మిర్చిమసాలా

కాఫీ కోసం హస్తిన యాత్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సార్వత్రిక ఎన్నికలకు ఇక ఏడాది మాత్రమే మిగిలి ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెదేపా, వైకాపాలు పోటాపోటీగా ఉద్యమిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గం నుంచి టిడిపి మంత్రులు వైదొలగడం, వైకా పా ఎంపీలు రాజీనామాలు సమర్పించడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హస్తినకు వెళ్లి వివిధ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఎన్‌డిఏతో నాలుగేళ్ల బంధాన్ని తెంచుకున్నాక ఇప్పుడు చంద్రబాబుకు ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశమే లేదని సిపిఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ మండిపడ్డారు. హస్తినలో బాబు ‘స్ట్రాంగ్ కాఫీ’ తాగి వెనక్కి వచ్చారే తప్ప, అక్కడ చేసిందేమీ లేదని ఆయన విమర్శించడంతో అక్కడున్న వారంతా గొల్లుమని నవ్వారు.
-వి.ఈశ్వర్ రెడ్డి
టిక్కెట్ దొరికితే చాలు..
అధికార, ప్రధాన ప్ర తిపక్షం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. అధికార పార్టీలో తృటిలో టిక్కెట్ తప్పిపోయిన వారికి ప్రధాన ప్రతిపక్షం నుంచి, ప్రధాన ప్రతిపక్షంలో చాన్స్ లేనివారికి అధికార పక్షం చివరి నిమిషంలో టిక్కె ట్ ఇచ్చి బరిలోకి దింపడం మా మూలే. అలాగే, ఎన్నికల సమయంలో పొ త్తు పెట్టుకునే పార్టీలకు కూడా రెండో, మూడో టికెట్లు ఇవ్వడం మా మూలే. ప్రస్తుతం తెలంగాణ టీడీపీది అదే పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో టీడీపీకి పొత్తు ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఇదివరకే ప్రకటించారు. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నుంచి టికెట్లు రావన్న ఆశ వదులుకున్న కొందరు నాయకులు కనీసం పొత్తులో భాగంగానైనా టీడీపీ నుంచి చాన్స్ వస్తుందేమోనన్న నమ్మకం గుట్టుచప్పుడు కాకుండా అప్పుడే ప్రయత్నాలు చేస్తున్నారట!
-వెల్జాల చంద్రశేఖర్
‘అతి’తో అవస్థలే...
కార్యకర్తల్లో, ప్రజల్లో ‘జోష్’ పెంచేందుకు ప్రభుత్వాలు అనేక హామీలు ఇవ్వడం సహజమే. ఇటీవల కరీంనగర్‌ను ఇస్తాంబుల్‌లా మారుస్తామని, హుస్సేన్‌సాగర్‌ను కొబ్బరినీళ్లు మాదిరి స్వచ్ఛంగా మారుస్తామని, వరంగల్‌ను మహానగరం చేస్తామని ప్రకటించి తెలంగాణ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇటీవల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కేజీ నుండి పీజీ వరకూ తెలుగు తప్పనిసరి అమలుచేస్తామని కూడా తెరాస సర్కారు హామీ ఇచ్చింది. అయితే- ఇది పీజీ వరకూ సాధ్యం కాదని, యుజి వరకూ తప్పనిసరి చేస్తామని గళం సవరించింది. అది కూడా కుదరదని అధికారులు చెప్పడంతో ఇంటర్మీడియట్ వరకూ తెలుగు తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్ వరకూ తెలుగును ఎలా తప్పనిసరి చేస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించడంతో నాలుక కరచుకుని, టెన్త్ వరకూ తప్పనిసరి చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇదే నిజమైతే మా పరిస్థితి ఏమిటని విద్యార్థులు ప్రశ్నించడంతో- ‘లేదు లేదు, ఈ ఏడాది ఒకటో తరగతి, ఆరోతరగతిలో మాత్రమే తెలుగు తప్పనిసరి చేస్తాం, వచ్చే ఐదేళ్లలో టెన్త్ వరకూ తప్పనిసరి చేస్తాం’ అని మళ్లీ సవరించుకుంది. అత్యుత్సాహం అంటే ఇదేనేమో!
- బీవీ ప్రసాద్