మీ వ్యూస్

పాపం.. సునీల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో ఇమేజ్ కోసం కమెడియన్ సునీల్ పడుతోన్న కష్టానికి తగిన ఫలితం ఈసారీ అందలేదనిపిస్తోంది. హీరోగా రెండు మూడు హిట్లు తన ఖాతాలో వేసుకున్నా -మర్యాద రామన్నలాంటి హిట్లు సునీల్ టాలెంట్ కంటే రాజవౌళిలాంటి దర్శకుల ద్వారానే అందాయని చెప్పాలి. సునీల్ తనంతట తానుగా సాధించిన హిట్లు ఏమున్నాయని ప్రశ్నించుకుంటే -ఏమీ లేనట్టే. ఇంతకుముందు కృష్ణాష్టమి, ఆ తరువాత జక్కన్న.. ఇప్పుడు తాజాగా ‘ఈడు గోల్డ్ ఎహె’. ఇవేవీ సునీల్‌కు కొత్త ఇమేజ్‌కు తెచ్చిపెట్టలేకపోయాయ. పైగా, ఉన్న ఇమేజ్‌ను కిందికు దించేశాయన్న అపవాదు ఎదుర్కోవాల్సి వచ్చింది. సునీల్ బాడీ లాంగ్వేజ్‌కు తగిన కొత్త కథ, కథనాలతో మళ్లీ స్క్రీన్‌మీద మెరిస్తే తప్ప అతన్ని హీరోగా ఇక గుర్తించడం ఆడియన్స్‌కు కష్టమే. కష్టకాలంలో సునీల్‌కు మళ్లీ లైఫ్ దక్కాలంటే -అతని మిత్రుడని చెప్పుకుంటున్న త్రివిక్రమ్ చేయ చేసుకోవాలేమో. మర్యాద రామన్నతో దర్శకుడు రాజవౌళి లైఫ్ ఇచ్చినట్టుగానే -వైవిధ్యమైన కథతో త్రివిక్రమ్ చేయ అందిస్తే తప్ప సునీల్ హీరోగా నిలబడటం కష్టమేననడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.
డా. ప్రతాప్ అరిగెల, విజయవాడ
‘అతి’కినట్టున్నా...
మలయాళంలో విజయవంతమైన ‘షట్టర్’ చిత్రానికి రీమేక్‌గా -తెలుగులో ప్రకాష్‌రాజ్ దర్శకత్వం వహించిన మనవూరి రామాయణం ఏమంత గొప్పగా లేదు. అందరిచేత పెద్దమనిషిలా గౌరవం పొందే భుజంగయ్య పాత్ర అతనికి అతికినట్టున్నా -పాత్ర తీరును ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. పైగా -ఒక్కోసారి ప్రకాష్‌రాజ్ ఓవర్‌యాక్షన్ ఎబ్బెట్టుగా అనిపించింది. ఏమాత్రం అతిని ప్రదర్శించకుండా మంచి పాత్రను కళ్లముందుంచితే ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారనడంలో సందేహం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సబ్జెక్టు మార్చుకుని ఉంటే బావుండేది. పైగా, సినిమాను సరైన సమయంలో విడుదల చేయలేకపోయారన్న మీడియా వాదనతో ఏకీభవించాలి. విడుదలకు కొంతకాలం వేచివుంటే ఫలితం మరోలా ఉండేదేమో.
కెవి వసంతలక్ష్మి, అమలాపురం
నృత్య తారలు
తమ అంద చందాలతో ఎందరో కథానాయకులను మెప్పించిన నృత్య తారలు ఆ సినిమా విజయానికి కారణవౌతారు. వారు మాత్రం గుర్తింపు లేకుండా మిగిలిపోతారు. ఎల్.విజయలక్ష్మి, లలిత, పద్మిని, రాగిణి, గీతాంజలి, జ్యోతిలక్ష్మి తదితరులు అప్పట్లో నృత్యాలు చేశారు. ఆ తరువాత రీతా, హలం, అనురాధ, జయమాలిని లాంటి వాళ్లు భరతనాట్యం, కూచిపూడి లాంటివి కూడా తెరపై అద్భుతంగా అభినయించారు. ఇంకా ఎందరో నృత్య కళాకారిణిలుగా తెలుగు చిత్ర సీమను ఏలారు. కానీ వారి వెనకున్న నృత్య తారలు మాత్రం ఎప్పుడూ తెరవెనుకే ఉండిపోతారు. ఇప్పుడిక వాళ్లకు అసలు పేరొచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే - పీలికల గుడ్డలేసుకుని లేదూ బాడీ షేపులన్నీ బహిర్గతమయ్యేలా హీరోయనే్ల తోచిన కాడికి డాన్స్‌లు చేసేస్తూ వీటినే ఐటెమ్స్ అనో, ప్రత్యేక గీతాలనో అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. వీరికి నైపుణ్యం సాధించిన నృత్యతారల కంపోజిషన్స్ అవసరం లేదు కనుక నిజమైన నృత్య తారలు ఇక కనుమరుగైనట్టే.
