మిర్చిమసాలా

వోటరు దేవుళ్ల సంగతో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనందుకు తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రము ఖ ఆలయాల్లో మొక్కులు తీర్చుకోవడం సంతోషకరమే. కానీ, గత ఎన్నికలకు ముం దు ప్రజలకు ఆయన ఇచ్చిన హామీల సంగతేమిటని కాం గ్రెస్ నేత వి.హనుమంత రా వు నిలదీస్తున్నారు. తిరుమల వెంకన్న, కురవి వీరభద్ర స్వామి, వరంగల్ భద్రకాళి, విజయవాడ కనకదుర్గ ఆలయాల్లో కేసీఆర్ వరుసగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. దేవుళ్లు వోటర్లు కారు గనక వారికి ఏ సమస్యలూ ఉండవని విహెచ్ అన్నారు. దేవుళ్లకు మొక్కులు తీర్చకపోతే రానున్న ఎన్నికల్లో గెలవడం కష్టమని భావించి కేసీఆర్ ఆలయాల బాట పట్టారని హనుమ చురకలంటించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేలా కేసీఆర్‌కు జ్ఞానం ప్రసాదించాలని దేవుళ్లను తాను కోరుతున్నానని విహెచ్ విలేఖరులతో అనడంతో అక్కడున్న వారంతా గొల్లున నవ్వారు. ‘మీరూ మొక్కుతున్నారా?’ అని ఓ విలేఖరి అనడంతో మరోసారి అందరూ పెద్దగా నవ్వారు.
-వి.ఈశ్వర్ రెడ్డి

దంపతుల మధ్య ‘సెల్’చిచ్చు!
సెల్‌ఫోన్‌కు మనిషి బానిసగా మారిపోయాడు. ‘సెల్’లో ప్రతి ఒక్కరూ బందీ అయిపోతున్నారు. గంటల తరబడి చాటింగ్‌లు, షేరింగ్‌లతో కాలం గడిపేస్తున్నారు. రో జంతా గడిచిపోయాక ‘అయ్యో..’ అంటున్నారు. మరుసటి రోజు మళ్లీ మామూలే. కొద్దిమంది మా త్రమే సెల్‌ఫోన్లను, సామాజిక మా ధ్యమాలను లెక్కమీద వాడుతున్నారు. మరికొంత మంది విచ్చలవిడిగా వాడుతున్నారు. పర్సనల్ కంప్యూటర్లలో పనులన్నీ ఇపుడు సెల్‌ఫోన్‌లోనే చేస్తూ కాలం గడిపేస్తున్నవారు శారీరక రోగులుగానే కాదు, మానసిక రోగులుగా మారుతున్నారు. అది కాస్తా ముదిరి సామాజిక రుగ్మతగా కూడా మారబోతోంది. తన భార్య రోజంతా సెల్‌ఫోన్‌తోనే గడిపేస్తోందని నరేంద్ర సింగ్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడంతో విచారణ జరిపిన మహిళా న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసు అందరికీ ఓ హెచ్చరిక అని వ్యాఖ్యానించారు. సెల్ చాటింగ్ చేసిన వారు పెన్ను, పెన్సిల్ కూడా సరిగా పట్టుకోలేకపోతున్నారని ఓ నివేదిక చెబుతోంది...తస్మాత్ జాగ్రత్త..
-బీవీ ప్రసాద్

మూలాలను మరచి..
కాంగ్రెస్‌లో పుట్టి నాయకుడిగా ఎదిగిన తెదేపా అధినేత చంద్రబాబు తన ‘మాతృసంస్థ’ ను తూర్పార పట్టగలరు. మళ్లీ అదే కాంగ్రెస్ పార్టీ నేతలతో చెట్టపట్టాల్ వేసుకుని తిరగగలరు. ప్రధాని నరేంద్ర మో దీతో నాలుగేళ్ల పాటు చెలిమి చేశా రు. ప్రస్తుతం మోదీని, భాజపా ను దుమ్మెత్తి పోస్తున్నారు. భా జపా ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఫిరాయింపుదారుగాను, వైకాపాకు ‘అద్దె మైకు’గాను బాబు విమర్శించారు. 23 మంది వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలో చేర్చుకొని, వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టిన చంద్రబాబు ఫిరాయింపుల గురించి మాట్లాడడం వింతగా ఉందని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. తాను కాంగ్రెస్‌లో ఉంటూ మంత్రి పదవిని అనుభవించిన చంద్రబాబు ఇపుడు ‘కన్నా’ను ఫిరాయింపుదారు అనడం సబబేనా? అన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అయితే, ఇలాంటి వ్యాఖ్యానాలకు చలించని బాబు మాత్రం ‘ఆ విధంగా ముందుకు’ పోతున్నారు.
-నిమ్మరాజు చలపతిరావు