మీ వ్యూస్

నెమరువేసుకుంటాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనె్నలలో పాత చిత్రాల సమీక్షలు ఇచ్చేటప్పుడు అవి విడుదలైన సంవత్సరం, ఆరోజు తేదీ, నెల వ్రాయడం లేదు. అవి రాయగలరని మనవి. అలానే ఆ చిత్రాల నిర్మాణం అయిన ప్రదేశాలు తెలియజేస్తే సమీక్ష చదివే పాఠకులకు తియ్యని అనుభూతులు పొందుతారు. ఎందుకంటే ఆనాడు సినిమాలు చూసిన ప్రేక్షకులంతా నేడు 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధ అభిమానులే. అందుకే ఆ జ్ఞాపకాలు నెమరువేసుకుంటారు. ఈ విషయం ఆయా రచయితలకు తెలియజేయండి. ఆనాటి పాటల పుస్తకాల్లో ఈ వివరాలు ఉండేవి. ఈ తరానికి ఇంటర్నేట్ ఆధారం అయినా అందరికీ అందుబాటులో లేదుకదా? మాలాంటి వారికి మీ దినపత్రికలే ఆధారం.
- బి.కాంతారావు, నాదెండ్ల

మింగుడు పడని పరిణామం
ముఖ్యమంత్రి చంద్రబాబు నటుడు బాలకృష్ణ వియ్యంకులయ్యాక లోకేష్‌ని భావి నేతగా తీర్చిదిద్దడానికి జూ.ఎన్టీఆర్‌ను దూరంగా పెట్టడానికి నిర్ణయం జరిగింది. బాబాయ్, అబ్బాయిల మధ్య వైరం రాజుకొని సంక్రాంతి నాటికి పరాకాష్ఠకు చేరింది. ఇద్దరి చిత్రాలు ఢీకొన్నాయి. అబ్బాయి థియేటర్లను లాక్కోవడం ప్రారంభించాడు బాబాయి. ఇక్కడ ఒక ఊహించని ట్విస్ట్! జగన్ రంగంలోకి దిగి అబ్బాయికి కొన్ని థియేటర్లు ఇప్పించాడు. బాబాయి ఎన్ని ఎత్తులు వేసినా అబ్బాయి తొలిసారి 50 కోట్ల గీత దాటడమేకాక, అమెరికాలో కూడా తొలిసారి విజృంభించి 13 కోట్లు వసూలుచేసి, బాబాయి క్రేజ్‌కి చెక్ పెట్టాడు. మొత్తానికి సంక్రాంతి చిత్రాల్లో అబ్బాయి మొదటి స్థానంలో ఉండగా బాబాయి మూడో స్థానానికి పడిపోయాడు. ఇది చంద్రబాబుకు మింగుడు పడని పరిణామం!
- ఎస్.కృష్ణ, కొండయ్యపాలెం

తగలబడే టాలీవుడ్!
అప్పట్లో ఓ చిత్రాన్ని రూపొందించాలంటే నలుగురు కలిసి చర్చించి, కథ స్క్రీన్‌ప్లే చక్కగా రాసుకున్న తర్వాత తగిన నటీనటుల్ని ఎంపిక చేసుకుని, ఆ తర్వాతే చిత్ర నిర్మాణం ప్రారంభించేవారు. ఇప్పుడంత తీరిక ఎవరికీ లేదు. ఇప్పుడు దర్శకుడు ఓ కానె్సప్ట్ అనుకుంటాడు. అది హీరోకి చెబుతాడు. తనని హైలెట్ చేసే సన్నివేశాలు హీరో ఉన్నాయి అనుకుంటే, పది పాత చిత్రాల్లోని సన్నివేశాలు ఎత్తుకొచ్చి అల్లేయమంటాడు. ఈ భావ దాస్యం ఏ స్థాయికి చేరిందంటే మూడు చిత్రాల నటుడు రాజ్‌తరుణ్‌కు సరిపోయే కథ వండేశారట! కథ పాతదే. ప్రజెంటేషన్ ఫ్రెష్ అని బడాయిలు చెప్పాడు దర్శకుడు. ఫ్రెష్‌కాదు తుస్ అన్నారు ప్రేక్షకులు. సీతమ్మ అందాలు ఎలా ఉన్నా రామయ్య సిత్రాలు తుస్సుమన్నాయి. ఎప్పుడైతే కథకు తగ్గ హీరోకాక హీరోకు కథ అనే కానె్సప్ట్ వచ్చిందో అప్పుడే టాలీవుడ్ తగలబడి పోయింది!
- ఎ.శాంతిసమీర, వాకలపూడి

