మిర్చిమసాలా

ఇదేం ‘డ్యూటీ’రా బాబూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే ఇన్నాళ్లూ ఎంతోకొంత జరిమానాతో సరిపోయేది. నవ్యాంధ్ర రాజధాని విజయవాడ ప్రాంతంలో ఇప్పుడు జరిమానాల జాడ అంతగా కనిపించడం లేదు. రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో నిర్మొహమాటంగా కేసులు రాస్తుంటే న్యాయమూర్తులు నిందితులకు మూడు రోజులు జైలుశిక్ష విధిస్తున్నారు. జరిమానాలు కూడా సరిపోవని భావించిన పక్షంలో మందుబాబుల చేత ట్రాఫిక్ డ్యూటీ చేయిస్తున్నారు. రహదారులపై ఎండలో నిలబెట్టి ఇలా ట్రాఫిక్ డ్యూటీ చేయించడంపై నిందితులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అందరి ముందూ నిలబడలేక సిగ్గుతో మెలికలు తిరిగిపోతున్నారు. 2017లో ఒక్క విజయవాడలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 6వేలకు పైగా నమోదైతే ఈ ఏడాది జనవరిలోనే 640 కేసులు నమోదయ్యాయట!
-నిమ్మరాజు చలపతిరావు

సవాళ్ల సీజన్!
వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికీ మంచినీటిని అందించకుంటే ఓట్లు అడగనని తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలోనే సవాల్ చేయగా, తండ్రికి తగ్గ తనయుడు అన్నట్టు మంత్రి కేటీఆర్ మరో అడుగుముందుకేసి టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. కేటీఆర్ సవాల్‌ను టి-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వీకరిస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే తాను కూడా రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని ప్రకటించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసరడమంటే కాంగ్రెస్ పార్టీకి విసిరినట్టే అవుతుంది తప్ప వ్యక్తిగతంగా కాదుకదా! కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే గడ్డం తీస్తానని ఉత్తమ్ ఇదివరకే ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్ ఓడిపోతే గనుక రాజకీయ సన్యాసం, పెరిగే గడ్డం ఉత్తమ్‌కు తప్పవని టీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గడ్డం గురించి ఉత్తమ్ స్పష్టత ఇవ్వకపోవడం ప్రస్తుతానికి సస్పెనే్స!
- వెల్జాల చంద్రశేఖర్

వీఐపీలైనా సరే..
విఐపిలు వస్తున్నారంటే హంగూ ఆర్భాటం అంతా ఇంతా కాదు. విఐపి రావడానికి గంట ముందే ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ స్తంభింపచేసే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. అయితే- విఐపిల మంటూ వస్తున్న వారికి సమ్మక్క-సారలమ్మ జాతరలో పరాభవం తప్పలేదు. ఎక్కడైనా విఐపి ఏమో గానీ, అమ్మవారి ముం దు అలాకాదు అంటున్నారు సామాన్య భక్తులు. చత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ సమ్మక్క దర్శనం చేసుకున్నా, సారలమ్మ దర్శనం చేసుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పీకర్ మధుసూధనాచారి కాన్వాయ్‌ను వదిలేసి సామన్య భక్తుడిలా కాలినడకన వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఇలాగే చాలామంది ‘ముఖ్యుల’కు జాతరలో కష్టాలు తప్పలేదు
-బీవీ ప్రసాద్

టోపీ మంత్రి..
తెలంగాణ హోం మం త్రి నాయిని నర్సింహారెడ్డి నెత్తిపై గుండ్రని టోపీ పెట్టుకుని పోలీస్ అకాడమీలో మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల పా సింగ్ ఔట్ పరేడ్‌కు హాజరై అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. టోపీతో కనిపించే సరికి ఒక్కసారిగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆయన గుర్తుకు తెచ్చారు. బహుశా రాజ్‌నాథ్‌ను అనుసరించి మంత్రి నాయిని ఇలా చేసి ఉంటారని అంతా అనుకున్నారు. పోలీసుల మాదిరి తాను కూడా ఏదో ఒక టోపీ పెట్టుకుంటుంటే బాగుంటుందని భావించారేమో..
- బీవీ రమణ

మా ఊరొస్తే బాగుండేది..
ముఖ్యమంత్రి కేసీఆర్ మా ఊరు వస్తే బాగుండేది అని కాస్తో కూస్తో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్న తెలంగాణలోని చాలా గ్రామాల వాళ్లు, పట్టణాల వాళ్లు అనుకుంటున్నారు. కేసీఆర్ నోటి నుండి వచ్చేది వందకోట్లు, యాభైకోట్లు, పదికోట్లు ఇలా.. కోట్లల్లోనే ఉంటోంది. ఇప్పటికే యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ తదితర ఆలయాలకు కోట్లాది రూపాయలిచ్చి ఆయన బాగుచేస్తుండు. తాజాగా మేడారం అభివృద్ధికి వందకోట్లు కాదు కాదు రెండొందల కోట్లు ఇస్తానని ఆయన ఘనంగా ప్రకటించేశారు. దాంతో చాలా మంది నాయకులు తమ తమ గ్రామాల్లోని ఆలయాలకు కేసీఆర్‌ను తీసుకుపోయేందుకు ఆలోచిస్తున్నారంట. ఆయన వస్తానంటే చాలు.. ఇక కోట్లు వచ్చినట్టే. తమ గ్రామాలలోని ఆలయాలు బాగుపడుతాయన్నది నేతల ఆశ.
-పి.వి. రమణారావు

పెళ్లికి తొందరేంటి?
పదవుల్లో ఉన్న నేతలు, కీలక అధికారులు విశ్వప్రయత్నాలు చేసినా కొన్ని సందర్భాల్లో సంక్షేమ పథకాలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. కానీ, కొన్ని స్కీంలు ఊహించని విధంగా హిట్ అవుతాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కల్యాణలక్ష్మి పథకం గ్రామప్రాంతాల్లో పే దింటి యువతులకు ఆశాకిరణంలా మారింది. ఈ పథకం వచ్చాక బాలికలు బుద్ధిగా పాఠశాలలకు వెళ్లి చదువుకుంటున్నారు. 18 సంవత్సరాల వ యస్సు వస్తేనే వీరు కల్యాణలక్ష్మి స్కీంకు అర్హులవుతారు. పెళ్లి వయసు రానిదే ఈ స్కీం కింద సహాయం అందదు. ప్రస్తుతం అర్హులైన యువతులకు పెళ్లి సందర్భంగా రూ.75,116 చొ ప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. 18 ఏళ్లు వచ్చేవరకూ చదువుకుంటామని, ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటామని బాలికలు తల్లిదండ్రులకు ధైర్యంగా చెబుతున్నారు. కల్యాణలక్ష్మితో ఇలా మహిళా సాధికారత కూడా పెరుగుతోంది.
- శైలేంద్ర