మీ వ్యూస్

శతమానంభవతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేక్షకులకు ఓ మంచి కథాచిత్రంగా శతమానంభవతి వచ్చింది. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడానికి తమ పిల్లలే కారణమని సినిమాలో దర్శకుడు చూపడం బాగుంది. డైలాగులు కన్నీళ్లు పెట్టించాయి. ప్రేమించినవారితో పెళ్లికాకుంటే ఎందుకు బాధపడాలి. మన ప్రేమ మనతోనే నిండిపోయింది కదా అని, ఆ ప్రేమ మనదే అని పలకడం బావుంది. కోర్టులిచ్చే విడాకులకన్నా కుటుంబం ఇచ్చే విడాకులు బాధాకరమన్న ఆలోచనను రచయత గొప్పగా అభివ్యక్తీకరించారు. భార్యాభర్తలు ఇగోలకు పోయ విడిపోవడం కంటే, ఎక్కడో ఒక్కచోట రాజీపడి కలిసి జీవించాలని, విడాకులకు గుడ్‌బై చెప్పాలని చెప్పిన విషయాలు సూపర్. అమ్మానాన్నలకన్నా డాలర్లు ముఖ్యం కాదని మంచి చిత్రాన్ని రూపొందించారు. శతమానంభవతి అన్న పాట కన్నీరు పెట్టించింది. నరేష్ పాత్ర నవ్వించింది. నిత్యగా వేసిన అనుపమా పరమేశ్వరన్ మరదలు పాత్రలో మెరిసింది.
కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి

అలనాటి సంగతి
పద్మశ్రీవారి వింతకాపురం చిత్రంలో అటు పానుపు ఇటు నువ్వు అన్న పాట ఘంటసాల సుశీల పాడేటపుడు రెండు మూడు టేకులు తీసుకున్నారు. దర్శకుడు పుల్లయ్య సుశీలతో చరణం పాడాక నువ్వు పల్లవికి వచ్చినపుడు ‘అటు పానుపు’ అన్న మాట బాగా అనడంలేదని చెప్పారు. ఆవిడ ఒకింత మూతి ముడుచుకుని, అయతే ముందు పాడింది అక్కడ కలుపుకోండి అని వెళ్లిపోయిందట. మాస్టారు మాత్రం మైకు ముందు కదలకుండా కూర్చున్నారట. అదీ ఘంటసాల గొప్పతనం.
డొక్కా సోమశంకరం, వక్కలంక

చదివించాయి..
వెనె్నల్లో ఈవారం ప్రచురించిన ‘మనం మారలేమా?’ వ్యాసం చదివించింది. హీరోలు, నిర్మాతలు, దర్శకులు చెప్పిన పలు విషయాలు సినిమా పరిశ్రమను అద్దంలో చూపించినట్లుగా వున్నాయి. వారి మనసులో మాట చదివి సంతోషించాము. ఆంధ్రలో నారాయణమూర్తి సినిమా విడుదల కాలేదనడం మాలాంటి కళాకారులకు బాధ కలిగించింది. ఆ నటులకేరీ సాటి? అన్న వ్యాసం మానసికంగా ఆనందాన్నిచ్చింది. శరత్‌కాలమ్‌లో దర్శకేంద్రుడు పుల్లయ్య సమయ పాలన మళ్లీ మళ్లీ చదివించింది. సేకరణకర్తలకు కృతజ్ఞతలు. అలనాటి ఫొటోలను ప్రచురించటం బావుంది.
మంగం ఆనందరావు, వేగివారిపాలెం

పురస్కారాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి దాదాపు మూడేళ్లయినా ఏ రాష్ట్ర ప్రభుత్వము చలన చిత్రాలకు పురస్కారాలు ఇవ్వడానికి ముందుకు రాలేదు. మూడేళ్ల అవార్డులు ఒకేసారి పరిశీలించి ఉత్తమమైన వాటిని ఎంపిక చేయడానికి కమిటీలను నియమించారు. వారి సిఫార్సులనుబట్టి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు పురస్కారాలు ఇస్తే బాగుంటుంది. పక్కరాష్ట్రాల వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ దిశగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి వీలైనంత త్వరలో పురస్కారాలు ఇస్తే సంతోషం. సమయం తక్కువ అనుకుంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలనాడు అందజేస్తే ఆనందదాయకంగా వుంటుంది.
సిహెచ్.శివాజీరావు, చైతన్యపురి