- మంగం ఆనందరావు, వేగివారిపాలెం
ఘోస్ట్ రైటర్లు
షోస్ట్ రైటర్లు అనబడే తెరవెనుక రచయితలు నేడు సినీ రంగంలో వేతన కూలీలుగామారిపోయారు. సమర్థులు అయినా వారు అసమర్థులుగా చీకట్లోనే మగ్గిపోతున్నారు. అగ్రదర్శకులకు ఊపిరి సలపని అవకాశాలు వచ్చిపడుతుండటంతో, వారిని సంతృప్తిపరచడానికి, అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఘోస్ట్ రైటర్లను పెట్టుకుంటున్నారు. అవకాశాలకోసం తిరిగే కొత్త రచయితలను చేరదీసి వారి రచనల్ని స్వీకరిస్తూ, శ్రమదోపిడీతోపాటు సృజనాత్మక దోపిడీ ఇండస్ట్రీలో జరుగుతుందన్నది కాదనలేని నిజం. టైటిల్ కార్డులో పేర్లు ఇవ్వకుండా టీం పేరు వేయడం వెనుక అసలు రహస్యం ఇదే. ఆ తరువాత జంట రచయితలు ఈ పద్ధతిని మరింత అభివృద్ధి చేశారు. నేడు మంచి పేరులోకి వచ్చిన ప్రతి దర్శకుడు, రచయిత ఈ విధానానే్న పరిపుష్టం చేస్తున్నారు. హిట్ సాధించిన ప్రతి రచయిత దర్శకుడిగా అవతారం ఎత్తుతున్నారూ అంటే, ఒకప్పట్లో వారూ ఇలాంటివారి దగ్గర ఘోస్ట్ రైటర్లుగా వున్నవాళ్లే. ఏదిఏమైనా అలాంటివారి కష్టంతో, తెలివితేటలతో పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నవాళ్లు ఆలోచించకుండా తామే గొప్పవాళ్ళని విర్రవీగుతారు.
-పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి
ఎటుపోతున్నాం...
సినిమాలకు ప్రేక్షకులు కరువాచిన పరిస్థితి కనిపిస్తోంది. పండుగకో పబ్బానికో అన్నట్టు చూడదగ్గ సినిమాలు ఒకటో రెండో వచ్చిపోవడం తప్ప, వారం వారం నాలుగైదు కొత్త సినిమాలు వస్తున్నా ఆడియన్స్ మెప్పు పొందుతున్నది ఒక్కటీ ఉండటం లేదు. గుర్తు పెట్టుకోదగ్గ సినిమా ఒక్కటీ చూడకుండానే ఏడాది పూర్తవుతుందన్న ఫీలింగ్ కలుగుతోంది. వందల సంఖ్యలో తెలుగు చిత్రాలు విడుదలైనా -ఈ ఏడాది పది పదిహేను చిత్రాలు తప్ప మిగిలిన వేటికీ పెద్దగా ఆదరణ లభించలేదు. దీన్నిబట్టి చూస్తుంటే -తెలుగు చిత్ర పరిశ్రమ ఎటు పోతుందో ఊహించుకుంటుంటేనే బాధ కలుగుతోంది.
జి రమణ, వరంగల్
లేచిపడ్డ కెరటం
దర్శకుడు శేఖర్ కమ్ముల ఆనంద్, హ్యాపీడేస్, లీడర్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి సినిమాలు తీశాడు. మొదటి రెండు సినిమాలు హిట్టు. మిగతావి ఫట్ అవడంతో ప్రస్తుతం సినిమాలు తీయడం లేదనుకుంటాను. ఒక్కసారిగా లేచిపడ్డ కెరటంలా ఆయన సినిమాలు తీసి ఆగిపోయారు. హిట్ల సినిమాలు వచ్చాక ఆయన ఆలోచనా దృక్పధంలో మార్పులు వచ్చినట్టుగా వుంది. అందుకే ప్రేక్షకులు మెచ్చే చిత్రాలను తీయలేకపోతున్నాడు. కొంతమందికి వెలుగు కొంతకాలమే ఉంటుంది అనడానికి శేఖర్ కమ్ముల ఓ ఉదాహరణ. తాజాగా హీరో వరుణ్ తేజ్‌తో లవ్ ఎంటర్‌టైనర్‌గా తీసుకొస్తున్న ఫిదా చిత్రం దర్శకుడు శేఖర్ కమ్ములకు ఎలాంటి ఫలితాన్ని తెస్తుందో చూడాలి.
-పి రామకృష్ణ, ఆదోని