కృషి చేయాలి
జరుగుతున్న సంఘటనలను గ్రంథస్థం చేయడం భారతీయులకు అలవాటు లేదు. ఆంగ్ల పాలన వచ్చాక చరిత్ర ప్రాముఖ్యం తెలిసి పరిశోధనలు చేసి, భారత చరిత్రకు ఒక రూపం ఇచ్చారు. ఒక తమిళుని హేళనవల్ల తెలుగు చిత్ర కళామతల్లి జన్మదినం తెలిసింది అంటే మనం సిగ్గుపడాలి! ఇకపై ‘మా’ ఆధ్వర్యంలో ఒక చరిత్ర అధ్యయనశాఖ ఏర్పాటుచేసి, పెద్ద రచయితల సహకారంతో సమగ్ర తెలుగు సినీ చరిత్రను సీడీల రూపంలో భద్రపరచి విస్తారంగా ప్రసారం చేయవలసిన అవసరం ఎంతైనా వుంది. తొలి జన్మదిన వేడుక సాదాసీదాగా జరిగినా అగ్రనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు లాంటి పెద్దవాళ్లను రంగంలోకి దించి, ప్రతి ఏటా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగే విధంగా ‘మా’కృషిచేయాలి.
- పి.చంపక్, మాధవనగరం

థియేటర్ అంటే భయం
రామ్‌గోపాల్‌వర్మ తీసిన మొదటి హారర్ సినిమా దయ్యం ప్రేక్షకాదరణ పొందడంతో, వెనకాముందూ చూడకుండా అరడజను దయ్యం సినిమాలు తీసి పారేశాడు. ఇందులో హారర్ కంటెంట్ కంటే కథాకథనాలు, నటుల హావభావాలు చూడలేక ప్రేక్షకులు దడుసుకున్నారు. ఇటీవలే హాలీవుడ్‌లో కూడా భయపడేలా దయ్యం సినిమాలు తీయనున్నట్లు వర్మ ప్రకటించాడు. అదే రీతిలో ప్రేక్షకుల ఖర్మకాలి, అరుంధతి, గీతాంజలి సినిమాలు హిట్ అవ్వడంవలన తెలుగు సినిమా పెద్దలు వరుసగా దయ్యం సినిమాలు తీస్తున్నారు.
అదీ కూడా హీరోయిన్‌కు దయ్యం వేషం వేసి సినిమాలు తీసేస్తున్నారు. అసలు హీరోయిన్లనే చూడలేకపోతున్న ప్రేక్షకులు వారిని దయ్యం వేషధారణలో అసలు భరించలేక థియేటర్ల ఛాయలకే రావడానికి భయపడుతున్నారు. హారర్ సినిమా అంటే థియేటర్లలో ప్రజలను భయపెట్టేటట్టు ఉండాలి కానీ, అసలు థియేటర్ల దరిదాపులకు రాకుండా భయపెట్టడం కాదని, తెలుగు సినిమావారు తెలుసుకోవాలి!!
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

గాన గంధర్వుడు
లోకాన్ని లాలించాడు
పాటను పాలించాడు
సంగీత స్వరాలకు సొగసులద్దాడు
గానాన్ని గౌరవించాడు
లీల లాంటి కోకిలనందించాడు
రెండు కళ్ల నటుల కీర్తిని తన కంఠంతో పెంచాడు
పాటలు పాడి వాటికి అమృతత్వాన్ని ఆపాదించాడు
శేషశైలవాసుని కీర్తనతో మనకు చూపునిచ్చాడు
గీతను గానంచేసి తాను జీవన గీత దాటాడు
గాన గంధర్వుడై గంధర్వులనే అబ్బురపరిచాడు
మనలను ధన్యులను చేసి తాను ధన్యజీవుడైనాడు
నవరసాల శాల మన ఘంటసాల
- ఎన్.ఆర్.లక్ష్మి, సికిందరాబాద్

ఆనాటి తరం
ఆనాటి తరం నటులు కాకరాల, కొంగర జగ్గయ్య, కైకాల సత్యనారాయణ, రావికొండలరావు లాంటి వారి పూర్వాశ్రమం, వారి పుట్టుపూర్వోత్తరాలు, ఆ తరం, మా తరం, నేటి తరం అభిమానులకు ఆమూలాగ్రంగా వెనె్నల విభాగం ద్వారా ప్రచురించమని కోరుతున్నాం.
- మంగం ఆనందరావు, వేగివారిపాలెం