మిర్చిమసాలా

రెయిన్ గన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కొక్క నాయకుడు రాజ్యాధికారంలో ఉన్నప్పుడు ఒక్కో పదం ప్రాచుర్యంలోకి వస్తుంటుంది. తాజాగా ఆంధ్రాలో రెయిన్ గన్స్ అనే పదం విపరీతంగా ప్రాచుర్యం పొందింది. విపక్షనేత జగన్ చెప్పినట్లు రెయిన్ గన్స్ వాడకం పదేళ్ల నుంచి ఉంది. నీటి వినిమయం పొదుపుగా ఉండేందుకు, పంటలు కాపాడేందుకు రెయిన్ గన్స్‌ను వినియోగిస్తారు. ఈ పదం అంతగా వాడుకలో లేదు. చంద్రబాబునాయుడు ఈ మధ్య ఆగస్టు నెలలో వర్షాలు రాక రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని తెలిసిన వెంటనే రెయిన్ గన్స్‌తో పంటలను రక్షిద్దాం, కరవును తరిమిగొడదాం అని విశేషంగా మాట్లాడారు. దీంతోరెయిన్ గన్స్ గురించి అందరికీ తెలిసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు మేఘమథనం పాపులరైంది. మేఘమథనానికి హెలికాప్టర్లను వినియోగించారు. అప్పట్లో మేఘ మథనం పదం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హిట్టయింది.
- శైలేంద్ర

తుమ్మలకు తెలియదా?
ధర్నాలు, నిరాహారదీక్షలు, రాస్తారోకోలు, రోడ్లపై భోజనాలు, ధూం ధాంల ప్రభావం వల్లే తెలంగాణ వచ్చిందని రాష్ట్ర మంత్రి తుమ్మలకు తెలియదా? ఈమధ్య మీడియాతో మాట్లాడుతూ, దీక్షలు, ధర్నాలతో కొత్త జిల్లాలు ఏర్పాటు కావంటూ సెలవిచ్చారు. మరి తెలంగాణ కోసం కెసిఆర్ చేసిన ధర్నాలు, నిరాహార దీక్షలకు కేంద్రం దిగిరాలేదా? కెసిఆర్ దీక్ష తర్వాతే కదా..తెలంగాణ ఏర్పాటు చేస్తామంటూ ఆనాటి కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు. ఇప్పుడు గద్వాల, జనగాం జిల్లాల కోసం కాంగ్రెస్ నేతలు డికె అరుణ, పొన్నాల లక్ష్మయ్య తదితరులు ధర్నా చేస్తుంటే.. తుమ్మలతో పాటు మరికొంత మంది మంత్రులు మాత్రం ధర్నాలకు కొత్త జిల్లాలు ఏర్పాటు కావంటున్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదా అన్న ప్రశ్న ఉదయస్తోంది.
- పి.వి. రమణారావు

దటీజ్ నండూరి!
ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జ్ డిజిపి నండూరి సాంబశివరావు ఇప్పటివరకు ఏ శాఖలో, ఏ హోదాలో ఉన్నప్పటికీ తనదైన పనితీరుతో ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. గతంలో అగ్నిమాపక శాఖ అధిపతిగా వున్నా, ప్రస్తుతం ఎపిఎస్ ఆర్టీసీ ఎండీ, ఇటు డిజిపి హోదా రెండింటిలోనూ ద్విపాత్రాభినయం చేస్తూ కృష్ణా పుష్కరాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, ఉచిత బస్సు సర్వీసులతో ఏ రోడ్డుపైనా, ఎక్కడా, ఏ ఒక్క బస్సు కూడా ట్రాఫిక్‌లో చిక్కకుండా అందునా పుష్కర స్నానఘట్టాల వద్దకు బస్సులో లక్షలాది మంది యాత్రికులను తరలించి శభాష్! అనిపించుకున్నారు. ఇక తాజాగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కబోవని ప్రతిఒక్కరూ భావించారు. తీరా అందుకు విరుద్ధంగా జరిగింది. ఎలాంటి బెదిరింపులు, హెచ్చరికలు లేకుండానే అధికారపక్ష ఎన్‌ఎంయుతో పాటు వామపక్ష వైఎస్సార్ అనుబంధ కార్మిక సంఘాల కార్మికులు సైతం విధులకు హాజరుకావటంతో ముఖ్యమంత్రి చంద్రబాబే కాదు, విపక్షాల నేతలు సైతం ఆశ్చర్యపోయారు. రాష్ట్రంలో 10,742 బస్సులు ఉంటే 9,544 బస్సులు రోడ్డెక్కాయి. అంటే 1198 బస్సులకు సంబంధించి కండక్టర్లు, డ్రైవర్లు కేవలం 2400 మంది కార్మికులు మాత్రమే విధులకు గైర్హాజరయ్యారు. ఇక రాజధాని ప్రాంత కృష్ణా జిల్లాలో 97శాతం బస్సు సర్వీసులు నడిచాయి. ఇలాంటి ఉద్యమాల్లో ఆర్టీసీ విజయవంతం కావటం ఇదే ప్రథమం. దీనిపై కూడా ‘దటీజ్.. నండూరి’.. అంటూ ఆయన అందరి ప్రశంసలూ అందుకుంటున్నారు.
- నిమ్మరాజు చలపతిరావు

ప్రకటనల ప్యాకేజీ
ఆంధ్ర రాష్ట్రానికి పైసా సాయం అందించినా, దాని వల్ల మైలేజీ ఎవరికి వస్తోందో అని కేంద్రం ఆలోచిస్తుంటే, ఆ క్రెడిట్ ఎలా కొట్టేయాలో రాష్ట్రప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ గత కొద్ది కాలంగా జరుగుతున్న ఉద్యమాలను కేంద్రం తనకు అనుకూలంగా మలుచుకుని ప్రత్యేక ప్యాకేజీగా మార్చడమేగాక, హోదాకు ఎంత లాభం చేకూరుతుందో అంత మేరకు ప్యాకేజీగా ఇస్తామని చెప్పడమేగాక, ఇదే అంశంపై క్షణానికో ప్రకటన ఇస్తూ ఉత్కంఠ రేపింది. దాంతో టిడిపి నేతలు అసలు ప్యాకేజీ వదిలేసి ఈ ప్రకటనల ప్యాకేజీ ఏమిటంటూ విస్తుపోయారు!
- బి వి ప్రసాద్

బొమ్మాళి
సినిమాల్లోని పాత్రలు రాజకీయ నాయకులపై కూడా తీవ్రంగానే ప్రభావం చూపిస్తున్నాయి. గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ కుటుంబం గద్వాల భవనం చాలా ఫేమస్. ఈ అంశాన్ని టిఆర్‌ఎస్ ఎంపి కవిత పరోక్షంగా ప్రస్తావిస్తూ బొమ్మాళి అని వ్యంగ్యంగా విమర్శించారు. ముఖ్యమంత్రి మీద నోరు పారేసుకోకుండా గద్వాల కోటలో విశ్రాంతి తీసుకోవాలని అన్నా రు. దీనిపై డికె అరుణ అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. నేను బొమ్మాళి అయితే మీ నాన్న పశుపతినా అని అరుణ ప్రశ్నించారు. బొమ్మాళి హీరోయిన్ అయితే పశుపతి సినిమాలో విలన్, మీ నాన్న విలనా? అని ప్రశ్నించారు. జిల్లాల ఏర్పాటు రాజకీయం పోయి సినిమాల్లోని డైలాగులు ముం దుకు వచ్చాయి.
- మురళి