మీ వ్యూస్

అనుకున్నంత కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుకున్నంత కాదు..
మోహన్‌బాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ నిజానికి పోటుగాడే. కెరీర్‌పరంగా పెద్దగా ప్లస్‌లు లేకున్నా, తన వరకు మంచి నటన కనబర్చగలడన్న ప్లస్‌లు ఉన్నాయ. హిట్ కోసం ఇప్పటికీ గట్టిగానే ప్రయత్నిస్తున్న లక్కే కలిసి రావడం లేదు. మొన్నటి వరకూ చేసిన యాక్షన్ సినిమాలు వదిలేసి తనదైన ప్రతిభ చూపించేందుకు సాఫ్ట్‌గా స్క్రీన్‌మీదకు వచ్చిన మనోజ్‌కు ఈసారీ కెరీర్‌లో రెండడుగులు ముందుకు పడలేదు. దశరథ్ దర్శకత్వంలో మొన్నొచ్చిన -‘శౌర్య’ మనోజ్ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తుందన్న ఏమాత్రం చెప్పలేని పరిస్థితి. అతని ఈడు కుర్రాళ్లంతా కొత్తకొత్త కథలతో తారాపథంలో దూసుకుపోతుంటే, పోటుగాడు అనిపించుకున్న మనోజ్ మాత్రం ఎక్కడ బయలుదేరాడో అక్కడే ఉన్నట్టున్నాడు. ఆకృతిలో అతన్ని తీసిపోనివాళ్లు సైతం ఆహార్యానికి తగిన కథలు ఎంచుకుని మార్కులు వేయంచు కుంటుంటే, మనోజ్ మాత్రం ఎక్స్‌ట్రా సంపాదించుకున్న మార్కులేం కనిపించటం లేదు. వచ్చే ప్రాజెక్టులతోనైనా మనోజ్ మెరిపిస్తాడో లేదో చూడాలి.
పల్నాటి రవికుమార్, తుని

అజరామరం
భూకైలాస్ సినిమాకు ఆ పేరు పెట్టడమే విచిత్రం. భూకైలాసం అని పేరుపెడితే తెలుగుదనం ఉట్టిపడేదేమో! తెరముందు, తెరవెనుక పాత్రధారులంతా నూటికి నూరుపాళ్లు సినిమా కోసం కష్టపడి న్యాయం చేశారు. ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్, జమున వారివారి పాత్రలకు మరింత తళుకులద్దారు. నిజమైన భక్తి ఉన్నతమో ‘సుందరాంగ అందుకోరా’ అన్న నృత్య గీతంలో ప్రతి ప్రేక్షకుడికి అర్థమవుతుంది. అప్పటి పాటలు అలా వుండేవి.
-ఎన్ రామలక్ష్మి, సికిందరాబాద్

అప్పుడే రెండు నెలలు
ఈ సంవత్సరం ప్రారంభమై అప్పుడే రెండు నెలలు దాటిపోయాయి. ఇప్పటివరకు సోగ్గాడే చిన్నినాయనా అన్న సినిమా ఒక్కటే ప్రేక్షకుల్ని రంజింపజేసింది. హీరోయిన్లు ప్రధాన పాత్ర ధరిస్తే సినిమా విజయవంతం అవుతుందని తీసినా, స్ర్తిత్వానికి విలువ ఇవ్వకపోవడంతో ఆ సినిమాలు ఆడటం లేదు. ఏ సినిమా అయినా వెదుక్కొని వెళ్లేసరికి థియేటర్లో ఉండకపోవడం ఈ ఏడాదిలో మరో వింత. శ్రీరామరాజ్యం, దూకుడు చిత్రాల తర్వాత ప్రేమకథా చిత్రాలకు మాత్రమే మంచి పేరు వచ్చింది. తర్వాత బాహుబలి, శ్రీమంతుడు, బిజినెస్‌మేన్, గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది.. లాంటి చిత్రాలు వచ్చినా ఆ తర్వాత ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలు రాకపోవడం దారుణం. సరైన చిత్రం తీద్దామని ప్రయత్నం చేయడం లేదు.
-పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం

