మీ వ్యూస్

నిజమే ఘాజీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘాజీ చిత్రం గురించి వెనె్నల్లో రాశాక సినిమా చూశాను. నిజంగా ఈ సినిమా చాలా గొప్పది. ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న పడికట్టు సూత్రాలను పడగొట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు అనిపించింది. చూపించడానికి ఏమీ లేకపోయినా ప్రేక్షకుణ్ణి రెండున్నర గంటలపాటు కుర్చీలో అలా కూర్చోబెట్టాడు అంటే దర్శకుణ్ణి ఆడుమగాడురా బుజ్జి అనొచ్చు. ఇప్పటివరకు పిచ్చి పిచ్చి సినిమాలు తీసిన దర్శకులకు చెంపపెట్టు ఈ చిత్రం. ఇలాంటి చిత్రాలు తీస్తే ఆదరించరు అని దర్శక నిర్మాతలే గొంతెత్తి అరుస్తారు. మరి ఈ సినిమా మామూలు సినీ ప్రేక్షకుడికి ఎలా అర్థమైంది? ఎలా విజయవంతమైంది? అని ఆలోచిస్తే వాళ్ల తెలివితక్కువతనం అర్థమైపోతుంది. ఇప్పటికన్నా మంచి సినిమాలను రూపొందించే ప్రయత్నం చేయండి.
-టి.రఘురామ్, నరసరావుపేట

ఆటకాయి
ఆకతాయి సినిమా పిల్లలు ఆడుకునే ఆటకాయి కథలా ఉంది. ఇప్పటికే ఇలాంటి కథనాలతో బోల్డు సినిమాలు వచ్చాయి. వచ్చిన సినిమాలనే మళ్లీ మళ్లీ కొత్త సీసాల్లో పోసి, రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కొత్తదనం అనేది కనిపించడం లేదు. హీరో విలన్‌కన్నా గొప్ప బలవంతుడా, తెలివిగలవాడా? అంటే అదృష్టం ఉన్నవాడు అని దర్శకుడు చెప్పినట్లుగా ఉంది. అయితే సినిమాకి విజయవంతమయ్యే అదృష్టం ఉందో లేదో ఓ వారం ఆగితే తెలుస్తుంది.
-ఎం ప్రసన్నరాణి, ఆదిలాబాద్

అందని ద్రాక్ష
ఈసారి ఆస్కార్ అవార్డుల్లో మన చిత్రాలకు అవార్డు అందని ద్రాక్ష అయింది. ఎందరో గొప్పవాళ్లు అద్భుతమైన సినిమాలు రూపొందించిన మన తెలుగులో ఆస్కార్ అర్హత పొందలేని చిత్రాలు రావడం అశనిపాతమే. రాబోయే రోజుల్లోనైనా మంచి వార్తలు వినాలని కోరుకుంటున్నాం.
- మంగం ఆనందరావు, వేగివారిపాలెం

ఏ తరహా విమర్శ
నేను రాసిన లేఖకు ప్రతిస్పందనగా వచ్చిన ‘ఏ తరహా విమర్శ’ అన్న శీర్షికతో వచ్చిన ఉత్తరాన్ని చూశాను. సినీ రంగంలో లేని నాకు విజయేంద్రప్రసాద్ అంటే అసూయ ఎందుకు? సూపర్‌హిట్ బాహుబలిలో ఉన్నది చందమామ కథే. అలాగే లేఖకుడు పేర్కొన్న సినిమాల్లో పగ, ప్రతీకారాలు తప్ప గొప్ప కథలు లేవు. ఇప్పుడు దర్శకుడు, కథకుడు, సంగీతకారుడు స్టయిలిష్ ఇలాగ అందరూ ఒక ప్యాకేజీగా వస్తున్నారు. ఆ ప్యాకేజీ మహిమవల్లే విజయేంద్రప్రసాద్ పేరు మనకు తెలిసింది. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ ప్లాపే. భజరంగీ భాయిజాన్ చిత్రానికి ప్రేరణ పసివాడి ప్రాణం సినిమా అని ఆయనే చెప్పారు. ఆఖ్రీఖత్ కానీ పసివాడి ప్రాణం కానీ, భజరంగీ భాయిజాన్ కాపీ కథే. దానికి ఉత్తమ కథకుడుగా ఆయన అవార్డు అందుకోవడాన్ని ఏమనాలి?
-కెఎల్ ప్రసన్న, పేర్రాజుపేట

సినిమాలు కారణమే
కారులో నటిపై జరిగిన దౌర్జన్యం సందర్భంగా అలాంటి వారిని షూట్ చేసేయాలని విశాల్, నేనైతే వాళ్లని చంపేసేదాన్నని రకుల్‌ప్రీత్‌సింగ్ స్పందించారు. సినిమా వాళ్ల దృష్టిలో చంపడం, నరకడమే పరిష్కారం! యువతలో తాగుడు, నేరప్రవృత్తి పెరగడానికి సినిమాలు కూడా ముఖ్య కారణమే. సినిమాల్లో తాగుడు, హీరోయిన్‌ని ర్యాగింగ్ చేయడం లాంటి సన్నివేశాలతో హీరో గొప్పవాడని చూపిస్తున్నారు. ఐటమ్‌గర్ల్స్, హీరోయిన్లు అతి తక్కువ దుస్తులతో రెచ్చిపోయి చేస్తున్న డాన్సులు మహిళల పట్ల గౌరవం పెంచవు. వికృత మనస్కులకు ఆ భంగిమలు, ఆయా శరీర భాగాలే ఎల్లప్పుడూ కనిపిస్తూ నటి ఒంటరిగా కనిపించగానే రెచ్చిపోతున్నారు. ఇలాంటి నేరాల్లో నటీమణులు, దర్శక నిర్మాతలు బాధ్యత వహించక తప్పదు.
-కె ప్రవీణ్, కాకినాడ

రివ్యూలు అదుర్స్
వెనె్నల కాలం పేజీలో సినిమా రివ్యూస్ నిష్పక్షపాతంగా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. శరత్‌కాలం శీర్షికలో దేవదాసు కనకాల -ఎన్టీఆర్ ‘తీర్పు’ చిత్రం అప్పట్లో వినోదపు పన్ను రద్దు కాబడినదిగా పేర్కొన్నారు. సామాన్య సినీ ప్రేక్షకులు కేవలం ఒక రూపాయి ప్రవేశ రుసుంతో అప్పర్ క్లాస్‌లో కుటుంబ సభ్యులతో చిత్రాన్ని తిలకించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని, ప్రబోధాత్మక చిత్రాన్ని ప్రేక్షక జనావళి వీక్షించేలా చేశారని చెప్పడం బావుంది. మరి నేడు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం కూడా ప్రభుత్వంచే వినోదపు పన్ను రద్దుకాబడిన చిత్రం అని ప్రచారం చేశారు. కానీ ఎక్కడా ఆ చిత్రాన్ని తక్కువ టిక్కెట్ రుసుంతో చూపించిన దాఖలాలు లేవు. నాకు నచ్చిన పాట, నాకు నచ్చిన చిత్రం దానవీరశూరకర్ణ, మిస్సమ్మ, ఈ వారం సమీక్షలు ఎంతో వివరణలతో ప్రశంసనీయంగా ఉన్నాయి. ఫిలింక్విజ్ ఎప్పటిలానే మెదడుకు పదునుపెడుతుంది. ఈవారం అగ్గిరాముడు చిత్ర విశేషాలు అలరించాయి. ఐదు భాషల్లోనూ విజయం సాధించడం గ్రేట్.
-ఎంవి భాస్కర్‌రెడ్డి, కుతుకులూరు