Others

‘కేక్’ కట్ చేయరట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘హ్యాపీ బర్త్‌డే’ అనగానే గుర్తు వచ్చేది ‘కేక్’. చిన్నాపెద్దా అని తేడా లేకుండా పుట్టిన రోజున ‘కేక్’ కట్ చేయడం ఆంగ్లేయులు నేర్పించిన అ లవాటుగా చెప్పుకోవ చ్చు. ఈ నెల 16న కాంగ్రెస్ నేత వి. హనుమంత రావు బర్త్‌డే అ యినప్పటికీ ‘కేక్’ కట్ చేయనని ఆయన భీ ష్మించుకుని కూర్చున్నారు. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రె డ్డి (జగ్గారెడ్డి) విహెచ్‌కు ‘బొకే’ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. ‘కేక్’ కట్ చేయమని జగ్గారెడ్డి కోరగా, ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత వరకూ ‘కేక్’ కట్ చేయన’ని విహెచ్ తేల్చేశారు. అదీ విహెచ్ భీష్మ ప్రతిజ్ఞ అంటే..!
- వి. ఈశ్వర్ రెడ్డి

‘కాల్‌డేటా’తో హడల్
ఒకప్పుడు నేరాల దర్యాప్తులో కత్తులు, కటార్లు, రక్తపు మరకలు ఆధారమైతే నేడు సెల్‌ఫోన్ పెద్ద ఆధారంగా మారిపోయింది. ఏ కేసు విషయంలోనైనా లోగుట్టు తేల్చేందుకు ‘కాల్ డేటా’ సేకరిస్తూ పోలీసులు కేసులను సులువుగా ఛేదిస్తున్నారు. కొన్నిసార్లు ఇలాంటి ‘కాల్‌డేటా’ పోలీసులకు సవాలుగా మారుతోంది. నయిమ్ కేసు అయినా, యాదాద్రి జిల్లా స్వాతి కేసు అయినా, ఎల్‌బి నగర్ చైన్ స్నాచర్స్ కేసులోనూ, తాజాగా బ్యూటీషియన్ శిరీష కేసులోనైనా నిందితులను ఇట్టే గుర్తించిన పోలీసులు తర్వాత కంగుతింటున్నారు. దానికి కారణం ఈ కేసుల్లో పోలీసుల ప్రమేయం కూడా ఉండడమే. చాలా కేసుల్లో దాచిన నిజాల వైపు చూపుడు వేలు చూస్తునే ఉంది.
- బివి ప్రసాద్

సుబ్బిచావు.. ఎంకిపెళ్లి
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు’ అన్న సామెతను కాస్త తిరగేసి కూడా చెప్పుకోవచ్చని తాజాగా సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష విషాదాంతం నిరూపించింది. జాగీర్ భూముల వ్యవహారంలో తెరాస ఎంపి కేశవరావు కుటుంబంపై ఆరోపణలు, ఆ భూముల క్రయ విక్రయాలు చెల్లవని సిఎం కెసిఆర్ ప్రకటించడం, దీంతో భూమి కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు కేశవరావు ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. కేశవరావు చుట్టూ సంచలన వార్తల కోసం తిరిగిన మీడియా ప్రతినిధులు ఒక్కసారి ఆయనను పక్కన పెట్టేసి, శిరీష ఉదంతంపై దృష్టి పెట్టారు. మీడియా దృష్టి మారడంతో అధికార టిఆర్‌ఎస్‌కు, కేశవరావుకు ఊరట లభించింది. అందుకే- ‘సుబ్బిచావుఎంకి పెళ్లికి వచ్చిందన్న’ట్టు సామెత మారిపోయింది.
- వెల్జాల చంద్రశేఖర్

చర్చలేకుండానే చట్టాలు..
వందల కోట్ల రూపాయల ప్ర జాధనంతో నడుస్తున్న చట్టసభల్లో నామమాత్రపు చ ర్చ కూడా లేకుండానే ఎంతో ప్రా ముఖ్యత కల్గిన చట్టాలు రూ పొందుతున్నాయంటే ఎవరైనా సరే వి స్మయం చెందాల్సిందే. ఈ విషయాన్ని ఎవరో చె బితే మనం న మ్మలేం. కానీ, ఎన్నో కీలక తీర్పులు ఇచ్చిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ స్వయంగా ఈ విషయాన్ని ఇటీవల బెజవాడలో చెప్పడం అందరినీ ఆలోచింపజేసింది. కొన్ని చట్టాలు న్యాయవాదులు, కక్షిదారులకు కూడా కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయని ఆయన అన్నారు. ఈ న్యాయమూర్తి వ్యాఖ్యలతోనైనా ప్రజాప్రతినిధులలో కొంత మార్పు వస్తే బాగుంటుంది.
- నిమ్మరాజు చలపతిరావు

వామ్మో.. రాహుల్ ..!
తమ పార్టీ యువనేత రాహుల్ గాంధీ వద్దకు బంగారు ఆభరణాలు ధరించి వెళ్లాలంటేనే కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. ఇటీవల సంగారెడ్డి సభలో మాజీ ఎంపి విహెచ్‌ను- ‘ఈ సభ నిర్వహణకు నీ వంతు ఏం ఇచ్చావ్?’ అని రాహుల్ అడగడంతో, ‘చేతికి ఉన్న బ్రాస్‌లెట్ ఇచ్చేస్తాను’ అని ఆయన వెంటనే సమాధానం ఇచ్చారు. ‘విహెచ్‌కు ఉన్నంత త్యాగనిరతి మాలో ఉంటుందా?’ అని కొంతమంది కాంగ్రెస్ నేతలంటున్నారు. ఇకపై రాహుల్ గాంధీ వద్దకు వెళ్లేటప్పుడు ఖాళీ జేబు, చేతికి ఉంగరాలు, మెడలో గొలుసు లేకుండా పోతే మంచిదని ఒక కాంగ్రెస్ నేత సరదాగా అన్నాడు. విహెచ్ ఇచ్చిన బ్రాస్‌లెట్‌ను సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వేలం వేస్తే రూ. 20 లక్షలు వచ్చాయట! ఈ మొత్తాన్ని ఖమ్మం రైతులకు విరాళంగా ఇస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు.
- శైలేంద్ర