AADIVAVRAM - Others

బుల్లెట్‌లా దూసుకెళ్లే గనె్నట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర అట్లాంటిక్, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కన్పించే సీబర్డ్...గనె్నట్. సముద్ర తీర ప్రాంతాల్లో జీవించే ఈ పక్షి మిగతా సముద్ర పక్షులకన్నా భిన్నమైన లక్షణాలతో ఉంటుంది. వీటి కళ్లు బైనాక్యులర్ విజన్‌కు వీలుగా ముఖంపై చాలా దిగువకు ఉంటాయి. వీటి నాసికారంధ్రాలు ముఖం లోపలిభాగంలో ఉంటాయి. ముఖం, ఛాతీలో చర్మం వెనుక గాలిసంచులుంటాయి. ఆకాశంలో దాదాపు వంద అడుగుల ఎత్తునుంచి, గంటకు వంద కిలోమీటర్ల వేగంతో నీటిలోకి దూసుకువెళ్లి చేపలను పట్టుకోవడం వీటి ప్రత్యేకత. సముద్ర జలాల్లో 60 అడుగుల లోతులోకూడా ఇవి చేపలను వేటాడి పైకి ఎగరగలవు. నీటిఒత్తిడిని తట్టుకునేందుకు వీలుగా గాలిసంచులు పనిచేస్తాయి. ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో ఉంటే ఈ పక్షులు, రెక్కలు విప్పితే రెండు అడుగుల వెడల్పుతో ఉంటాయి. సముద్ర పక్షుల్లో ఇవే అతి పెద్దవి. పరిమితి లేకుండా ఆహారాన్ని తినేయడం వీటి లక్షణం. అతి ఆహారం వల్ల మరణించడం వీటికి ఎదురయ్యే ముప్పు. ఇప్పటివరకు ఈ పక్షులన్నీ నిర్దేశించిన కొన్ని ‘కాలనీ’ల్లో (పక్షుల సమూహాలు) మాత్రమే గుడ్లు సంతానోత్పత్తికి ఉపక్రమించడం వీటి ప్రత్యేకత.

ఎస్.కె.కె.రవళి