మీ వ్యూస్

దెయ్యం ప్రేమ బావుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్, హెబ్బాపటేల్, నందితాశే్వత నటించిన ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ సినిమా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కథలో కథనంలో వెరైటీగావుంది. ముఖ్యంగా (ఆత్మ)దెయ్యం మనిషిని ప్రేమించడం అద్భుతం. అంతేకాదు మాటలు పర్వాలేదు. సంగీతం శేఖర్‌చంద్ర తనదైన శైలిలో అందించారు. కొద్దిగా అక్కడక్కడా బోర్ సన్నివేశాలున్నా మొత్తానికి యావరేజ్‌గా ఆడి తీరుతుంది. దర్శకుడి ప్రతిభ వి.ఐ.ఆనంద్ ఇంకా క్రొత్త కథలతో ప్రేక్షకులకు అందించగలరని ఆశిస్తాం.
-సిహెచ్ సాయిమన్విత, హైదరాబాద్

అంతమందా?
బాలనాగమ్మ ఫ్లాష్‌బ్యాక్ చదివితే ఎందరు బాలనాగమ్మలో! అని ఆశ్చర్యపోయాం. జెమినీ బాలనాగమ్మ హిట్ అయినా వేదాంతం రాఘవయ్యగారి బాలనాగమ్మ హేమాహేమీలు నటించినా ఫ్లాప్ అయింది. అందుకు కారణం మాంత్రికుడు, అతని డెన్ భయంకరంగా లేకపోవడమే. హారర్ సినిమాలో హారర్ లేనట్టు! తెలుగు, తమిళ, కన్నడిగులను మాత్రమేకాక హిందీవారినీ బాలనాగమ్మ ఆకర్షించడం ఆశ్చర్యమే. మదరిండియా లాంటి కళాఖండాన్ని నిర్మించిన మెహబూబ్‌ఖాన్ (అనుకుంటా) బాలనాగమ్మ కథను సాంఘికంగా మార్చి సన్నాఫ్ ఇండియాగా నిర్మిస్తే ఫ్లాప్ అయింది!
-పవన్‌పుత్ర, రామారావుపేట

దిగ్బ్రాంతికి గురయ్యాం..
ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు అకాల మృతికి యావత్తు సంగీత ప్రపంచానికి తీరని లోటు. కళాకారులకు పెద్దదిక్కుగా వున్న మురళీకృష్ణ చనిపోవడం కళాకారులకు విచారకరం. సంగీతం అంటే తెలియడానికి సరిపోయే వయస్సు లేనప్పటికీ సంగీతం గానం చేసి అందరిచేత ఔరా అనిపించిన వ్యక్తి బాలమురళీ. కష్టమైన రాగాలు పలికించడం కొత్త రాగాలని సృష్టించడం ఆయనే సాటిగా ప్రఖ్యాతి చెందారు. గానం కాకుండా నటించడంలో ఆయనకు ఆయనే సాటి. ఉదాహరణకు ఆయన నటించిన భక్తప్రహ్లాద చిత్రంలో ఆయన పోషించిన పాత్ర నారద పాత్ర. ఎప్పటికీ గుర్తుంటుంది. ఇంకా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించారు.
- పట్నాల సూర్యనారాయణ, రాజమండ్రి

