మీ వ్యూస్

ఏ కథలు ఉన్నాయో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో విజృంభించిన ముదురు శృంగారం, ముద్దులు ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రవేశించాయి. బాలీవుడ్ ముద్దులు కాస్త లైట్‌గానే ఉంటున్నాయి. సదరు హీరోల భార్యల స్పందన ఏమిటో? శివాయ్ చిత్రంలో హీరో గాఢ చుంభన చూసి భార్య కాజల్ నిరసించింది. పెళ్లికాకముందు చిత్రించిన ముద్దుసీనును పెళ్లయ్యాక తొలగించాడు అక్షయ్‌కుమార్. భార్య ప్రతాపానికి జడిసి షారుఖ్ ముద్దులు మానేశాడు. నమ్రత చూసి ఓకే చెప్తేనే సినిమాలో మహేష్‌బాబు ముద్దు కనిపించింది. పెళ్లయ్యాక అల్లు అర్జున్ ముద్దులు మానేశాడు. ఈ ముద్దులు బాలీవుడ్‌లో విడాకుల వరకు వెళ్లాయి. భార్యలున్న హీరోలు వారి అనుమతితోనే ముద్దు సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఏ ముద్దెనకాల ఏ కథ వుందో?
- హెచ్.పవనపుత్ర, రామారావుపేట

అలా ఇచ్చారు
వెనె్నలలో ఆస్తిపరులు చిత్రం గురించి రాస్తూ సినిమా విజయవంతం అయ్యందని రాశారు. కానీ తమిళ అనువాదం కనె్నపిల్ల (రవిచంద్రన్, జయలలిత) సినిమా ముందు ఆస్తిపరులు అప్పట్లో వెలవెలపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌లో నివాసం ఏర్పరుచుకున్న తర్వాత ఆయన చిత్రాలకే బంగారునంది, వెండి నంది, కాంస్య నందులను ప్రకటించారు. 1966లో వచ్చిన అంతస్తులు చిత్రానికి బంగారు నంది ఇచ్చి ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాండవీయం చిత్రానికి వెండి నంది ప్రకటించారు. కాంస్య నంది ఆత్మగౌరవం చిత్రానికి ఇచ్చారు. భార్యాభర్తలు సినిమా తమిళ ఆధారంతో తీస్తే దానికి బంగారు నంది ప్రకటించి, ఎవిఎం వారి భక్తప్రహ్లాద చిత్రానికి వెండి నంది ప్రకటించారు. ఇదంతా అప్పట్లో అక్కినేని మెప్పుకోసం చేసిందే!
- పి.రామకృష్ణ, ఆదోని

కాస్ట్యూమ్ కల్లోలం
దక్షిణాది చిత్రాల్లో కాస్ట్యూమ్స్ కల్లోలం రేపుతున్నాయి. దుస్తులు సౌకర్యంగా లేవు అన్నందుకు చిరంజీవి చిత్రం నుండి కేథరిన్‌ను తప్పించారు. ఆ సంఘటన మరవక ముందే కాస్ట్యూమ్స్ మరొకర్ని కాటేశాయి. శభాష్‌నాయుడు చిత్రంలో కమలహాసన్, శృతి హాసన్ నటిస్తుండగా కాస్ట్యూమ్ డిజైనర్‌గా గౌతమి పనిచేస్తోంది. ఆమె రూపొందించిన దుస్తులు శృతికి నచ్చక గౌతమి మీద నోరుపారేసుకుంది. కమల్ కలగజేసుకోకపోవడంతో గౌతమి బాధపడింది. ఇంకా ఇలాంటి వికారాలు ఎన్ని జరిగాయో తెలియదు గానీ, తమ 13 ఏళ్ళ అనుబంధాన్ని తుంచేసుకుని గౌతమి తన కూతురు సుబ్బులక్ష్మితో వెళ్లిపోయింది. ఆహా! కాస్ట్యూమ్స్ కాటు!
- బి.స్నేహమాధురి, పెద్దాపురం

సృజనాత్మకత
కళాకారుల్లో ఉన్న సృజనాత్మకతను ఎవరూ అడ్డుకోజాలరంటూ తన చిత్రం ఏ దిల్‌హై ముష్కిల్‌లో పాక్ నటుడిని సమర్ధించి, వివాదగ్రస్తుడైన కరణ్‌జోహార్‌ని మరో వివాదం చుట్టుకుంది. ప్రఖ్యాత గాయకుడు మహ్మద్ రఫీ పాడితే ఏడ్చినట్టు ఉంటుందని ఆ చిత్రంలో ఓ హీరోయిన్ అంటుంది. దాంతో సామాజిక మాధ్యమాల్లో విమర్శల జడివాన ప్రారంభమైంది. సెన్సార్ చైర్మన్ చిత్రాన్ని చూసి ఆ డైలాగ్ రఫీని అవమానించేటట్టు ఉందని అంగీకరించి కూడా ఎందుకు వదిలేశారో తెలుసుకోమని విచారణ కమిటీని వేశారు. అది కరణ్‌జోహార్ సృజనాత్మకం అంటే అది!
- ఎ.చైతన్య, వాకలపూడి