జల్లికట్టు గోల
కోలీవుడ్‌లో జల్లికట్టుకు అపూర్వ మద్దతు ప్రకటించాక జరిగిన అల్లర్లను నిరసిస్తూ కమలహాసన్ పెటా ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. జల్లికట్టులో ఎద్దులను హింసించడం అయితే, ఎద్దులను చంపి తినడం, మాంసం ఎగుమతి చేయడం జంతు హింస కాదా? అని పెటాను నిలదీసారు. మన వర్మ జల్లికట్టుని సమర్ధించేవారిని జాలిలేని మూర్ఖులని నిందించాడు. సినిమాలో పాము, కుక్కలాంటివి చూపడాన్ని నిషేధించిన పెటాను జల్లికట్టు సమర్ధనకు ఎవరూ ఎందుకు నిరసించలేదని నిలదీసాడు. మరి సినిమాల్లో జంతువులను చూపరాదన్న పెటాను వర్మ ఎప్పుడూ విమర్శించనే లేదు. తానే చేయని పనిని ఇతరులు చేస్తే వారిపై ఆక్రోశం ఎందుకు?
కె.సాహిత్యదీప్తి, రమణయ్యపేట

శాతకర్ణి అదిరింది
బాలకృష్ణ హీరోగా గౌతమిపుత్ర శాతకర్ణి గూర్చి ప్రకటించగానే ఒక సందేహం వచ్చింది. ఈ కాలం యువత ఇలాంటి సినిమాలను ఆదరిస్తారా? అన్న అనుమానాలు కలిగాయ. కానీ ఆ సందేహం పటాపంచలైంది. ఎందుకంటే థియేటర్లలో యువకులే ఎక్కువ కనిపించారు. బాలకృష్ణ ఆ పాత్రకు తానే సరైన ఛాయిస్ అన్నట్లు నటించాడు. 78 రోజుల్లో భారీ సినిమాను ప్రణాళికతో ఎలా తీయాలో క్రిష్ నిరూపించాడు. సంక్రాంతికి పండుగ విందు తిన్న అనుభూతి కలిగింది.
బలివాడ నరసింహమూర్తి, శ్రీకాకుళం

వెనె్నల వెలుగులు
ఫ్లాష్ బ్యాక్‌లో అర్ధ శతాబ్దికి పైగా నిర్మించిన చిత్రాలు చాలా వున్నాయి. వందేమాతరం ఏ సంవత్సరంలో విడుదలైందో రాయలేదు. ఈ చిత్రం 1939లో, అంటే 77 ఏళ్ల క్రితం వచ్చింది. విశే్లషణ బాగుంది. మరో మంచి విశే్లషణ ‘ఆ నటులకేరి.. సాటి?’ కూడా పలుమార్లు చదివింప చేసింది. నాయికా నాయకుల సంబంధాలు అనేక సినిమాలలో వివిధరకాలుగా చూపారు. కానీ ఒకే ఒక్క సినిమా ఇలవేల్పులో ప్రియురాలు అంజలి, ఆ తర్వాత తల్లి అవుతుంది. ప్రియుడు నాగేశ్వరరావు ఆమెకు కొడుకు అవుతాడు. ఈ రెండు వైవిధ్యాలను నటీనటులు అద్భుతంగా రక్తికట్టించారు. ఇలా ఎన్నో ఉదాహరణలున్నాయి. శరత్‌కాలమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పెద్ద చిత్రాల చట్రాల కింద చిన్న సినిమా ఎలా ఛిద్రమైపోతుందో ఆర్.నారాయణమూర్తి చెప్పిన విషయం వాస్తవం!
ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్

కానిస్టేబుల్‌కు చోటులేదు
ఈ సంక్రాంతికి నాలుగు చిత్రాలు విజయవంతంగా ప్రదర్శించబడినాయి. కానీ లోబడ్జెట్ చిత్రంగా రూపొందించిన ‘కానిస్టేబుల్ వెంకట్రామయ్య’కు రాయలసీమలో థియేటర్లు ఇవ్వలేదు. అన్ని థియేటర్లలో ఖైదీ నెం-150, శాతకర్ణి వేసారు. ఇది చాలా దారుణమని ప్రశ్నిస్తే, మా ఇష్టం, మా హీరోల సినిమాలకు కలెక్షన్లు బాగా రావాలని చెబుతున్నారు. ఏది ఏమైనా చిన్న చిత్రాలకు థియేటర్లు ఇచ్చి ఆదుకోవాలి. లేకుంటే నిర్మాతలు రోడ్డున పడతారు.
ఎస్.జబీవుల్లా, ప్రొద్దుటూరు