మీ వ్యూస్

రెండూ కత్తులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండగ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు వచ్చిన ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి.. రెండూ కత్తులే. ‘కత్తి’ రీమేక్‌గా వచ్చిన ‘150’లో రికార్డు పెర్ఫార్మెన్స్ చూపించి చిరంజీవి తనకు తిరగులేదని అనిపించుకున్నాడు. పౌరాణిక, చారిత్రక, జానపద చిత్రాలతో తనకు తిరుగులేదనిపించుకున్న ఎన్టీఆర్ గుర్తుకొచ్చేలా ‘శాతకర్ణి’లో బాలయ్య రెచ్చిపోయాడు. ఇద్దరూ వెటరన్ ఆర్టిస్టులే అయినా, పాత్రలపరంగా తన సత్తా ఏమిటో పండుగ సినిమాల్లో రుచి చూపించారు. పాతికేళ్ల క్రితం నాటి చిరంజీవి -మళ్లీ అదే తరహా డ్యాన్సులతో ఆకట్టుకుంటే.. శాతకర్ణి తరహా పాత్రలు పోషించటంలో తనకు మరొకరు పోటీలేరని నిరూపించుకున్నాడు బాలకృష్ణ. ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా రెండు సినిమాలూ ప్రేక్షకులను అలరించాయి. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల దుమ్ము దులుపుతున్నాయి.
కెఎస్ రాజేశ్వర్, బెల్లంపల్లి

మంచి పరిణామం
టాలీవుడ్ ట్రెండ్ మారుతోంది. ఆరు పాటలు, నాలుగు ఫైట్ల సీక్వెన్స్ నుంచి కథా, కథనాలకు ప్రాథాన్యత పెరుగుతోన్న సినిమాలు వస్తున్నాయి. వీటి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం శుభపరిణామం. స్టార్‌హీరోల మాటెలావున్నా, వర్థమాన హీరోలు తెలివైన నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. హీరోయిజాన్ని నమ్ముకోకుండా చక్కని కథా కథనాల చిత్రాలు ఎంపిక చేసుకుని, పాత్రలపరంగా మంచి నటన చూపిస్తున్నారు. శర్వానంద్, నాని, నిఖిల్‌లాంటి హీరోలను ఈ జాబితాలో చేర్చొచ్చు. వీరి చిత్రాలు విడుదలవుతుంటే చాలు, సినిమా నూరు శాతం మంచి కథాచిత్రంగా ఉండొచ్చని ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు. దీంతో పెద్ద హీరోలూ ట్రెండ్ మార్చుకోక తప్పడం లేదు. ఇది ఎంతకాలం కొనసాగుతుందో తెలీదుకానీ, కథ కథనాలకు ప్రాధాన్యతనిచ్చే హీరోల సంఖ్య పెరిగితే మాత్రం టాలీవుడ్‌కు మంచి పరిణామం దాపురించినట్టే.
ఎస్ శ్రీనివాస రాజు, వనస్థలిపురం

పూర్ సుక్కూ..
‘రైటర్ కాళ్లు పట్టుకున్న మాస్టారు’ అంటూ ఈ మ్యాగజైన్‌లో హాస్యాస్పద సినీ సంగతి చదివాం. సుకుమార్ (మాస్టారు) నిర్మాతకు కథ చెప్పడానికి మూడు నాలుగు గుంటలు తీసుకుంటాడట. విజయేంద్ర ప్రసాద్ (రైటర్) 22 నిమిషాల్లోనే కథ అద్భుతంగా చెప్పినందుకు ఆయన్ని గురువుగా భావించి సుక్కు కాళ్లమీద పడ్డాడట. ఈ సంగతి భలే హాస్యాస్పందంగాను, ఆశ్చర్యంగానూ అనిపించింది. విషయమేంటంటే విజయేంద్రప్రసాద్ అంత గొప్ప రైటరా? అన్నది. ఆడియన్స్‌కి తెలిసినంత వరకూ ఆయన అందించిన కథలన్నీ సాదాసీదావే. ఇక బ్రహ్మాండపైన హిట్ అనిపించుకున్న బాహుబలి -విజువల్ ఫీస్ట్ తప్ప కథాపరంగా అంత గొప్ప సారవంతమైనదేమీ కాదు. ఇక బజరంగీ భాయిజాన్ అంటారా? పసివాడి ప్రాణం సినిమాకు కాపీ అని ఆయనే చెప్పుకున్నట్టు కథనాలు వినిపించాయి. అంతేకాదు, ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలన్నీ ఫ్లాపే. మరి.. సుక్కు ఎందుకు ఆయన కాళ్లుపట్టుకున్నట్టు?
ఎల్ ప్రసన్న, పేర్రాజుపేట