అసంతృప్తి
పరిశ్రమలో హిట్లు ఉన్నాయి కానీ గొప్ప చిత్రాలే రావడంలేదు అంటూ చెప్పిన వ్యాసం బాగుంది. థియేటర్లలో రేట్లకు భయపడి మేము టీవీలోనే సినిమాలు చూస్తున్నాం. సూపర్ హిట్ అంటున్నారు, పైగా త్రివిక్రమ్ చిత్రం కదా అని అఆను ఆసక్తిగా చూశాం. దాని మాతృక మీనా అని తెలుసు. అయితే అఆల మధ్య ప్రేమ అంకురించి వృద్ధి చెందడం సరిగా పిక్చరైజేషన్ చేయలేదు. పాత్రల వ్యక్తిత్వాలు బలంగా తీర్చిదిద్దలేదు. హీరో చెల్లి పెళ్లిచూపుల్లో సమంత వెకిలి చేష్టలు చూశాక త్రివిక్రమ్ ఇలా కూడా తీయగలడా అని దిగ్భ్రాంతి చెందాం. దర్శకత్వానికి కొత్త అయినా విజయనిర్మల మీనా చిత్రంలో సన్నివేశాలు, పాత్రల వ్యక్తిత్వాలు చక్కగా అర్ధమయ్యేలా తీసింది. త్రివిక్రమ్ ఆపాటి కూడా చేయలేగపోవడం అసంతృప్తి కలిగించింది.
-ఆర్.సత్య, కరప

డౌన్ డౌన్
స్టార్‌డమ్ డమ్ వ్యాసం బాగుంది. ఇమేజ్ చట్రంలో ఇమిడిపోమని చెబుతున్న హీరోలు అదే ఇమేజ్‌లోనుంచి బయటపడలేకపోతున్నారు. వీరికి ఏవో కొన్ని హిట్లు వరిస్తే అదే మూసలో వారికోసం కథలను తయారుచేస్తున్నారు. అవి తుస్సుమంటున్నాయి. కథలను బట్టి నటులా, నటులను బట్టి కథలా? పూర్వం కథల ప్రకారం నటీనటుల ఎంపిక జరిగేది. ఉదాహరణకు రక్తసంబంధంలో మొదట ఏఎన్‌ఆర్‌ను అనుకుని, ఎన్టీఆర్‌కు ఇచ్చారు. దేవదాసులో షావుకారు జానకి నిర్ణయమైన తరువాత సావిత్రిని, మిస్సమ్మలో భానుమతి స్థానంలో సావిత్రి ఇలా మార్పులు జరిగినా అవి సక్సెస్ అయ్యాయ. మంచి కథలను నటులను దృష్టిలో పెట్టుకొని రాయొద్దు. నటులచేత బాగా నటింపచేసే దర్శకులు కావాలి. ఆదుర్తి సుబ్బారావు, కె.వి.రెడ్డి లాంటి వారు ఇప్పటితరం దర్శకులు ఆదర్శంగా తీసుకోవాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

హిందీ చిత్రమా?
ఓ ఆంగ్ల దినపత్రిక ప్రకారం బాహుబలి హిందీ చిత్రం కనాకష్టంగా వంద కోట్లు సాధించిందని చెప్పింది. అక్కడ కలక్షన్లను పెంచుకోడానికే బాహుబలి-2 ఫస్ట్‌లుక్‌ని మామి ఫిలిమ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. దానికితోడు అతి చిన్న ఛానల్‌కు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అదే సమయంలో అమీర్‌ఖాన్ పాత చిత్రం ప్రదర్శిస్తుంటే జనం ఎగబడి వెళ్లారు. సీట్లు దొరకని వారు మాత్రం బాహుబలి వేడుకకు వచ్చారు. అది డబ్బింగ్ కాక హిందీ సినిమా అన్నట్లుగా హైప్‌చేసి తాము ఉపయోగించిన సరికొత్త టెక్నిక్ గురించి ఉపన్యాసాలు దంచినా స్పందన రాలేదు. బాహుబలి-1ను పంపిణీ చేసిన కరణ్‌జోహార్, బాహుబలి-2 జోలికి రావడానికి భయపడుతున్నారట!
- సి.మైథిలి, సర్పవరం