మిర్చిమసాలా

‘చెత్త’ మహోత్సవాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్సవాలు ఉంటాయి కానీ ఈ ‘చెత్త’ మహోత్సవాలు ఏమిటా? అని విస్తుపోతున్నారు కదూ!. అదేనండి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఈ ‘చెత్త’ మహోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఇకమీదట ప్రతి కుటుంబం ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేర్వేరు డబ్బాల్లో వేసి, ఇంటి ముందుకు వచ్చే ‘స్వచ్ఛ ఆటో’కు అందించాలి. ఈ ‘చెత్త’ మహోత్సవాలపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రత్యేకంగా 3 వేల మందికి పైగా మహిళా ‘స్వచ్ఛ దూత్’లను నియమించారు. తడి, పొడి చెత్తను విడ దీసి స్వచ్ఛదూత్ యాప్‌లో అప్‌లోడ్ చేసిన వారిలో నుంచి లాటరీ తీసి లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తారట. ‘చెత్త’ మహోత్సవాలతో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
-వి.ఈశ్వర్ రెడ్డి
సప్తమి సెంటిమెంట్
సెంటిమెంట్ పేరు చెబితే అగ్రస్థానంలో ఎన్‌టిఆర్ ఉంటారు. ప్రతి పనీ సెంటిమెంట్‌తో జాతకాలు, తిథి గడియలు చూసి చేసేవారని ప్రతీతి. ఆయన బాటలోనే బాలకృష్ణ కూడా నడుస్తుంటారు. సినిమా ముహుర్తం, సినిమా పేరు మొదలు విడుదల వరకూ అన్ని విషయాల్లో తన సెంటిమెంట్‌నే అనుసరిస్తారు. తాజాగా ఆయన రేకెత్తించిన అంశంలోనూ సెంటిమెంట్ ఉందని చెబుతున్నారు. రథసప్తమి రోజున విజయవాడ సీఎం కార్యాలయంలో సీఎం కుర్చీలో కూర్చోవడం పెను సంచలనమే రేకెత్తించింది. మామూలుగా అయితే ఈ విషయం తెలిసేది కాదేమో, ఆ రోజు ఆయన అనంతపురం జిల్లాకు చెందిన అధికారులతో లేపాక్షి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సిఎం కొడుకుగా మాత్రమే కాదు, ఎమ్మెల్యేగా సైతం నియమనిబంధనలు తెలిసిన బాలకృష్ణ తెలియక కూర్చోలేదన్నది మరికొంత మంది ఉవాచ... ఇంతకీ సెంటిమెంట్‌తో ఆ కుర్చీలో ఎందుకు కూర్చున్నారు...తెలుస్తునే ఉందిగా....
-బి.వి.ప్రసాద్

కుప్పి గంతులు
కుప్పి గంతులంటే అందరికీ తెలిసిందే. ఒక నిలకడ లేని తనంతో కోతి గెంతులేస్తుంటుంది. విశాఖపట్నం రైల్వే జోన్ వ్యవహారంలో కూడా నిలకడ లేకుండా కేంద్రం వ్యవహరిస్తోంది. దీంతో ఆంధ్ర ప్రజలు కుప్పిగంతులకు సరైన పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. మొన్నీ మధ్య రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి 90 శాతం రైల్వే జోన్ రావడం ఖాయమని, కాని విశాఖపట్నం అందుకు అనువైన ప్రదేశం కాదని తేల్చారు. సరే విశాఖపట్నంలో కాకపోతే మరో విజయవాడ లేదా గుంటూరులో పెట్టండి. ముందు ఆంధ్రాకు రైల్వే జోన్ ఇస్తారా లేదా అనేది ముఖ్యం. వచ్చే బడ్జెట్ చివరి బడ్జెట్. ఎన్నికల బడ్జెట్. ఈ సారి కూడా రైల్వే జోన్‌కు ఏపికి మంజూరు చేయకపోతే ఎన్టీఏ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారా ? ఆంధ్రాకు ప్రత్యేక హోదాను ఎప్పుడో అటకెక్కించేశారు. రైల్వే జోన్ విశాఖపట్నంలో పెట్టేందుకు ఏమి ఇబ్బందులో ఇంతవరకు కేంద్రం నోరు విప్పిచెప్పలేదు. ఒరిస్సా నుంచి విశాఖ డివిజన్‌ను బయటకు తేవాలి. ఆ తర్వాత రైల్వే జోన్‌ను పెట్టాలని రైల్వే అధికారులంటున్నారు. ఏమైనా బడ్జెట్ వస్తుందంటే చాలు రైల్వే జోన్‌పై చర్చ మొదలవుతోంది. ఎక్కడో ఒక చోట విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రైల్వే జోన్ పెట్టకపోతే, పార్లమెంటును ఎలా నమ్మాలి.
-శైలేంద్ర