చిన్న చూపు తగునా?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎందరో మహానటులను చూసాము. వారిలో శ్రీ కైకాల సత్యనారాయణ ఒకరు. ‘సిపాయికూతురు’ సినిమా ద్వారా హీరోగా రంగంలోకి ప్రవేశించిన ఆయన యముడు, కీచకుడు, దుర్యోధనుడు తదితర పౌరాణికాల్లోను ఆయన నటన నభూతోనభవిష్యతి అన్నట్లుగా మెప్పించగలిగిన దిట్ట. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శారద’ చిత్రంలో శారద అన్నయ్యగా ఆయన నటన అమోఘం. అప్పటికీ విలన్ పాత్రల్లో తిట్లు తిన్న ఆయన శారద చిత్రం ద్వారా అందరినీ కంట తడి పెట్టించిన పాత్ర అది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన అందెవేసిన చెయ్యి. హావభావాలు, నటనలోనూ ఆయన ఎక్కని మెట్లు లేవు. ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్న దాదాపు 1000 చిత్రాలు పైగా నటించిన ఆ మహానటుడ్ని అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపుచూడటం తగదు. నిన్నకాక మొన్న వచ్చిన నటులకు డాక్టరేట్లు, పద్మశ్రీలు ఇచ్చి కైకాల వంటి మహానటుడ్ని చిన్నచూపుచూడటం తగునా? నవ రస నటనా సార్వభౌమునికి ఇచ్చే గౌరవం ఇదేనా?
- యర్రగుంట్లపాటి శేషగిరిరావు

వెనె్నలకే వెనె్నల
మంగళవారం వెనె్నలకే వెనె్నలగా ప్రకాశిస్తూ మాలాంటి అభిమాన పాఠకులకు కళాత్మకమైన తృప్తిని ఆనందాన్ని అందిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్, శరత్కాలం ఈ రెండు ఈతరంవారిని ఎలా అలరిస్తుందో నాకు అవగాహనకు అందడం లేదుగాని, మాతరం పాఠకులకు మాత్రం నిరీక్షణలో మంగళవారంకోసం ఆర్తితో చూస్తుంటాం. ఫ్లాష్‌బ్యాక్, శరత్కాలం సేకరణకర్తలకు కళాభివందనాలతో.
- ఎం ఆనందరావు, వేగివారిపాలెం

అది.. పొరపాటు
15.11.2016 వెనె్నలలో ప్రచురించిన ‘జనరంజకం.. జానపదం’ వ్యాసం ప్రయత్నం మంచిదే. చివరిలో పొరపాటు దొర్లింది. ‘ఏడుకొండలస్వామి, ఎక్కడున్నావయ్యా..!’ పాట ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రంలోనిది కాదు. దానిని ఆత్రేయ రాయలేదు. ఆ పాటను రాసిన వారు కీ.శే.రావులపర్తి భద్రిరాజు.
- పైడిపాల, అమలాపురం

నటి సావిత్రి ఔదార్యం
1965వ సంవత్సరం ప్రముఖ హాస్య నటుడు బసవరాజు పద్మనాభంగారు రేఖా అండ్ మురళీ ఆర్ట్స్(స్వంత బ్యానర్) ‘దేవత’ చిత్రం ఆరంభ దశలో హీరోయిన్‌గా సావిత్రి గారిని ఎంపికచేశారు. కాని అప్పుడు ఆమె మూడునెలల గర్భవతి. అందుకు ఆమె ‘నేను యిప్పుడు గర్భవతిని. మరి చిత్రం పూర్తయ్యే సమయం సుమారు ఆరునెలలు పట్టవచ్చు. ఇబ్బంది అవుతుందని సావిత్రి అన్నది. అప్పుడు చిత్రం తీయాలంటే సుమారు 6 నెలలు, 9నెలల సమయం పట్టేది. ఇప్పటి మాదిరి 15రోజులకే నిర్మాణదశ కాదు. అప్పుడు పద్మనాభంగారు ‘ఈ చిత్రం సుమారు నాలుగునెలలకే పూర్తికాగలదు. మీకు ఏ యిబ్బంది కలుగదు’అని ధైర్యం చెప్పిన వెంటనే సావిత్రిగారు దేవత చిత్రంలో నటించడానికి అంగీకరించారు. అది ఆమె ఔదార్యానికి నిదర్శనం! పద్మనాభంగారు ఆ చిత్రం శరవేగంతో నిర్మించి విజయం సాధించారు.
-పవన్‌పుత్ర, రామారావుపేట