ఆదుర్తి కీర్తిని పెంచింది
మీకిష్టమైన దర్శకుడెవరు? అని అక్కినేనికి అడిగితే ఆదుర్తి సుబ్బారావు అని చెప్పేవారట. అన్నపూర్ణా సంస్థలో ఆదుర్తి ఎన్నో మంచి సినిమాలు చేశారు. ఆపాత సంగతులను ఫ్లాష్‌బ్యాక్‌లో చదివినపుడు ఆనందం కలిగింది. కెవి రెడ్డికి వచ్చిన చాన్స్‌ను ఆదుర్తికి అప్పగించటం ఒక విషయమైతే, తనను సిఫార్స్ చేసిన వ్యక్తి పేరు నిలిపేలా ఆదుర్తి ‘తోడికోడళ్లు’ చిత్రం తీయడం మరో గొప్ప విషయం. అలాంటి రోజుల నుంచి -పక్క దర్శకుడి చాన్స్ మాయోపాయాలతో లాక్కోవడం, వచ్చిన చాన్స్‌ని ఏమాత్రం కృషి చేయకుండా దుర్వినియోగం చేసుకోవడంలాంటి పరిస్థితులకు టాలీవుడ్ చేరుకుంది. అందుకే -అప్పట్లో వంద సినిమాలొస్తే ఏ ఒక్కటో ఫ్లాపయ్యేది. ఇప్పుడు వంద సినిమాల్లో ఏ ఒక్కటో ఓకే అనిపించుకుంటుంది. ఈ పరిస్థితిని సినిమా పరిశ్రమ ఎప్పటికి గ్రహించాలి. గ్రహించినా ఎప్పటికి మారాలి?
సివికె లక్ష్మి, నర్సాపురం

అంత.. ఫ్యాన్‌మెయిలా?
సాంఘిక చిత్రాల కథానాయకుడు అక్కినేని ఫ్యాన్ ఫాలోయింగ్ చదివినపుడు భలే ఆశ్చర్యం వేసింది. అప్పట్లోనే.. దేశ విదేశాల్లో మహిళాభిమానులు అక్కినేనిపట్ల అంత ఆదరణతో, మమకారంతో ఉండేవారా? అనిపించింది. ప్రేమ, విషాదం, సునిశితమైన హస్యం, అమాయక, బరువైన పాత్రలను నటనానుభవంతో పండించిన అక్కినేని -ఆదర్శంలోనూ అందరినీ మించినవాడే అనిపించింది. శరత్కాలంలో ఇటువంటి అపురూప సంగతులు అందిస్తున్న వెనె్నల బృందానికి ధన్యవాదాలు, అభినందనలు.
పన్నీటి జ్యోతి, మర్కాపురం

ఆనాటి వర్మ ఏడీ?
చిన్నప్పుడు కాకరకాయ అన్నవాడే, ఎదిగాక కీకరకాయ అన్నాడట. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఈ పోలిక సరిగ్గా సరిపోతుంది. తన క్రియేటివిటీతో టాలీవుడ్‌కు కొత్త టర్న్ ఇచ్చిన వర్మేనా -అతి సాధారణ, వివాదాస్పద చిత్రాలు తీస్తున్నది అనిపిస్తుంది. ఎంచుకుంటున్న కథల విషయంలో దర్శకుడిగా ఆయన ఎంత స్పష్టతతో ఉంటున్నాడో కూడా అర్థమవుతుంది. వర్మకంటూ ఓ ట్రాక్ ఉంది. ఆయన కంటెంట్ డిఫరెంట్‌గా ఉంటుంది. టేకింగ్ శైలి వైవిధ్యంగా ఉంటుంది. డ్రై సబ్జెక్టులో కూడా తనదైన మార్కు చూపించగల సత్తావుంది. ఇన్ని క్వాలిటీలు ఇప్పుడు వర్మలో ఏమైపోయాయి? అన్న సందేహం కలుగుతోంది సినిమాలు చూస్తుంటే. ఆధునిక టెక్నాలజీని సినిమాకు ఎంత గొప్పగా ఉపయోగించుకోవచ్చో ఇండస్ట్రీకి నేర్పించిన వర్మే, వినోదం మెడలువొంచి పాతాళానికి తొక్కేస్తున్న సినిమాలు తీస్తుంటే బాధ కలుగుతుంది. తన సత్తా అయిపోయిందని అనుకున్నపుడు -వర్మ గౌరవంగా తప్పుకోవడం ఉత్తమం కాదా? ఏమంటారు?
పి శ్రీనివాస్, జిగిత్యాల