మీ వ్యూస్

హారర్ పిచ్చి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత కొంతకాలంగా తెలుగు పరిశ్రమను హారర్, ఆత్మనేపథ్య కథలు ఆవహింయి. పిచ్చి ముదిరి పెద్ద స్టార్లూ ఇలాంటి కథలపై మోజు పెంచుకున్నారు. దీంతో ఇతర భాషల్లోని హారర్ చిత్రాలు అనువాదాలుగా క్యూకట్టి దాడి చేస్తున్నాయి. ప్రేమకథాచిత్రమ్, త్రిపుర, గీతాంజలి, చిత్రాంగద, చంద్రకళ, శివగామిలాంటి చిత్రాలు విజయం సాధింస్తే, నిన్నగాక మొన్నవచ్చిన అభినేత్రి కూడా ఎంటర్‌టైన్‌చేసింది. మొన్నటి సంక్రాంతికి నాగార్జున సోగ్గాడే చిన్నినాయనాలో ఆత్మగా కనిపించాడు కూడా. హారర్ చిత్రాలపై మోజుపెంచుకుని రాజుగారింట్లోనూ నటిస్తానంటున్నాడు. సినిమాలో తప్ప కథనంలో ఆత్మలేని చిత్రాలు అపజయాల బావుటాను ఎగరేస్తున్నా -హారర్ అంటే చాలు పిచ్చిపట్టినట్టు సినిమాలు తీసేస్తున్నారు. ఈ పిచ్చి ఎక్కడాగుతుందో.
-పివిఎస్ రావు, అద్దంకి
పంచ్ నమ్మాడు
మొన్నొచ్చిన జక్కన్న పంచ్‌లనే నమ్ముకుని బండి లాగేద్దామనుకున్నా -ఆకారంలో వచ్చేసిన మార్పు పాపం సనీల్ పంట పండకుండా చేసింది. సునీల్ లావయ్యాడు. క్యారెక్టర్‌కు తగినట్టు మేకోవర్‌లో కూడా మార్పు చూపించలేకపోయాడు. జుట్టు పల్చబడింది. దవడలు వ్యాయామం లేక వెడల్పయ్యాయి. దీంతో హుషారు చూపించినా మాస్ సినిమాగా టిక్కెట్లు తెగలేదు. కథానాయిక మైనస్. నీరసమైన పాటలు. సప్తగిరి, పృథ్వి, షకలక శంకర్, ప్రభాస్ శ్రీను నవ్వించే ప్రయత్నంలో స్పూఫ్‌లు చేశారు. మొత్తంగా జక్కన్నతో సునీల్ కెరీర్ స్లో అయపోయంది.
-కాళిదాసు, కావలి
ఆణిముత్యాలు
వెనె్నల ద్వారా ఆ తరం చిత్రాలతోపాటు శరత్‌కాలమ్‌లో అప్పటితరం నటులు మరికొందరి విశేషాలు తెలుసుకుంటున్నాం. నేటితరం నిర్మాతలు, రచయితలు, దర్శకుల గురించి కూడా ఇస్తే ఇంకా ఆనందం. భీష్మ, నర్తనశాల, శకుంతల, అనసూయ, భూకైలాస్, మాయాబజార్, గుండమ్మకథ, కలసివుంటే కలదు సుఖం, ఆత్మబంధువు, ఆత్మీయులు, ఏకవీర, సారంగధర, తాత మనవడు, కురుక్షేత్రం, అల్లూరి సీతారామరాజు, పరివర్తన, సంతానం.. ఇటువంటి పౌరాణిక జానపద భారత రామాయణ సాంఘిక చిత్రాలు ఇప్పుడు ఆణిముత్యాలుగా మారాయి. కొత్త సినిమాలు వచ్చి, పాత వాటికి మరింత విలువ కలిగేలా చేస్తున్నాయి.
-ఎం ఆనందరావు, వేగివారిపాలెం
విపరీతం
అందమైన విపరీతం వ్యాసం ఆలోచింపజేసింది. అసలు సెన్సార్ బోర్డే అనవసరం అంటాడు వర్మ. బాగులేని దృశ్యాలను దర్శకుడే తొలగిస్తే సెన్సార్ ఎందుకు? శ్యామ్‌బెనగల్ లాంటివారు భారతీయులు. ముద్దులు, కౌగిలింతలు చూసి జడుసుకుంటారా? వాటిని ఎందుకు తొలగించాలి అంటారు. అయితే అలాంటి దృశ్యాలు పబ్లిక్‌గా చూడడానికి స్ర్తిలు ఇష్టపడరు. అదీకాక అలాటి దృశ్యాలు చూసి పక్కనున్న మహిళలను వేధించవచ్చు. అందుకే స్ర్తిలు అలాంటి సినిమాలకు రారు. ఆమేరకు నిర్మాతకు నష్టమే. అంతా చూపించేస్తే ఇక చూడడానికి ఏం మిగులుతుంది? అందుకే బూతు చిత్రాలు ఫెయిలౌతున్నాయి.
