మిర్చిమసాలా

మెట్రో క్రెడిట్ ఎవరిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెట్రోరైలు క్రెడిట్ తమదంటే తమదని రాజకీయ పార్టీలు కీచులాడుకుంటున్నాయి. మెట్రోరైలు ప్రాజెక్టులో టిఆర్‌ఎస్ సర్కార్ గొప్పతనమేమీ లేదని, అదంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని తెలంగాణ పిసిసి చెప్పుకొచ్చింది. మెట్రోరైలుపై క్రెడిట్, డెబిట్‌ల గోలెందుకు క్రెడిట్, డెబిట్‌లను ప్రజలే తేలుస్తారని మున్సిపల్ మంత్రి కెటిఆర్ సెలవిచ్చారు. ఇది ఎవరి క్రెడిట్ కాదు, తనదేనని సందట్లో సడేమియాలా ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కూడా వాపోయారు. అది ఎవరి క్రెడిట్ కాదు దివంగత సిఎం వైఎస్‌ఆర్‌దని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేసారు. ఈ వివాదాన్ని చూస్తే అచ్చం తెలంగాణ రాష్ట్రం ఎవరి వల్ల వచ్చిందన్నట్టుగా మారింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తామేనని కాంగ్రెస్, తమ మద్దతు వల్లనే సాధ్యమైందని బిజెపి, తెలంగాణను ఇచ్చేలా చేసింది తామేనని టిఆర్‌ఎస్ వాదన. ఏ పార్టీ వాదన ఎలా ఉన్నా చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన క్రెడిట్‌ను ప్రజలు టిఆర్‌ఎస్‌కు ఇచ్చినట్టే, మెట్రోరైలు క్రెడిట్ కూడా టిఆర్‌ఎస్ సర్కార్‌కే దక్కిందన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు!
-వెల్జాల చంద్రశేఖర్
హెల్మెట్ షాక్!
ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిన చందంగా.. ద్విచక్ర వాహనదారుల హెల్మెట్ ధారణ పెట్రోలు బంక్ సిబ్బందికి ప్రాణసంకటంగా మారింది. కృష్ణా జిల్లా యంత్రాంగం సమష్టి ఒత్తిడితో హెల్మెట్ కలిగిన ద్విచక్ర వాహనచోదకుల వాహనాలకే పెట్రోలు కొట్టిస్తున్నారు. దీనికి సంబంధించి బ్యానర్లు కూడా వెలిశాయి. హెల్మెట్ లేనివారు వెనక్కి తిరిగిపోవటమో, లేక మరొకరి హెల్మెట్‌ను ఆశ్రయించటమో చేయాల్సి వస్తోంది. దీంతో కడుపు మండిన వారు టిట్ ఫర్ టాట్‌గా తమకు బిల్ ఇస్తేకానీ డబ్బు చెల్లించలేమని మొండిగా చెబుతుండటంతో ఓవైపు సిబ్బందికి అదనపు పనిభారం, మరోవైపు క్యూలో వాహనచోదకులకు క్యూలలో నిరీక్షణ తప్పటం లేదు!
-నిమ్మరాజు చలపతిరావు

పోలవరం.. సోమవారం
ఏ ముహుర్తంలో పోలవరం ప్రాజెక్టుకు శంకుస్ధాపన జరిగిందో కాని, నిర్మాణం వేగం పుంజుకున్న దశలో వివాదాలు మళ్లీ చుట్టుము
ట్టాయి. పోలవరం ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని అంటారు. పార్లమెంటులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కేంద్రం నిధులు ఇచ్చి మొత్తం ఖర్చు భరిస్తానంది. తీరా చూస్తే పోలవరం ప్రాజెక్టును ఆపేయమంటే ఆపేస్తామని, కేంద్రమే నిర్మాణం చేపడితే ఇబ్బందిలేదని ఏపి సిఎం చంద్రబాబు ప్రకటించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. పోలవరం అంటే సోమవారం గుర్తుకు వచ్చే విధంగా చంద్రబాబు గత మూడేళ్లుగా ప్రతి సోమవారం పోలవరంలో గడిపారు. ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో ఆ దేవుడికి తెలియాలి. కాని నిర్మాణం పనులు స్పీడ్‌గా జరుగుతున్న దశలో మళ్లీ బ్రేక్‌లు. దీంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. పోలవరం ఎవరు నిర్మించినా ప్రజలకు వచ్చిన బాధలేదు. కాని ఈ ప్రాజెక్టును ఆపడానికి తెలియని శక్తులు చేస్తున్న కుట్రలు మాత్రం ఆంధ్ర ప్రజలకు గుండెకోతను మిగులుస్తోంది. ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా జనం ఏకమవుతారా?
-శైలేంద్ర

మళ్లీ రావమ్మా.. ఇవాంకమ్మా
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్ నగరానికి రావడంతో ఫలక్‌నుమా ప్యాలెస్ ధగధగలాడినట్లే, ఆమె పర్యటించిన రూట్లలో రోడ్లన్నీ ధగధగలాడాయి. ఆమె పుణ్యమా అని రోడ్లు బాగు పడ్డాయని నగర ప్రజలు సంతసించారు. కనీసం మూడు నెలలకోసారైనా ‘మళ్లీ, మళ్లీ, రావమ్మా ఇవాంకమ్మా మా నగరానికీ..’ అని కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ ఆమెను కోరారు. వచ్చిన ప్రతి సారీ కొత్త ప్రాంతానికి వెళితే, ఆ ప్రాంతాలు బాగుపడతాయని ఆయన తెలిపారు. కాగా, ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపి వి. హనుమంత రావు మరో అడుగు ముందుకేసి మీరు చూసినవన్నీ వాస్తవాలు కాదని, మేడిపండులా పైపై మెరుగులు దిద్దారని, మహిళలు ఎన్నో అవమానాలకు గురవుతున్నారని, మంత్రివర్గంలో మహిళలకు చోటు లేదని ఆరోపిస్తూ ఏకంగా ఆమెకు ఓ లేఖ రాశారు.
-వి.ఈశ్వర్ రెడ్డి