుండటంతో ఎప్పుడు, ఎలాంటి ఆంక్షలు విధిస్తారోనని మందుబాబులు, భామలు భయపడుతున్నారు.
- నిమ్మరాజు చలపతిరావు

గవర్నర్‌కు ఆఫీసా?
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే బొగ్గులేరుకునే వాళ్లు తయారైనట్లు ఒక సామెత అచ్చంగా గవర్నర్‌కు సరిపోతుంది. హైదరాబాద్ రాజధానిని, భవనాలను కోల్పోయి రోడ్డునపడిన ఆంధ్రప్రభుత్వం అమరావతిలో ఇప్పుడిప్పుడే సచివాలయం బిల్డింగులు కొన్ని కట్టి ఊపిరి పీల్చుకుంటోంది. ఇక్కడి నుంచి వేలాది మంది ఉద్యోగులు అమరావతికి తరలివెళుతున్నారు. వెలగపూడిలో చచ్చీ చెడి ఆగమేఘాల మీద కొన్ని బ్లాక్‌లను సిద్ధం చేస్తున్నారు. చాలా కార్యాలయాలకు ప్రైవేట్ భవనాల్లో సదుపాయం కల్పించారు. వెలగపూడి సచివాలయాన్ని చూసేందుకు వెళ్లిన గవర్నర్ తనకూ ఒక కార్యాలయం కేటాయించాలని కోరారు. గవర్నర్‌కు రాజ్‌భవన్ కట్టాలంటే కోట్లా ది రూపాయలు కావాలి. కేంద్రం ఇస్తేనే నిర్మాణమవుతుంది. సీనియర్ ఐఎఎస్‌లే ఒక గదిలో సర్దుకుంటున్నారు. గవర్నర్‌కు ఒక కార్యాలయం సరిపోతుందా.పోలీసు భద్రత కావాలి. గవర్నర్‌కు రాజ్‌భవన్ కావాలంటే మరో ఎనిమిదేళ్లు ఆగకతప్పదేమో?
- శైలేంద్ర

పల్సర్ తిప్పలు
ఏదో సరదాగా రయ్ మంటూ తిరిగేందుకు అనువుగా ఉంటుందని భావించి పల్సర్ ద్విచక్ర వాహనాలు కొనుక్కున్న వారికి పల్స్ రేట్ రోజురోజుకూ పెరుగుతోంది. పల్సర్ బండి కనిపిస్తే చాలు హైదరాబాద్ పోలీసులు ఆపేస్తున్నారు, ఇంతకాలం రాజధానికి మాత్రమే పరిమితమైన ఈ తనిఖీలు ఈ మధ్య తెలుగు రాష్ట్రాలకు పాకింది. ఆంధ్రాలో పల్సర్ కనిపిస్తే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో చైన్ స్నాచర్ల కోసం పల్సర్‌లను ఆపుతుంటే ఆంధ్రాలో సూది మందు ఇస్తున్న వారి కోసం పల్సర్‌లను ఆపేస్తున్నారు. ఇంతకాలం కుషీగా ఉంటుందని పల్సర్ కొనుక్కున్న వారి తిప్పలు అన్నీ ఇన్నీ కాదు.
- బి. వి. ప్రసాద్