మీ వ్యూస్

పిల్లలకు విందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈవారం వచ్చిన ‘ది జంగిల్ బుక్’ సినిమా పిల్లలకు షడ్రసోపేతమైన విందులాంటి చిత్రం. మొదటినుండీ సినిమా అయిపోయేంతవరకూ అద్భుతమైన గ్రాఫిక్స్‌తో అలరించిన ఈ సినిమాను ప్రతివారూ తప్పక చూడదగిందే. ప్రస్తుతం సాంకేతికంగా సినిమా ఎంత అభివృద్ధి చెందిందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా జంతువుల ముఖాలలో నటన చూస్తే ముచ్చటేసింది. మన తెలుగులో వస్తున్న హీరోలు, హీరోయిన్లు ఈ సినిమా చూస్తే ఎలా యాక్షన్ చేయవచ్చో తెలుస్తుంది. అంత అద్భుతంగా వాల్ట్ డిస్నీ ఈ చిత్రాన్ని రూపొందించి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడం గొప్ప విషయం. ముఖ్యంగా టాలీవుడ్‌లో వున్న దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా చూసి సినిమా ఎలా తీయాలో అర్థం చేసుకోవచ్చు.
-తిరుమలశెట్టి రఘురాం
నరసరావుపేట

గోల్డెన్ కేలా
హాలీవుడ్‌లో ఉత్తన చిత్రాలకు, వాటిలో పనిచేసే వ్యక్తులకు ఆస్కార్ అవార్డులు ఇస్తారు. వీటికి పేరడీగా ఉత్తమ చెత్త చిత్రాలకు అవార్డులు ఇచ్చే సంస్థ కూడా వుంది. బాలీవుడ్‌లో ఉత్తమ చెత్త చిత్రాలకు గోల్డెన్ కేలా (పచ్చని అరటిపండు) అవార్డు ఇచ్చే సంస్థ వుంది. ఈ సంవత్సరం ఉత్తమ చెత్త చిత్రంగా ‘దిల్‌వాలే’ ఎంపికైంది. ఈ చిత్రానికి డబ్బులొచ్చినా ప్రేక్షకుల దృష్టిలో చెత్త చిత్రంగా నిలిచింది. ఉత్తమ చెత్త నటుడు ఆదిత్య పంచోలి, చెత్త నటిగా సోనమ్, చెత్త పాటగా ‘ప్రేమ్ రతన్ ధన్‌పాయో’ ఎంపికయ్యాయి. తెలుగులోనూ చెత్త అవార్డులు ఇస్తే బాగుండును. కానీ అభిమానులు తంతారని భయంతో ఆయా సంస్థలు చెత్త అవార్డులు ప్రకటించడంలేదు.
-సదా ప్రసాద్
గొడారిగుంట

టార్గెట్ టెన్షన్
ఒకప్పటి యువ హీరోలు ఇప్పుడు సీనియర్‌లు అయ్యారు. 100, 150 చిత్రాల గీత దాటే సంక్లిష్ట దశలో వున్నారు. చిరంజీవి 150వ చిత్రం వ్యవహారం ఖాయమైనా, ఇంకా మిస్టరీయే. బాలకృష్ణ వందో చిత్రం కోసం ముగ్గు రు దర్శకులు లైన్లో వున్నారని వినికిడి. టైటిల్స్ పరంగా విభిన్నంగా వుండి ఏది చేసినా వెరైటీ అవుతుంది. ముగ్గురికీ అవకాశం ఇంకా బాగుంటుంది. నాగార్జున కూడా ఈ వయసులో హీరోగా, నిర్మాతగా వెంట వెంట నిర్ణయాలతో విభిన్నమైన కథలతో దూసుకువెళుతున్నాడు. వెంకటేష్ తన వయసు, కాల పరిస్థితి గమనిస్తూ మడికట్టుకుని హీరో పాత్రలనే కాక మల్టీస్టారర్ చిత్రాలు, నడివయసు పాత్ర లు చేయడం బాగుంది. మహేష్‌కు ఇంకా టైముంది. రవితేజ పవర్ తగ్గినా నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్టీఆర్‌కు ఎగుడు దిగుడు తప్పడంలేదు. ఆ రోజుల్లో ఏఎన్నార్, ఎన్టీఆర్ వీటి గురించి ఇంతగా ఆలోచించలేదు.
-పి.వి.ఎస్.ప్రసాద్‌రావు
అద్దంకి

