మిర్చిమసాలా

అర్థం కాలేదట..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కల్యాణ్ సినిమాల్లో పంచ్ డైలాగులకు కొదవుండదు. అలాగే, ఆయన రాజకీయ ఉపన్యాసంపై సామాజిక మాధ్యమాల్లో అంతకు మించిన పంచ్ డైలాగులు పేలుతున్నాయ. తమిళనాట జరిగిన జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో ఏపికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని పవన్ పిలుపు ఇచ్చారు. తీరా ఆయనే విశాఖ బీచ్‌కు వెళ్లలేదు. కానీ, తెలంగాణకు చెందిన చిన్న హీరో సంపూర్ణేష్ బాబు విశాఖ వెళ్లి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఆ రోజు వౌనంగా ఉన్న పవన్ మరుసటి రోజు విలేఖరుల సమావేశంలో 25 నిమిషాలు మాట్లాడినా- ఆయన ఏం మాట్లాడారో అర్థం కాలేదని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు చెణుకులు విసిరారు. -మురళి

‘పంచ’తాంత్రికుడు వెంకయ్య!
రాష్ట్ర విభజన తర్వాత ఏపితో కేంద్రమంత్రి వెం కయ్యనాయుడుకు ఊహించలేనంతగా బంధం ఏర్పడింది. విభజనతో తీరని అన్యాయం జరిగినందున అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి సాధ్యమైనంత మేర ఏపికి అధిక ప్రాజెక్టులను, నిధులను రాబడుతున్నానంటూ వెంకయ్య పదేపదే చెబుతుంటారు. ఆయన సడెన్‌గా తాను ఈ ఒక్క రాష్ట్రానికే కాదు, మొత్తం ఐదు రాష్ట్రాలకు అండగా ఉం టున్నాని చెప్పడం ప్రారంభించారు. ఆయన చెప్పేదేమిటంటే ఇక్కడ పుట్టినందుకు ఏపికి, రాజకీయంగా హైదరాబాద్‌లో పెరిగినందుకు తెలంగాణకు, 18 ఏళ్ల పాటు రాజ్యసభ ఎంపీగా ఉన్నందుకు కర్నాటకకు, చెన్నైలో నివసిస్తున్నందున తమిళనాడుకు, ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నందున రాజస్థాన్‌కు.. ఇలా ఈ ఐదు రాష్ట్రాలకు న్యాయం చేయాల్సి వస్తోందని వెంకయ్య వివరిస్తున్నారు.
- నిమ్మరాజు చలపతిరావు

ఎడాపెడా ట్వీట్ల దాడి
వివాదాలపై వినూత్నంగా స్పందించే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఈసారి చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడులను ఎడాపెడా తన మనసులోని మాటలన్నీ అనేశారు. బిజెపి, తెలుగుదేశం నాయకులపై పవన్ నిప్పులు చెరుగుతున్న సమయంలోనే, మరో పక్క దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ పవన్‌కల్యాణ్‌పై ట్వీట్లు చేశారు. రామ్‌గోపాల్ వర్మ పవన్‌కల్యాణ్‌ను టార్గెట్ చేస్తే, పవన్‌కల్యాణ్ చంద్రబాబును, బాబు అభిమానులు తిరిగి పవన్‌కల్యాణ్‌ను లక్ష్యంగా పెట్టుకుని ట్వీట్లు చేయడంతో ఇది అభిమానమా? హద్దుమీరిన రాజకీయమా? అంటూ నివ్వెరపోవడం సామాన్యుల వంతైంది. - బివి ప్రసాద్

‘రావు’ల కాలం..!
రాహుకాలం ఉంటుంది కానీ, ‘రావు’ల కాలం ఏమిటా? అని ఆశ్చర్యపోతున్నారా. దీన్ని- పేరు చివర ఉండే ‘రావు’ అనుకోవాలా? లేక నిత్య జీవితంలో ఏదో సందర్భంగా ‘అవి రావు, ఇవి రావు’ అని వాడుతుంటాం కాబట్టి వాటిని అనుకోవాలా? అనే సందిగ్ధంలో పడ్డారు కదూ!. నిజమే.. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనఆవేదన సభలో ఎఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ- కె. చంద్రశేఖర్ రావు, కె. తారక రామారావు, టి. హరీశ్ రావు, కవితా రావుల కాలంలో ప్రజలకు ఏమీ ‘రావు’ అని, అభివృద్ధి పడకేసిందని విమర్శించారు. రాహుకాలం రెండు గంటలు ఉంటుంది. కానీ- ఐదేళ్ళు ఉండే ఈ ‘రావుల’ కాలంలో అప్పుడే రెండున్నర ఏళ్ళు గడిచిపోయందని యాష్కీ అనగానే సభికులు పెద్దగా నవ్వారు.
-వి. ఈశ్వర్ రెడ్డి

సెంటిమెంట్ సరిపోదు!
తమిళనాట జల్లికట్టు ఆందోళనకారులకు మెరీనా బీచ్ కలిసి రావడంతో, ప్రత్యేక హోదా సాధన కోసం ఏపిలో యువకులు సెంటిమెంట్‌గా విశాఖ బీచ్‌ను ఎంచుకున్నారు. జల్లికట్టు పోరుకు తమిళనాడు ప్రభుత్వం మద్దతు ఉండటంతో అక్కడ విజయం సాధించారు. ఏపిలో హోదా పోరుకు టిడిపి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. విశాఖ బీచ్‌లో ఎలాంటి ఆందోళనలు జరుగకుండా పోలీసులు అరెస్టులు చేయడంతో ఉద్యమకారుల ఆశలు ఫలించలేదు. బీచ్ సెంటిమెంట్ ప్రత్యేక హోదాకు కలిసి రాలేదు. సెంటిమెంట్ ఉన్నంత మాత్రాన సరిపోదు, ప్రభుత్వ మద్దతు కూడా అవసరమని ఆందోళనకారులు గ్రహించారు. రాష్ట్ర విభజనకు కేంద్రంలో, రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాల మద్దతు ఉండటం వల్లనే తమకు సెంటిమెంట్ కలిసి వచ్చిందని తెలంగాణ వాసులు గుర్తు చేస్తున్నారు.
-వెల్జాల చంద్రశేఖర్