మిర్చిమసాలా

థగ్ గయా బేచారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిటిడిపిని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని టిటిడిపిలో ప్రముఖ నేత మెత్కుపల్లి నర్సింహులు చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్‌ను మెత్కుపల్లి దూషించినంతగా మరెవ్వరూ దూషించలేదు. అలాంటి ఆయన నోటనే టిటిడిపిని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదన రావడం ఆశ్చర్యకరమైందే. మోత్కుపల్లిలో ఇంత మార్పుకు కారణం ఏమై ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. కెసిఆర్‌ను తిట్టడం ఒక్కటే పనిగా పెట్టుకున్నందుకు ప్రతిఫలంగా తనకు గవర్నర్ పదవీ ఇప్పించాలని చంద్రబాబుపై మోత్కుపల్లి ఎప్పటి నుంచో వత్తిడి చేస్తున్నారు. ఎన్డీయోలో టిఆర్‌ఎస్ భాగస్వామ్యం కాకపోయినా కెసిఆర్‌కు మంచి పరపతియే ఉంది. తనకు గవర్నర్ పదవి ఇవ్వడానికి కెసిఆర్ ఎక్కడ అడ్డుపడుతాడోనని కొంతకాలంగా మోత్కుపల్లి నోరు మెదపడం లేదు. అయినప్పటికీ గవర్నర్ పదవి దక్కకపోవడంతో కెసిఆర్ వైపు నుంచి కూడా మార్గం సుగమం చేసుకోవడానికే విలీన పల్లవి అందుకొని ఉండవచ్చని రాజకీయ వర్గాల అంచనా. మోత్కుపల్లి వ్యాఖ్యలను చూస్తే గవర్నర్ పదవి కోసం ఎదురు చూసి, ఎదురు చూసి పాపం ‘్థగ్ గయా బేచారా’ అనిపిస్తోంది!
-వెల్జాల చంద్రశేఖర్
చెప్పులు సరే.. ప్రాణమో..??
చెప్పులే కదా అని లైట్ తీసుకోలేం... ఆ మధ్య అమ్మాయిల ఫోటోలు తీయడానికి చెప్పుల్లో మైక్రో కెమెరా పెట్టుకోగా, మరో మహానుభావుడు చెప్పుల్లో బంగారం ప్లేట్లు పెట్టుకుని శంషాబాద్‌లో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు. ఇలా చెప్పులతో గమ్మత్తులు చేసేవారు కోకొల్లలు. బెంగళూరులోని ఎంపి మోహన్ ఇంటికి వెళ్లిన ఉప రాష్టప్రతి పని ముగించుకుని బయటకు వచ్చి చూసుకుంటే తన చెప్పులు అదృశ్యమయ్యాయి. డజనుకు పైగా ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఉరుకులు పరుగులుపెట్టి ఇల్లంతా గాలించినా చెప్పులు దొరకలేదు. చెప్పులే కదా పోయాయి అనుకుంటే రేపు ప్రాణాన్ని ఏం రక్షిస్తారు అంటూ కార్యకర్తలు సెక్యూరిటీ సిబ్బందిపై మండిపడ్డారు. చెప్పులు పోవడాన్ని చిన్న అంశంగా తీసుకోలమా? -బి.వి.ప్రసాద్

ఇక్కడెలా చెప్మా..!!
దేశవ్యాప్తంగా హిజ్రాలను ప్రభుత్వం ఎట్టకేలకు గుర్తించింది. ప్రధానంగా ఎంతో కీలకమైన ఓటర్ల జాబితాలోనే వారి కోసం ప్రత్యేకంగా మూడో కాలమ్ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మరో అడుగు ముందుకేసి దేశంలోనే తొలిసారిగా నెలకు వెయ్యి రూపాయల పింఛను ప్రకటించింది. ప్రత్యేక ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టింది. ఇదంతా బాగుంది. సినిమా హాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, పాఠశాలలు చివరకు బార్ అండ్ రెస్టారెంట్లలో కూడా పురుషులు, మహిళలకు వేర్వేరుగా మరుగుదొడ్లున్నాయి. ఆ మేరకు నిబంధనలు కూడా అమలవుతున్నాయి. అయితే ప్రభుత్వం గుర్తించిన హిజ్రాలకు ప్రత్యేకమైన నిబంధన లేకపోవటంతో వారిని ఎటు పంపించాలో తెలియక ఆయా సంస్థల నిర్వాహకులు సతమతమవుతున్నారు. ప్రత్యేక జీవో లేకుండా తామేమీ చేయలేమంటూ మున్సిపల్ అధికారులు కరాఖండిగా చెబుతున్నారు.
-నిమ్మరాజు చలపతిరావు

ఇంటి గుట్టు రట్టయింది
ఇంటి గుట్టు ఈశ్వరుడికైనా తెలియదంటారు. కాని హైదరాబాద్‌లో పోలీసులు నిర్వహించిన నేరస్తుల సమగ్ర సర్వేతో తమ ఇంట్లో ఎవరు నేరస్తులు, ఎవరు నేరస్తులు కారనే విషయం కుటుంబ సభ్యులకు, ఇంటి యజమానులకు తెలిసిపోయింది. ముందుగా ఇంటి యజమానులకు తమ ఇంట్లో అద్దెకు ఉన్న వాళ్లలో నేరస్తులు ఎవరో తెలిసింది. పోలీసులు ఇంటికి రావడమంటే, సాధారణప్రజలు ఎవరైనా హడలిపోతుంటారు. గుంపులు గుంపులుగా పోలీసులు చేరడం, ఇంటికి రావడంతో ఇంటి యజమానులు అద్దెకు ఉన్న వాళ్లలో నేరస్తులుంటే ఖాళీ చేయమంటున్నారంట. ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్లు అంటే ఇదేనేమో. జైలుకువెళ్లి వస్తే ఏదో వేరే ఊరికి వ్యాపారం నిమిత్తం వెళ్లి వచ్చామని ఇంతవరకు అద్దె ఇంట్లో ఉన్న జైలు పక్షులు చెప్పుకునేవారు. సర్వే పేరుతో తాము నేరస్తులమనే గుట్టు రట్టుకావడంతో, నేరగాళ్లు ఖంగు తిన్నారు.
-శైలేంద్ర
కాళేశ్వర చంద్రశేఖర్ రావు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలుగులో మాట్లాడడమే కాకుండా కొన్ని సార్లు సందర్భోచితంగా ఛలోక్తులూ విసురుతున్నారు. గవర్నర్ నరసింహన్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గవర్నర్ ప్రసంగిస్తూ రెండేళ్ళ క్రితం సిఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడే తాను ‘కలల చంద్రశేఖర్ రావు’ అనుకున్నానని, ఇప్పుడు ‘కల్వకుంట్ల కాదు కాళేశ్వరం చంద్రశేఖర్ రావుగా మారిపోయారు..’ అనడంతోనే సభికులు కరతాళధ్వనులు చేశారు. దగ్గర ఉండి స్వయంగా పనులు పర్యవేక్షించిన మంత్రి హరీష్ రావు ఇక కాళేశ్వర రావుగా చరిత్రలో మిగిలిపోతారు..అనగానే సభికులు మరోసారి హర్షధ్వానాలు చేశారు. దటీజ్ గవర్నర్ నర‘సింహ’న్.
-వి.ఈశ్వర్ రెడ్డి