మిర్చిమసాలా

‘మార్పు’కు మినహాయింఫు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు కోసం ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. నీటి పారుదల ప్రాజెక్టులకు రీ- డిజైన్ చేశారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ లోనూ సంస్కరణలు ప్రవేశపూట్టారు. పాత జిల్లాల స్థానంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. అన్నింటిలోనూ మార్పును కోరుకునే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, తన సొంత పార్టీలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులను మార్చేది లేదని, రాబోయే ఎన్నికల్లో వారికి టిక్కెట్లు ఖాయమని ఇటీవల తెరాస ప్లీనరీలో ప్రకటించారు. మరి సొంత పార్టీలో గుణాత్మక మార్పు అవసరం లేదా..? లేక మినహాయింపా..?
-వెల్జాల చంద్రశేఖర్

ఐ-్ఫన్ ఎత్తుకెళ్ళిన సింహం..!
ఆ సింహం ఏమి చేసిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఓ ఐ-్ఫన్‌ను ఎత్తుకెళ్ళింది. సింహానికి ఐ-్ఫన్‌తో పనేమిటని ఆశ్చర్యపోతున్నారా?. కేరళలోని ఓ భవనం ఆవరణలో ఉన్న కిరణా స్టోర్‌కి రాత్రి వేళ సింహం వచ్చింది. సింహాన్ని చూ సిన షాపు యజమాని షాక్‌కు గురై, ఇంకేముందీ పరుగు లంఘించాడు. ఆ సింహం షాపులో ఉన్న ఐ-్ఫన్, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఓ చాక్లెట్ల డబ్బాను కూడా ఎత్తుకుని పరారైంది. ఈ లోగా పోలీసులను తీసుకుని వచ్చిన యజమాని షాప్‌లో చోరీకీ గురైన వస్తువుల గురించి తెలిశాక పోలీసులూ షాక్ తిన్నారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే వచ్చింది దొంగేనని, సింహం వేషం వేసుకుని వచ్చాడని నిర్థారణ అయ్యింది. ఆ డూప్లికేట్ సింహాన్ని పట్టుకుని, కటకటాలు లెక్కించాలని పోలీసులు శ్రమిస్తున్నారు. అందుకేనేమో ‘పులి తోలు కప్పుకుని..’ అనే సామెత వచ్చింది. అదీ సంగతి..!
-వి. ఈశ్వర్ రెడ్డి

హిజ్రాలకు మరుగేదీ..?
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హిజ్రాలపై పోటాపోటీగా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. ఓటర్ల జాబితాలో వారికి ప్రత్యేకంగా మూడో కాలమ్ ఉండాలని కేంద్రం నిర్ణయంచగా, ఏపీ ప్రభు త్వం హిజ్రాలకు రూ. 1500ల పెన్షన్ పథకాన్ని ప్రకటించింది. అయితే, వారికి కాస్తంత మరుగు కల్పిద్దామనే ఆలోచన మాత్రం పాలకులకు ఇంకా రాలేదు. సినిమా హాళ్లు, హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, వాణిజ్య సంస్థల్లో పురుషులకు, మహిళలకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఉన్నాయి. హిజ్రాలకు ప్రత్యేక సౌకర్యాలు లేకపోవటంతో వారిని ఎటువైపు పంపించాలో తెలియక యజమానులు జుట్టు పీక్కుంటున్నారు. కాగా, స్వచ్ఛ భారత్ పేరిట లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల కోసం మరుగుదొడ్లు నిర్మించని విషయం కూడా అక్షర సత్యం!
-నిమ్మరాజు చలపతిరావు