బహిరంగ ప్రదర్శన
తారలపై ప్రేక్షకులకు గౌరవం తగ్గిపోతుందని సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన ఫొటోలతో నానా ఇబ్బందులు పెడుతున్నారని కరీనా ఆమధ్య బాధపడింది. భర్తకు విడాకులిచ్చి అర్జున్‌కపూర్‌ను పెళ్లిచేసుకుంటానని, ఒక చిత్రంలో అర్జున్ తన భర్తకంటే బాగా ముద్దుపెట్టాడని చెప్పింది. మరో తార భారత క్రికెట్‌టీమ్ గెలిస్తే తాను నగ్నంగా పరిగెడతానని ప్రకటించింది. ఛాతిమీద, నడుంచుట్టూ చిన్న గుడ్డ ముక్కలు కట్టుకుని శరీరమంతా బహిరంగ ప్రదర్శన చేస్తూ ఐటెం పాటలు చేస్తున్నారు హీరోయిన్లు. ఇలాంటి పనులు చేస్తూ బరితెగించి ప్రకటనలు, డాన్సులు చేస్తూ మమ్మల్ని గౌరవించడంలేదని నంగనాచి కబుర్లు ఎందుకు? అంతా స్వయంకృతం కాదా??
-కె.గునే్నష్
కొవ్వాడ

అభినందనీయం
తెలుగు సినిమాకు కొత్త ఊపిరి ఊదిన చిత్రం చూసి ఆనందించాం. ప్రేక్షకులకు భావోద్వేగాలను అద్భుతంగా చిత్రం ద్వారా అందించారు. పాత్రలతో మమేకమై పోయారు ప్రేక్షకులు. వయసు ముదిరిపోయినా హీరోయిన్‌తో గంతులు, స్టెప్పులు, ఫైట్లు వేసే హీరోలకు కనువిప్పు ఈ చిత్రం. మిగిలిన పాత్రలు పోషించినవారందరూ జీవించారు. చెంప దెబ్బల హాస్యానికి తెర దించడం అభినందనీయం. ఇలాంటి చిత్రాలను నిర్మాతలు ధైర్యంగా రూపొందించినప్పుడే తెలుగు సినిమా తలెత్తుకోగలదు. అయితే ఈ చిత్రంలో టైటిల్స్ ఆంగ్ల భాషలో చూపించడం విచారకరం.
- ఎస్.ఎస్.శాస్ర్తీ, విశాఖపట్నం

పరమానందం
శ్రీదేవి ప్రొడక్షన్స్ పతాకంపై పుల్లయ్య దర్శకత్వంలో విడుదలైన చిత్ర రాజం పరమానందయ్య శిష్యుల కథ ఆద్యంతం చదివించేలా చేసింది. మళ్లీ మాతరం అభిమానులకు ఆనందాన్నిచ్చింది. నట దిగ్గజం ఎన్టీఆర్, శోభన్‌బాబు, నాగయ్య, ఎల్.విజయలక్ష్మి, కె.ఆర్.విజయ, ముక్కామల వంటి నటుల అద్భుత అభినయానికి దర్పణం ఈ చిత్రం. ఫ్లాష్‌బ్యాక్ శీర్షికలో ఇలాంటి చిత్రాల గురించి తెలియజేయడం పరమానందంగా వుంది.
- ఎం ఆనందరావు,
వేగివారిపాలెం

ఏదీ జవాబు?
‘బాహుబలి’కి స్వర్ణకమలం రావడం ఆశ్చర్యాన్ని, ఆవేదననూ కూడా కల్గించింది. ఒక రాజు, ఆయన తమ్ముడు తనకు, తన కుమారునితో సింహాసనం దక్కించుకోవడంకోసం అన్నను చంపి, ఆయన కుమారుని చంపే ప్రయత్నం చెయ్యడం, పిదప అది విఫలం కావడం, చివరకు దుర్మార్గులు చనిపోవడం, ఇలాంటి సినిమాలు గతంలో అనేకం వచ్చా యి. బాహుబలి కథా అల్లాంటిదే. కాకపోతే గ్రాఫిక్సు కాలం కనుక పెద్దపెద్ద తెరలపై గొప్ప గా కన్పించింది. అంతమాత్రానికే పురస్కారం? ఆహ్లాదకరమైన సంగీతం వుందా? గొప్పగా హావభావాలు చూపించగలిగారా? సందేశాలు ఏమైనా వున్నాయా? ఈ ప్రశ్నలకు జవాబులు వున్నాయా?

సగం అవార్డు ఇవ్వాల్సింది
‘బాహుబలి’ సగం సినిమా మాత్రమే. బిగినింగ్ అని వేసుకున్నారు కనుకనూ, రెండవ భాగం వస్తున్నది కనుకనూ మరి సగం సినిమాకు పూర్తి ‘స్వర్ణకమలం’ యివ్వడం ఏమిటి? సగం యివ్వవలసింది.
- యుగంధర్, వక్కలంక
- యు సత్తెయ్యమూర్తి, వక్కలంక తోట