-బి ప్రభాస్, గాంధీనగర్
సినిమా పేర్లు
ఇటీవల సినిమా పేర్లు అడ్డదిడ్డంగా కాసుల కోసమే అన్నట్టుగా పెట్టేస్తున్నారు. పోలీసోడు అనే చిత్రంపై వివాదం రేగింది. గొల్లభామ కూడా కోర్టుదాకా వెళ్లింది. నోటికొచ్చిన ఊతపదం సినిమా పేరు పెడితే వచ్చే అనర్థాలు ఎన్నో. గుంటూరోడు అనే సినిమా పేరు ఎబ్బెట్టుగా ఉంది. సీమ ప్రాంతంవారిని అవమాన పరిచినట్టుగా, వినడానికి అసహ్యంగా వుంది. ఇటువంటి పేర్లు తెలుగు సినిమాకు కళంకంలా దాపురించాయి.
-కెవి ప్రసాదరావు, కందుకూరు
ఆశించవచ్చా?
మన సినిమా వాళ్లల్లో క్రమశిక్షణే కొరవడుతుందని అప్పుడప్పుడు అనిపిస్తుంది అన్నాడు పూరి జగన్నాథ్. ఇష్టమైనప్పుడే పనిచేయ్. ఇష్టంవచ్చినట్టు చెయ్.. అనే సూత్రాన్ని రామ్‌గోపాల్‌వర్మ నుంచి అందిపుచ్చుకున్న పూరి, క్రమశిక్షణ గురించి మాట్లాడటం ఆశ్చర్యమే. హీరోల్ని బేవర్స్‌వాళ్లలా నిర్లక్ష్య నిక్షేప రాయుళ్లుగా చూపించడం ప్రారంభించిందే పూరి జగన్నాథ్. ఆమధ్య తన మొత్తం సిబ్బందిని తొలగించి కొత్త సిబ్బందిని నియమించుకున్నాడు. టెంపర్ చిత్రంలో హీరో కానె్సప్ట్ మార్చాడు. ఇజంలోనూ మార్చినట్టుగా ఉంది. ఇప్పుడు క్రమశిక్షణ అంటున్నాడు. పూరి మారినట్లేనా, అతని నుండి కొత్తతరహా చిత్రాలు ఆశించవచ్చా?
-ఆర్ మరుదకాశి, కరప
ప్రస్తుతం ఖాళీ
వరుస పరాజయాలతో రవితేజ నిరాశ నిస్పృహలకు లోనయ్యాడా? అంటే ఔననే అంటున్నారు మిత్రులు. మంచి కథకోసం తాపత్రయ పడకుండా, అందిన కథలో వేళ్లెట్టి, కాళ్లెట్టి అది మార్చండి, ఇది తీసేయండి అంటూ నస పెట్టడంతో -ప్రాజెక్టులన్నీ చేజారిపోయాయి. రవితేజతో నిర్మాతలు సినిమా తీయడమే మానుకున్నారు. దామోదరప్రసాద్ నిర్మించాలనుకున్న సినిమా ఇదేవిధంగా అటకెక్కింది. తన స్థాయి తగ్గలేదని చెప్పడానికి కాబోలు ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసి, బాబి దర్శకత్వంలో ప్రారంభం కావలసిన చిత్రాన్ని చేజార్చుకున్నాడాయన. ప్రాజెక్టు మొదలవుతుందని చెప్పుకోవడమే తప్ప, ప్రస్తుతం రవితేజ ఖాళీ!
-కె హితేష్, రమణయ్యపేట

చరిత్ర సృష్టించాలని...
శరత్‌కాలమ్‌లో ‘చరిత్ర సృష్టించిన ఆవేశం’ అంటూ మహాకవి క్షేత్రయ్య సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు విశేషాలతో అంజలిదేవి, ఆదినారాయణ, సిఎస్‌రావుల ఫొటో అలనాటి తీపిగుర్తుగా చూపారు. అక్కినేని దొరబాబు చిత్రం తర్వాత అనారోగ్యంతో వైద్యం నిమిత్తం అమెరికాకు వెళ్లి సుదీర్ఘకాలం తర్వాత తిరిగి వచ్చి, మహాకవి క్షేత్రయ్యలో నటించారు అనడం మరో విశేషం. శరత్‌కాలమ్ ఆనాటి చిత్ర విశేషాలు చిత్రాలతో దిగ్విజయ యాత్ర కొనసాగి, వందవ ఎపిసోడ్ చేరుకొని చరిత్ర సృష్టించాలని అభిమానుల కోరిక.
-ఉప్పు సత్యనారాయణ, తెనాలి