‘పవన’ రాజకీయం!
జల విద్యుత్, ధర్మల్ విద్యుత్, సౌర విద్యుత్‌లతో పాటు ‘పవన’ విద్యుత్ (విండ్ పవర్) కూడా ఒకటి. గాలివాటుకు తిరిగే రెక్కల నుంచి పవన విద్యుత్ పుడుతుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలు కూడా గాలివాటు రాజకీయంగా మారింది. పవన్ కల్యాణ్ రాజకీయాలకు కూడా ఒక దిశ దశ అనేది లేదనీ తేలిపోయింది. కాంగ్రెస్ నేతల పంచలు ఊడదీస్తానని గతంలో పవన్ కల్యాణ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రకు తీరని ద్రోహం చేసిందంటారు. ఆ పార్టీ అంటే తనకు గౌరవం అంటారు. గతంలో కెసిఆర్‌ను విమర్శించిన ఆయనే తనకు కెసిఆర్ అంటే అభిమానం అంటారు. ఒకసారి కెసిఆర్, చంద్రబాబును పొగుడుతారు, మరోసారి విమర్శిస్తారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏమి మాట్లాడుతారో తెలియని పరిస్థితి. సిఎం కెసిఆర్‌ను ఇటీవల పొగడటంతో పవన్ నడిపేది జనసేన కాదు భజనసేన అని కాంగ్రెస్ నేత విహెచ్ విమర్శించగానే, వీహెచ్‌ను కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడమే జనసేన లక్ష్యమంటారు, తెలంగాణ నుంచి రాజకీయ యాత్ర ప్రారంభిస్తారు.
తనకు కొంత పిచ్చి ఉన్నా దానికో లెక్కుందని చెప్పుకునే పవన్ కల్యాణ్‌కు, ఆయన చేసే రాజకీయాలకు మాత్రం ఒక లెక్కా పత్రమంటూ లేకుండా పోయింది. పవన్ కల్యాణ్ రాజకీయం ‘పవన’ విద్యుత్ మాదిరిగా గాలివాటు రాజకీయంగా మారింది.
-వెల్జాల చంద్రశేఖర్

డబుల్ ధమాకా..?!
ఆంధ్రప్రదేశ్‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు, వారి రాకతో క్షణక్షణం బెంబేలెత్తుతున్న అధికార టీడీపీ ఎమ్మెల్యేలు.. వీరందరినీ కాపాడుకునే ప్రయత్నంలో సీఎం చంద్రబాబు మినహా ఏ ఒక్కరూ శాసనసభ నియోజకవర్గాల పెంపును కోరటం లేదు. పెరుగుతాయని ఆశించడమూ లేదు. ప్రజలు మాత్రం పరిపాలనా సౌలభ్యం కోసం కలెక్టర్, ఇతర ముఖ్య అధికారులు తమకు అందుబాటులో ఉండాలని, తెలంగాణ సీఎం కేసీఆర్‌లా జిల్లాల సంఖ్య పెంచితే మేలని కోరుకుంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ జిల్లాలు 10 నుంచి ఏకంగా 31కి పెరిగాయి. ఇక్కడ నేటికీ 13 జిల్లాలే కొనసాగుతున్నాయి.
కొసమెరుపు: అక్కడ త్రిబుల్ ధమాకా అయితే ఇక్కడ కనీసం డబుల్ ధమాకా అయినా చూపించు బాబూ.. అని జనం కోరుతున్నారు.
-నిమ్మరాజు చలపతిరావు