షకీలా మాయ
షకీలా మలయాళంలోనే కాక టాలీవుడ్‌లోనూ శృంగార తారగా పేరు తెచ్చుకుంది. షకీలా సినిమా విడుదలౌతుందంటే మలయాళ హీరోలు తమ సినిమాల గురించి ఆలోచించేవారని ఆమె ఆత్మకథ రాసిందంటే, మలయాళ హీరోలు తమ గురించి ఏంచెబుతుందో అని భయపడేవారంటూ అప్పట్లో సంచలన వార్తలు వచ్చాయి. ఆమె సినిమాలు విడుదల కాకుండా అగ్రహీరోలు అడ్డుకునేవారని మరో సెనే్సషనల్ న్యూస్‌కూడా వచ్చింది. షకీలా ఇప్పుడు నోరు విప్పింది. అగ్ర హీరోల్ని గడగడాలాడించేంత సీన్ తనకులేదని, సెన్సారువారివల్లే తన 23 చిత్రాలు ఆగిపోయాయని, తనవల్ల నిర్మాతలు నష్టపోకూడదనే శృంగార చిత్రాల్లో నటించడం మానేశానని చెప్పింది. ఆమె చెప్పేది నిజమే కావచ్చు!
-ఎస్ కృష్ణ, కొండయ్యపాలెం

గురువులెందుకు?
తన సినిమాలకు కాలం చెల్లిందని గ్రహించిన శ్రీదేవి తన కూతురు జాహ్నవిని రంగంలోకి దింపుతోందట. అందుకోసం హాలీవుడ్‌లో శిక్షణకోసం పంపిందని సమాచారం. ఇక్కడ శిక్షణ కేంద్రాలు లేనట్టుగా అక్కడికెందుకో? హాలీవుడ్ నటులవి మాటలు, హావభావాలు తక్కువ. శరీర భాషతో పాత్రలకు ప్రాణం పోసే అండర్‌ప్లే ఉంటుంది. మనది ఓవర్ యాక్టింగ్. గర్జనలు, సవాళ్లు, తొడగొట్టటాలు, గుడ్లురిమి వికృతంగా ముఖంపెట్టి డైలాగులు దంచడంలాంటివి చేయాలి. హిందీ వారిని మధ్యస్థ నటన. హాలీవుడ్, బాలీవుడ్ నటన టాలీవుడ్‌లో నచ్చదు. ఇక్కడి నటన చూసి బాలీవుడ్ నవ్వుకుంటుంది. మరి జాహ్నవి ఏ నటన చేస్తుందీ? హాలీవుడ్‌లో నేర్చుకొచ్చింది ఇక్కడ చేస్తే ఎవరూ మెచ్చరు. ఏ శిక్షణ లేకుండానే దేశాన్ని ఊపేసిన శ్రీదేవి, తానే గురువై మెలకువలు నేర్పితే కాదా?!
-డి అభిలాష, సాంబమూర్తినగర్

ఆనాటి మిస్సమ్మ!
మిస్ అయిన మిస్సమ్మ అంటూ వచ్చిన వ్యాసం అలరించింది, చదివించింది. భానుమతి స్థానంలో నటీమణి సావిత్రి అద్భుతంగా రాణించారు. ఆనాటి చిత్రరాజం మిస్సమ్మకి ఎనలేని కీర్తిని, గుర్తింపును ఇచ్చారు ప్రేక్షకులు. నేటికీ చూడాలనిపిస్తుంది. ఈ చిత్రంలో డిటెక్టివ్ అక్కినేని హాస్య పాత్రలో కొత్తదనం చూపారు. మొత్తంమీద అందరూ అగ్రనటులే నటించిన ఈ చిత్రం చిరస్మరణీయమైనది.
-మంగం ఆనందరావు, వేగివారిపాలెం

పడి లేచిన నటుడు
అనేక చిత్రాల్లో ఉత్తమ నటనను ప్రదర్శించిన రమణమూర్తి కెరీర్ అంతా పడి లేచిన కెరటమే. ఆయన గురించి శరత్‌కాలంలో చదివి బాధపడ్డాం. బిఎన్ రెడ్డి లాంటి ప్రతిభావంతుడు చేయాల్సిన పని కాదని అనిపించింది. అయితే కీర్తిప్రతిష్టలు రాగానే ఇగో ప్రారంభవౌతుంది. మాట వినని వాడిని అణగదొక్కాలని అనిపిస్తుంది. రమణమూర్తి అదృష్టవంతుడు కనక పడి లేచాడు. కానీ అందరూ అదృష్టవంతులు కాలేరు. ఒక నటుని ఆగ్రహానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఉదయ్‌కిరణ్ ఉదంతం దీనికి ఉదాహరణ. కొందరు ఎదుగుతున్నకొద్దీ వారి మనసులు చిన్నవైపోతుంటాయి. లోక రీతి అంతే.
-పి చంద్ర, కాకినాడ